Inspiration
ఇతరులపై నిజంగా ఆసక్తి చూపడం ద్వారా మీరు రెండు నెలల్లో ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోవచ్చు, రెండేళ్లలో ఇతరులలో మీ పట్ల ఆసక్తిని కలిగిస్తే ఇంకా ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోవచ్చు - డేల్ కార్నెగీ

ఇతర ముఖ్యాంశాలు

రాష్ట్రం

లైవ్‌ Live Updates: వ్యాపారం చేసేవారిని ప్రోత్సహిస్తున్నాం - విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం

30th CII Partnership Summit @ Visakha: విశాఖ భాగస్వామ్య సదస్సు వేదికగా పెట్టుబడుల జాతర మొదలైంది. వివిధ దేశాల నుంచి అధిక సంఖ్యలో పారిశ్రామికవేత్తలు ఇప్పటికే సాగరతీరానికి చేరుకున్నారు. నగరంలో ఎటు చూసినా సదస్సు సందడే కన్పిస్తోంది. ఇవాళ, రేపు దాదాపు 10 లక్షల కోట్ల విలువైన మరిన్ని ఒప్పందాలు జరగనున్నాయి. పెట్టుబడుల సదస్సు కోసం విశాఖ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. విశాఖ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సును భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ప్రారంభించారు. దేశ, విదేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలిరానున్నాయి. ఇప్పటికే 40 దేశాల నుంచి ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. 

November 14, 2025 at 11:49 AM IST

Inspiration

ఇతరులపై నిజంగా ఆసక్తి చూపడం ద్వారా మీరు రెండు నెలల్లో ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోవచ్చు, రెండేళ్లలో ఇతరులలో మీ పట్ల ఆసక్తిని కలిగిస్తే ఇంకా ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకోవచ్చు

డేల్ కార్నెగీ

లేటెస్ట్‌