ETV Bharat / business

లాయర్ జేబులో పేలిన ఫోన్.. కోర్టులో విచారణ జరుగుతుండగా...

author img

By

Published : Sep 13, 2021, 1:58 PM IST

తన వన్​ప్లస్​ నార్డ్-2 స్మార్ట్​ఫోన్ జేబులోనే పేలిపోయిందని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు దిల్లీకి చెందిన ఓ న్యాయవాది. 90 శాతం ఛార్జింగ్​తో ఉన్న మొబైల్​ ఉన్నట్టుండి కాలిపోయిందని చెప్పారు. ఆ సమయంలో ఫోన్ వాడట్లేదని పేర్కొన్నారు. ఈ సంస్థపై బ్యాన్ విధించేలా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.

OnePlus Nord 2 caught fire and exploded
లాయర్ జేబులో పేలిన వన్​ప్లస్ నార్డ్​-2 ఫోన్​!

దిల్లీకి చెందిన న్యాయవాది గౌరవ్​ గులాటి.. తాను కొత్తగా కొనుగోలు చేసిన వన్​ప్లస్ నార్డ్​-2 స్మార్ట్​ఫోన్​ జేబులోనే పేలిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​లో షేర్ చేశారు. ఫోన్ పేలిన సమయంలో 90 శాతం ఛార్జింగ్ ఉందని, ఆ సమయంలోనే దాన్ని ఉపయోగించనూ లేదని పేర్కొన్నారు. ముందుగా ఫోన్​ నుంచి మంటలు వచ్చాయని, ఆ తర్వాత క్షణాల్లోనే పేలిపోయిందని వివరించారు. తనకు గాయాలు కూడా అయ్యాయని, కోర్టు చాంబర్​లోనే ఇదంతా జరిగిందని చెప్పారు.

OnePlus Nord 2 caught fire and exploded
లాయర్ జేబులో పేలిన వన్​ప్లస్ నార్డ్​-2 ఫోన్​!
OnePlus Nord 2 caught fire and exploded
లాయర్ జేబులో పేలిన వన్​ప్లస్ నార్డ్​-2 ఫోన్​!

అయితే ఫోన్​ పేలిందని సంస్థకు సంప్రదించకుండా.. నేరుగా న్యాయపోరాటం చేస్తానని గౌరవ్ పేర్కొన్నారు. ఈ ఫోన్​ తయారు చేసిన సంస్థను నిషేధించాలని ఫిటిషన్ దాఖలు చేస్తానని చెప్పారు.

OnePlus Nord 2 caught fire and exploded
లాయర్ జేబులో పేలిన వన్​ప్లస్ నార్డ్​-2 ఫోన్​!

ఈ ఘటనపై వన్​ప్లస్ సంస్థ స్పందించింది. ఫోన్​ను పరీక్షించి విచారించకుండా పరిహారం చెల్లించలేమని పేర్కొంది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు యాజమానిని సంప్రదిస్తే ఆయన నుంచి స్పందన లేదని పేర్కొంది.

OnePlus Nord 2 caught fire and exploded
లాయర్ జేబులో పేలిన వన్​ప్లస్ నార్డ్​-2 ఫోన్​!

రెండోసారి..

వన్​ప్లస్​ నార్డ్​ 2 ఫోన్ నుంచి మంటలు రావడం ఇది మొదటి సారేం కాదు. ఆగస్టు మొదటి వారంలోనే ఈ మోడల్​ ఫోన్​ ఒకటి కాలిపోయింది. అప్పటికి ఈ మోడల్ మార్కెట్​లోకి వచ్చి రెండు వారాలే. అయితే అప్పుడు ఇతర(తయారీ సంస్థతో సంబంధం లేని) కారణాల వల్లే ఫోన్ పేలిందని వన్​ప్లస్ వివరణ ఇచ్చింది. ఇప్పుడు నెల గడవక ముందే మరో ఫేన్​ పేలడం వినియోగదారుల్లో ఆందోళన కల్గిస్తోంది.

ఇదీ చదవండి: విద్యుత్తు వాహన ఛార్జర్లు ఉంటేనే కొత్త ఇంటికి అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.