ETV Bharat / Iran Israel Conflict

Iran Israel Conflict

పస్చిమాశియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్‌ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఆ దేశంపై ప్రతిదాడి తప్పదని ఇందుకోసం ఆపరేషన్‌ 'ఐరన్‌ షీల్డ్‌' చేపడతామని ఇజ్రాయెల్‌ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జిహలేవి స్పష్టం చేశారు. తమ వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్​ భావించిందని, ఇలాంటి ఘటనలు మునుపెన్నడూ జరగలేదని తెలిపారు. ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్‌ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని టెల్‌ అవీవ్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ విషయం తేలేవరకు గాజాలోని రఫాపై ఆపరేషన్‌ను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.