తెలంగాణ

telangana

ఈటీవీ భారత్ - ముఖ్యాంశాలు

By

Published : Sep 13, 2021, 5:54 AM IST

Updated : Sep 13, 2021, 8:06 PM IST

TOP NEWS OF THE HOUR
TOP NEWS OF THE HOUR

19:54 September 13

టాప్ న్యూస్ @8PM

  • కొత్త వేరియంట్ వస్తేనే మూడో వేవ్

కొత్త వేరియంట్ వస్తేనే మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.4 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల డెంగ్యూ కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.

  • నలుగురు కలిసి మహిళను వివస్త్రను చేసి

ఓ మహిళపై కొందరు కిరాతకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెను వివస్త్రను చేసి, లైంగికంగా వేధించారు. ఆ దృశ్యాలను తమ ఫోన్​లో బంధించారు. 8 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • మెగాస్టార్​ చిరంజీవికి చంద్రబాబు ఫోన్..

మెగాస్టార్ చిరంజీవికి తెదేపా అధినేత చంద్రబాబు ఫొన్ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్​తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • నవదీప్​ను సుదీర్ఘంగా విచారిస్తున్న ఈడీ

టాలీవుడ్‌ డ్రగ్​ కేసులో సినీ నటుడు నవదీప్‌, ఎఫ్​ క్లబ్ జీఎమ్​ విక్రమ్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. నవదీప్, కెల్విన్ మధ్య లావాదేవీలు జరిగాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

  • చైతూ ట్వీట్​కు సమంత రిప్లై

సమంత-నాగచైతన్య రిలేషన్​ గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటికి చెక్ పెడుతూ చైతూ ట్వీట్​ను సమంత రీట్వీట్ చేసింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.

19:54 September 13

టాప్ న్యూస్ @7PM

  • నగరంలో పలుచోట్ల వర్షం

భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. నగరంలో ఒక్కసారిగా వాన కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్టారు. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాగల రెండు రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.

  • దేశంలో 75 కోట్లు దాటిన వ్యాక్సినేషన్​

భారత్​లో టీకా పంపిణీ సంఖ్య 75 కోట్లు దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కేవలం 13 రోజుల్లోనే పంపిణీ (covid vaccine) సంఖ్య 65 కోట్ల నుంచి 75 కోట్లకు చేరింది.

  • నీట్ నుంచి మినహాయింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్​పై కీలక బిల్లును తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించే బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

  • అఖిల్-పూజా రొమాన్స్..

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్, పెళ్లి సందD, ది దిల్లీ ఫైల్స్, రీసౌండ్, గణేశ్ బెల్లంకొండ కొత్త చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

  • 'టీమ్ఇండియాతో సిరీస్​ ఆలోచనే లేదు'

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు కొత్త ఛైర్మన్​గా(PCB Chairman) ఎన్నికైన తర్వాత మాజీ క్రికెటర్​ రమీజ్​ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్​(Ramiz Raja on India) గురించి మీడియా సమావేశంలో స్పందించాడు. మరోవైపు ఐసీసీ టీ20 ప్రపంచకప్​ కోసం పాక్​ బోర్డు, ఇద్దరు విదేశీ క్రికెటర్లను కోచ్​ల బృందంలో ఎంపికచేసింది.

19:54 September 13

టాప్ న్యూస్ @6PM

  • గ్రామ కమిటీలు పూర్తి చేయాలి

తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) సమావేశమయ్యారు. పార్టీ (TRS) సంస్థాగత కమిటీల ఏర్పాటుపై సమీక్షించారు. ఈ నెల 15 నాటికి గ్రామకమిటీల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. కమిటీల్లో మహిళా కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు.

  • భాజపా గూటికి మాజీ రాష్ట్రపతి మనవడు

మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ మనవడు ఇంద్రజిత్​ సింగ్ భాజపాలో చేరారు. వచ్చే ఏడాది పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు(Punjab Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు.

  • జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం నిరీక్షణ..

జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం విద్యార్థుల నిరీక్షణ తప్పడం లేదు. ఫలితాల కోసం 4 రోజులుగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ర్యాంకుల వెల్లడిలో జాప్యంతో జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లపై గందరగోళం నెలకొంది.

  • 'నెట్' మూవీ.. వలలో పడింది ఎవరు?

తెలుగులో వచ్చిన భిన్న ప్రయత్నం 'నెట్'. టెక్నో థ్రిల్లర్ కథతో తీసిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది. మరి ఎలా ఉంది? దీని కథేంటి? తదితర సంగతుల కోసం ఈ రివ్యూ చదివేయండి.

  • అమెరికా చేతికి అఫ్గాన్​ సూపర్​ కమాండోలు

అమెరికా సీఐఏ శిక్షణ ఇచ్చిన అఫ్గాన్ కామాండోలు ఖతార్​ మీదగా అగ్రరాజ్యానికి చేరుకున్నారు(us army in afghanistan). వీరి సంఖ్య 20వేలకుపైగా ఉంటుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా మోహరించేందుకు వీలుగా, ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉండే ఈ అఫ్గాన్​ కమాండోలు.. అగ్రరాజ్యానికి దక్కడం సానుకూలాంశం. మరి వీరితో అమెరికా ఎలాంటి ఆపరేషన్​ చేపడుతుంది?

16:42 September 13

టాప్ న్యూస్ @5PM

  • కొవాగ్జిన్​కు ఈ వారంలోనే డబ్ల్యూహెచ్​ఓ గుర్తింపు!

భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ కరోనా టీకాకు ఈ వారంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించే అవకాశముందని ఏఎన్​ఐ వార్తాసంస్థ వెల్లడించింది. సంబంధిత వర్గాలు తమకు ఈమేరకు చెప్పినట్లు ట్వీట్ చేసింది.

  • రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా?

సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్​ మహానగరం రోడ్లపై వ్యర్థాలు వేసే వారిపై చర్యలు తీసుకుంటోంది జీహెచ్​ఎంసీ. రోడ్లపై మట్టి, వ్యర్థాలు వేస్తున్న వారికి జరిమానాలు వేస్తోంది. మాదాపూర్ ఖానామెట్‌లో అరబిందో కన్స్రక్షన్ కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది.

  • అలా అయితే మీ డేటా గోవిందా

మీ ఏటీఎం కార్డు పిన్​ నెంబర్, ఇతర కీలక డేటాను ఎలా భద్రపరుస్తున్నారు? స్వయంగా గుర్తుపెట్టుకుంటారా? లేక ఎక్కడైనా రాసిపెట్టుకుంటారా? ఒక వేళ ఆ సమాచారాన్ని ఫోన్​లో కనుక సేవ్ చేస్తే! (online safety).. ఇక అంతే సంగతులు!

  • రోడ్డు పక్కన హోటల్​లో అల్లు అర్జున్​..

ఐకాన్ స్టార్ బన్నీ.. తన సింప్లిసిటీ చూపించారు. 'పుష్ప' షూటింగ్​కు వెళ్తూ, రోడ్డు పక్కన ఓ హోటల్​లో అల్పహారం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్​గా మారింది.

  • ఫిట్​గా ఉండాలంటే ఇవి తినాల్సిందే!

శరీరం ఫిట్​గా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం. అందుకు సరైన పోషకాహారం, మంచి జీవనశైలి ఎంతో ముఖ్యం. వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి మన శరీరం ఎల్లప్పుడూ ఫిట్​గా (Fitness), ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి డైట్​ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

15:57 September 13

టాప్ న్యూస్ @4PM

  • నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరణ

హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం ఇచ్చిన తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై జీహెచ్‌ఎంసీ అధికారులు రివ్యూ పిటిషన్‌ వేశారు. ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది.

  • దళితబంధు అమలుపై కేసీఆర్ సమీక్ష

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు(dalitha bandhu) పైలట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైంది. దళితబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్‌(kcr review on dalitha bandhu) సమీక్షిస్తున్నారు. హుజూరాబాద్‌తో పాటు మరో 4 మండలాల్లో దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు.

  • లోదుస్తుల్లో కిలో బంగారం స్మగ్లింగ్​

దిల్లీ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు (gold smuggling latest news) యత్నించిన ఇద్దరు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 45.65 లక్షలు ఉంటుందన్నది అధికారుల అంచనా.

  • కంటతడి పెట్టిన జకోవిచ్‌!​

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓటమిపాలైన నొవాక్​ జకోవిచ్(Novak Djokovic us open)​ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ ఏడాది 'క్యాలెండర్‌ స్లామ్‌' సాధించి చరిత్ర సృష్టించాలన్న అతని కలకు మెద్వెదెవ్​ అడ్డుకట్ట వేశాడు. దీంతో తన రాకెట్‌ను నేలకేసి కొట్టి కన్నీటి పర్యంతమయ్యాడు జకోవిచ్​. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్‌గా (Djokovic viral video)మారింది.

  • చైనా-పాక్​తో కలిసి భారత యుద్ధ విన్యాసాలు!

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రష్యాలో జరగనున్న యుద్ధ విన్యాసాల్లో భారత్​ భాగం కానుంది. ఇదే కార్యక్రమంలో చైనా-పాక్ కూడా పాల్గొననున్నాయి(india china border news).

14:36 September 13

టాప్ న్యూస్ @3PM

  • గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ (Gujarat Governor) ఆచార్య దేవవ్రత్ ప్రమాణస్వీకారం చేయించారు.

  • ‘నల్లధనం’ కేసులో విస్తుపోయే అంశాలు

సినీఫక్కిలో ప్లాన్​లు వేశారు.. నల్లదనం ఉన్న బడాబాబులకు డబ్బు మార్చి ఇవ్వడమే పని అంటూ.. డబ్బుపై ఆత్యాశతో.. డబ్బునే ఎరగా వేసి మోసం చేద్దామనుకున్నారు. ఓక ముఠాగా ఏర్పడి చివరకు హైదరాబాద్ పోలీసులు చిక్కారు.

  • లాయర్ జేబులో పేలిన ఫోన్..

తన వన్​ప్లస్​ నార్డ్-2 స్మార్ట్​ఫోన్ జేబులోనే పేలిపోయిందని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు దిల్లీకి చెందిన ఓ న్యాయవాది. 90 శాతం ఛార్జింగ్​తో ఉన్న మొబైల్​ ఉన్నట్టుండి కాలిపోయిందని చెప్పారు. ఆ సమయంలో ఫోన్ వాడట్లేదని పేర్కొన్నారు. ఈ సంస్థపై బ్యాన్ విధించేలా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.

  • ఫ్యాషన్​ డిజైనర్​తో 'ఊసరవెల్లి' నటుడి నిశ్చితార్థం

అభిమానుల ఊహాగానాలను నిజం చేశాడు బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్​. ఫ్యాషన్​ డిజైనర్​ నందితా మహతానితో తనకు నిశ్చితార్థం(Vidyut Jammwal engaged ) అయినట్లు తెలిపాడు.

  • వారు వైదొలిగారు.. వీరు వచ్చారు!

మరో వారంలో ప్రారంభంకానున్న ఐపీఎల్(ipl 2021)​ రెండో దశకు పలువురు స్టార్​ ఆటగాళ్లు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. వారి స్థానాల్లో మిగతా ప్లేయర్స్​తో భర్తీ చేశాయి ఆయా ఫ్రాంచైజీలు. మరి వారెవరంటే?

13:58 September 13

టాప్ న్యూస్ @2PM

  • అమరావతి రైతులకు ఊరట

ఆంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకున ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన రిటర్న్‌ గిప్ట్‌ ప్లాట్లను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో సంబంధిత రైతులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఇవాళ దానిపై విచారణ జరిగింది.

  • ప్రభుత్వ తీరు దారుణం

హైదరాబాద్​ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచార ఘటనపై ప్రభుత్వం ఇంతవరకూ స్పందించకపోవడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతవేటు దూరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా.. ఇప్పటివరకూ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడమేంటని మండిపడ్డారు. 

  • మెయిన్స్​ ఫలితాలు నేడే..

జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు (JEE MAIN RESULTS) నేడు (సోమవారం) వెల్లడికానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) అధికారిక వెబ్​సైట్​లో నుంచి స్కోర్​కార్డ్ (JEE score card), ర్యాంక్​ లిస్ట్ డౌన్​లోడ్ చేసుకోవచ్చు. 

  • చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్​!

వచ్చే నెల చివరినాటికి 5 నుంచి 11 ఏళ్ల వయసు చిన్నారుల (vaccine for children) కోసం కొవిడ్ వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని తెలిపారు అమెరికా ఆరోగ్య నిపుణులు. పిల్లల టీకాకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్​ను మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

  • ఫ్యాషన్​ డిజైనర్​తో బాలీవుడ్ నటుడి నిశ్చితార్థం

బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్​పై అభిమానుల ఊహాగానాలు నిజమయ్యాయి. ఆయనకు ఫ్యాషన్​ డిజైనర్​ నందితా మహతానితో నిశ్చితార్థం(Vidyut Jammwal engaged) జరిగిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్​స్టా వేదికగా వెల్లండిచాడు.

12:24 September 13

టాప్ న్యూస్ @1PM

  • కేసీఆర్, కేటీఆర్ స్పందించకపోవడం దారుణం

వినాయక చవితి రోజు నగరం నడిబొడ్డులో గిరిజన బాలికపై జరిగిన అన్యాయంపై... ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించకపోవడంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్​ను పంపి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని వ్యాఖ్యానించారు.

  • ఫోన్ కోసం అక్కాతమ్ముళ్ల గొడవ

మొబైల్ ఫోన్​లో గేమ్స్​ ఆడే​ విషయంలో అక్కాతమ్ముళ్ల మధ్య తలెత్తిన గొడవ.. విషాదానికి దారి తీసింది. కోపోద్రిక్తురాలైన ఓ టీనేజ్​ బాలిక.. ఎలుకల్ని చంపే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

  • తితిదే బ్రాండ్​తో అగరబత్తీలు

తిరుపతిలోని ఎస్వీ గోశాలలో తితిదే అగరబత్తీలను(TTD Incense Sticks) ఆ సంస్థ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా 7 బ్రాండ్లతో అగరబత్తీలను విక్రయించనున్నట్లు తెలిపారు.

  • స్వల్పంగా పెరిగిన పసిడి ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర సోమవారం స్వల్పంగా పెరిగింది. మరోవైపు.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్థిరంగా ఉన్నాయి.

  • రిలయన్స్, టీ-సిరీస్ ఒప్పందం.. 

భారీ, మధ్య తరహా సినిమాలను(big budget movies) తెరకెక్కించేందుకు రెండు బడా సంస్థలు చేతులు కలిపాయి. దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో 10కిపైగా చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవిక అంశాల ఆధారంగా విభిన్న సినిమాలను రూపొందించనున్నాయి.

11:54 September 13

టాప్ న్యూస్ @12NOON

  • ఈడీ విచారణకు నవదీప్‌

 టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు సోమవారం ఉదయం నటుడు నవదీప్‌ హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

  • యాదాద్రిలో సీఎం పర్యటన!

సీఎం కేసీఆర్(cm kcr) వచ్చే వారంలో యాదాద్రిలో(yadadri) పర్యటించే అవకాశం ఉంది. క్షేత్రాభివృద్ది పనులను మరోసారి పరిశీలించనున్నారు. యాడా(ytda) అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. ఆలయ ఉద్ఘాటనకు శుభ ముహూర్తం ఖరారు చేసేందుకు ముందస్తుగా చినజీయర్‌ స్వామితో కలిసి వారం రోజుల్లో యాదాద్రికి వస్తారని యాడా అధికారులు భావిస్తున్నారు.

  • ఉగ్రవాదానికి చెక్ పెట్టేలా 'నాట్​గ్రిడ్'

ఉగ్రవాదానికి చెక్​పెట్టే నాట్​గ్రిడ్ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. కరోనా లేకపోయి ఉంటే ఇప్పటికే ఇది ప్రారంభమై ఉండేదని ఇటీవల హోంమంత్రి అమిత్​షా ఓ కార్యక్రమంలో చెప్పారు. నాట్​గ్రిడ్​తో ఉగ్రవాదుల సమాచారంతో పాటు ఆర్థిక నేరాలు, ఇతర కీలక విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

  • రిటైర్మెంట్​ ప్రకటించిన స్టార్​ క్రికెటర్​

జింబాబ్వే మాజీ సారథి బ్రెండన్​ టేలర్​(brendan taylor retirement) అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని తెలుపుతూ భావోద్వేగ ట్వీట్​ చేశాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

  • చైతూ, సాయి పల్లవి కెమెస్ట్రీ సూపర్!

నాగ చైతన్య, సాయిపల్లవి ప్రధానపాత్రల్లో నటించిన 'లవ్​స్టోరీ' ట్రైలర్(lovestory trailer) విడుదలైంది. చైతూ, పల్లవి జోడీ చూడముచ్చటగా ఉంది. లవ్, రొమాన్స్, సెంటిమెంట్, బ్యూటిఫుల్​ మ్యూజిక్​తో ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.

11:13 September 13

టాప్ న్యూస్ @11AM

సీఎం ఆదేశించినా ఇంత నిర్లక్ష్యమా?

ఇంటి పైకెక్కి చేయి ఎత్తితే తాకే 11కేవీ లైన్లు.. ఇంటిని ఆనుకొని వేసే కరెంటు స్తంభాలు.. ఎప్పుడెప్పుడా అని బలికోరుతూ నోళ్లు వెళ్లబెట్టుకుని ఎదురుచూస్తున్న విద్యుత్తు నియంత్రికలు, ఫ్యూజ్‌ బాక్సులు. రాజధాని వ్యాప్తంగా పరిస్థితి ఇదే.

  • క్షిపణులతో మళ్లీ సవాళ్లు విసురుతున్న కిమ్​!

అణుకార్యకలాపాల విషయంలో ఉత్తర కొరియా(North Korea Nuclear Weapons) మళ్లీ దూకుడు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా.. సుదూర లక్ష్యాలను ఛేదించే ఓ క్రూయిజ్ క్షిపణిని(Long Range Cruise Missile) ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది.

  • దున్నపోతుపై వచ్చి ఎలక్షన్ నామినేషన్

ఎన్నికల నామినేషన్ అంటే అభ్యర్థుల ఆడంబరాలు అంతా ఇంతా కాదు. రోడ్​షోలు, ర్యాలీలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. గ్రామాల్లో జరిగే చిన్నపాటి ఎన్నికల్లో కూడా కొందరు తమ అనుచరులతో కలిసి అట్టహాసంగా నామినేషన్ (Election nomination) వేస్తుంటారు. అయితే, ఓ అభ్యర్థి విచిత్రంగా దున్నపోతుపై ఊరేగింపుగా వచ్చారు.

గర్భిణీ భార్యకు హెచ్​ఐవీ ఇంజెక్షన్​ ఇచ్చిన భర్త

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ భర్త అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. గర్భిణీ భార్యకు హెచ్​ఐవీ రోగికి ఉపయోగించిన సూదితో ఇంజెక్షన్​ చేశాడు. విడాకులు కావాలని విచక్షణా రహితంగా ప్రవర్తించాడు.

  • ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ భార్య కన్నుమూత

ప్రముఖ నటుడు ఉత్తేజ్​ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆయన భార్య పద్మావతి కన్నుమూశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

09:52 September 13

టాప్ న్యూస్ @10AM

  • నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్

గణేశ్‌ నిమజ్జనంపై తీర్పును పునఃపరిశీలించాలని హైకోర్టులో(high court) జీహెచ్‌ఎంసీ(GHMC) కమిషనర్ లోకేశ్‌ కుమార్‌ రివ్యూ పిటిషన్(review petition) దాఖలు చేశారు. తీర్పులో 4 అంశాలు తొలగించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(pop) విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. హుస్సేన్‌సాగర్, జలాశయాల్లో నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అనుమతించాలని కోరారు.  

  • అదృశ్యమైన బాలిక ఘటన విషాదాంతం

పాల బుగ్గల పసిప్రాయం.. మాటలు తిరగని.. నకడలు నేర్వని.. బోసి నవ్వుల 13నెలల పసితనం.. ఇంతలోనే విషాదం. ఊహించని ప్రమాదం. నవ్వులతో కనిపించే చిన్నారి... తొట్టెలో మృతదేహమై కనిపించింది. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. మిస్టరిగా మారిన చిన్నారి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • 'ఆ తర్వాతే నిందితునికి బెయిల్'

నిందితుడి నేర చరిత్రను పరిశీలించిన తర్వాతే బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఆరోపణల తీవ్రతతో పాటు పలు అంశాలను పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని పేర్కొంది.

  • ఆ ఫలితం తర్వాతే స్వదేశానికి రవిశాస్త్రి

టీమ్​ఇండియా హెడ్​ కోచ్ రవిశాస్త్రి (ravi shastri) త్వరలోనే భారత్​ చేరుకునే అవకాశం ఉంది. కరోనా బారినపడి ఇంగ్లాండ్​లో ఐసోలేషన్​లో ఉన్న శాస్త్రికి సోమవారం ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో నెగిటివ్​గా తేలితే బుధవారం యూకే నుంచి బయలుదేరుతారు.

  • చూపులతో కట్టిపడేస్తున్న 'కర్ణన్'​ బ్యూటీ

మలయాళ నటి రజిష విజయన్​.. తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ తన అందంతో యూత్​లో క్రేజ్​ సంపాదించుకుంది. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్​లో ఉంటుంది. ఇవాళ ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై ఓ లుక్కేద్దాం..

08:54 September 13

టాప్ న్యూస్ @9AM

  • నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ

నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించిన కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్​పై ఈరోజు దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో సమీక్ష నిర్వహించనున్నారు.

  • పురోగతి పూజ్యం.. ఆధారాలు దొరకని వైనం

టాలీవుడ్‌ మత్తు మందుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేపట్టిన దర్యాప్తు అగమ్యగోచరంగా తయారయింది. విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖుల నుంచి నిధుల బదిలీకి సంబంధించిన వివరాలు రాబట్టడం అసాధ్యంగా మారింది. ఇప్పటి వరకూ.. ఆరుగురిని విచారించినా నిధుల బదిలీపై ఆధారాలేవీ లభించలేదు. దాంతో కేసు పరిస్థితి చీకట్లో బాణం వేస్తున్నట్లుగా మారింది.

  • ఆ బాధ్యతకు రోహిత్‌ సమర్థుడు: ఛాపెల్‌

టీమ్​ఇండియాను ప్రశంసించాడు ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌(Ian Chappell Rohit Sharma). భారత జట్టు టెస్ట్​ కెప్టెన్సీపై(Rohit Sharma test captaincy) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ బాధ్యతను రోహిత్‌శర్మ సమర్థంగా నిర్వర్తించగలడని అభిప్రాయపడ్డాడు.

  • ఆ అంతిమయాత్ర లాహోర్‌ నుంచి కోల్‌కతా దాకా

అతడేమీ జాతీయనేత కాదు... అందరికీ తెలిసిన ఉద్యమకారుడూ కాదు... తల పండిన అనుభవజ్ఞుడూ కాదు... 25 ఏళ్ల కుర్రాడంతే! కానీ అతడు చనిపోయాడని తెలియగానే యావద్దేశం ఊగిపోయింది... అంతిమయాత్రకు లక్షల మంది తరలివస్తే... బ్రిటిష్‌ ప్రభుత్వం(British Government) కదిలిపోయింది!

  • వారం వారం అందాల హారం

'సంక్రాంతికి ఒకటి.. ఉగాదికి మరొకటి.. దసరాకీ ఇంకొకటి' అంటూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేస్తుంటారు కథానాయికలు. సినీప్రియులకు సొగసులు వినోదం కొసరి కొసరి వడ్డిస్తుంటారు. అయితే వారి వేగానికి కొన్నాళ్లుగా కరోనా రూపంలో కళ్లెం పడ్డట్లయింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులన్నీ కుదుటపడుతున్నాయి. మునుపటికంటే వేగంగా వారాల వ్యవధిలోనే తమ చిత్రాలతో వయ్యారి భామలు దూసుకొస్తున్నారు. వరుస చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.

08:04 September 13

టాప్ న్యూస్ @8AM

  • విద్యుత్తు వినియోగం పైపైకి 

వ్యవసాయ విద్యుత్తు వినియోగం పైపైకి ఎగబాకుతోంది. సాగునీటి అవసరాల కోసం రైతులు పెద్ద సంఖ్యలో బోరు బావులు తవ్వుతున్నారు. వీటి నిర్వహణకు విద్యుత్తు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏటా కొత్త కనెక్షన్ల సంఖ్య 75 వేలకు పైగా ఉంటోందంటే వ్యవసాయ రంగానికి కరెంటు ఎంత మేరకు అవసరం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

  • బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర

అన్నా.. ఎట్లున్నవే.. అక్కా డబుల్‌ బెడ్‌రూం ఇల్లు వచ్చిందా.. తమ్మీ ఏంచదువుకున్నవ్‌.. ఉద్యోగం వచ్చిందా... ఇలా ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ.., స్థానికుల సమస్యలు ఆలకిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటూ.. తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. 

  • తాలిబన్లను ఎదుర్కొనేందుకు కసరత్తు!

అఫ్గాన్​ పరిణామాల(Afghan Crisis) ప్రభావం భారత్ సహా చాలా దేశాలపై పడనుంది. గతంలో తాలిబన్లు కశ్మీర్​లోకి(kashmir Taliban) చొరబడిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లు భవిష్యత్​లో భారత్​కు ముప్పుగా పరిణమిస్తే.. వాటిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు(Indian Security Forces) కసరత్తు ప్రారంభించాయి.

  • 'సచిన్‌ నుంచే ఆ లక్షణం నేర్చుకున్నా'

క్రికెట్ దిగ్గజం సచిన్ ప్రవర్తన తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపాడు టోక్యో పారాలింపిక్స్‌ పసిడి పతక విజేత ప్రమోద్‌ భగత్‌ (pramod bhagat sachin). ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే లక్షణం అతడి నుంచే నేర్చుకున్నట్లు చెప్పాడు.

  • రామోజీ ఫిల్మ్‌సిటీలో నాగ్​ 'బంగార్రాజు'!

నాగార్జున,నాగచైతన్య నటిస్తున్న 'బంగార్రాజు' (Bangarraju movie Naga Chaitanya) సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కర్ణాటకలో కొన్ని సన్నివేశాలను షూట్​ చేసిన చిత్ర బృందం.. రామోజీ ఫిల్మ్‌ సిటీలో(Bangarraju movie shooting location) మరిన్ని సీన్​లను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

06:39 September 13

టాప్ న్యూస్ @7AM

  • అన్నింటికీ ఒకే డిజైన్‌... అదే పెద్ద లోపం..!

రాష్ట్రంలో నిర్మించిన కొన్ని చెక్‌డ్యాంలలో లొసుగులు(quality defect in construction) బయటపడుతున్నాయి. డిజైన్‌ లోపాలు, నాణ్యత లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పది కాలాల పాటు నిలవాల్సిన కాంక్రీట్‌ నిర్మాణాలు ఏడాదికే కొట్టుకుపోతున్నాయి.

  • కమలదళంలో ఎందుకీ 'ముఖ్య' మార్పులు?

ఎన్నికలు సమీపిస్తున్న పలు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు చేస్తూ వస్తోంది భాజపా అధిష్ఠానం. ఉత్తరాఖండ్​తో మొదలైన ఈ మార్పులు.. కర్ణాటక నుంచి గుజరాత్​ వరకు వచ్చాయి. అయితే.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిల్లీ నాయకత్వం పావులు కదుపుతోందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ మార్పులు ఏ మేరకు ఫలితాలనిస్తాయో చూడాల్సిందే.

  • చాలా రోజుల తర్వాత విధులకు అఫ్గాన్‌ మహిళలు!

తాలిబన్లు పాలన చేపట్టే నాటికి అల్లకల్లోలంగా ఉన్న కాబుల్ విమానాశ్రయం ఇప్పుడిప్పుడే తెరచుకుంటోంది. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొందరు మహిళల(Afghan women work) విధులకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా మహిళలు ఉద్యోగంలో చేరడానికి తాలిబన్లు అనుమతిచ్చిన అతి కొద్ది మంది మహిళల్లో వీరు ఉన్నారు.

  • గూగుల్​లో డార్క్​మోడ్​ కావాలంటే..!

ప్రముఖ సెర్చ్​ఇంజన్​ గూగుల్​లో డార్క్​మోడ్​ ఫీచర్​ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్​ను పొందాలంటే ఏమి చేయాలో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.

  • విద్యుత్తు వాహన ఛార్జర్లు ఉంటేనే అనుమతి!

ప్రపంచంలోనే కొత్త ఇళ్లకు ఛార్జింగ్‌ పాయింట్లను తప్పని సరి చేసిన దేశంగా ఇంగ్లాండ్‌ నిలవనుంది. కట్టే ప్రతి ఇంటికి ఛార్జింగ్‌ పాయింట్‌ను తప్పనిసరి చేస్తూ త్వరలోనే చట్టం చేయనుంది.
 

05:02 September 13

TOP NEWS

  • సారంగపూర్‌ పంపుహౌస్‌ నీట మునక

వర్షాలతో పంటలే కాదు.. పంపులు కూడా నీట మునిగాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏడో లింకులోని 20వ ప్యాకేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు నిజామాబాద్‌ శివారులోని సారంగపూర్‌ వద్ద పంపుహౌస్‌ నిర్మించారు. ఇందులో రెండు మోటార్ల బిగింపు పూర్తవగా.. మూడోది బిగించే పనులు కొనసాగుతున్నాయి. ఒక పంపు ద్వారా మరో నెల రోజుల్లో నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో 6 రోజుల కింద కురిసిన వర్షాలకు.. ఎస్సారెస్పీ ప్రాజెక్టు వెనుక జలాల వరద పంపుహౌస్‌లోకి చేరింది. దీంతో ఇక్కడ జరిగే పనులకు ఆటంకం ఏర్పడింది.

  • వరిసాగు వద్దని తేల్చిచెప్పిన సీఎం

వచ్చే యాసంగి నుంచి వరి వేయడమంటే.. రైతులు ఉరి వేసుకోవడమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అభిప్రాయపడింది. ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమన్న కేంద్ర నిర్ణయంతో.. రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని.. రైతులు ఇకముందు వరిపంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని అధికారులు అభిప్రాయపడ్డారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే.. రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది.

  • అప్రమత్తత తప్పదు

రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా ప్రత్యేకడ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కరోనా ప్రస్తుతం పూర్తి నియంత్రణలోనే ఉన్నప్పటికీ... భవిష్యత్‌లో ప్రజలకు వైరస్‌తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్(vaccine special drive) చేపట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ కరోనా ప్రభావం పెద్దగా లేదన్న వైద్యాధికారులు.. వైరస్‌ ఎక్కువయ్యే అవకాశాలు కనిపించడం లేదని వివరించారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక నుంచి వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.

  • నేడు సన్నాహక సమావేశం

నాలుగు మండలాల్లో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. దళితబంధు పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.

  • నేడు విచారణకు నవదీప్

డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సినీ దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నందు, రానా, రవితేజతో పాటు అతని డ్రైవర్‌ శ్రీనివాస్​లను విచారించారు. వరుస సెలవుల అనంతరం ఇవాళ నవదీప్‌, ఎఫ్ ​క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

  • 74 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

కేరళలో కరోనా కేసులు(Corona cases) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 20,240 మందికి వైరస్(Covid-19 virus) నిర్ధరణ అయింది. మహమ్మారితో మరో 67 మంది మృతిచెందారు. మరోవైపు దేశంలో మొత్తం కొవిడ్ టీకా డోసుల పంపిణీ(Covid vaccination) 74 కోట్లు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • కాల్పులు.. ఆపై పరారీ

అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు. నడుచుకుంటూ వెళ్తున్నబృందంపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

  • సేవలు బంద్​

జొమాటో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రానందుకు గ్రోసరీ సేవలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి తమ ప్లాట్​ఫాంపై గ్రోసరీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నట్లు తెలిపింది.

  • జకోవిచ్‌కు నిరాశ..

ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ యుఎస్‌ ఓపెన్​లో(US Open 2021) సెర్బియా ఆటగాడు నొవాక్‌ జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. రష్యా ప్లేయర్ మెద్వెదేవ్ చేతిలో ఓడిన జకో.. ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు అందుకున్న ఆటగాడి రికార్డుకు అడుగు దూరంలోనే ఆగిపోయాడు.

  • ఛాన్స్ రాగానే కంగారుపడ్డా

హీరో నితిన్​తో కలిసి 'మాస్ట్రో' చేసిన నభా నటేశ్.. సినిమా విశేషాలు వెల్లడించింది. ఇందులో తాను సరికొత్తగా కనిపిస్తానని చెప్పుకొచ్చింది. అన్నిరకాల పాత్రలు చేయాలనేది తన ఉద్దేశమని తెలిపింది.

Last Updated :Sep 13, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details