ETV Bharat / Bangalore Rave Party

Bangalore Rave Party

కర్ణాటకలోని బెంగళూరు శివారు ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ రేవ్ పార్టీని అక్కడి పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఏపీ, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు హాజరు కాగా, వారిలో సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్ ఉన్నట్లు పోలీసులు ఇదివరకే వెల్లడించారు. వీరితో పాటు 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు, అలాగే మెర్సిడెస్ బెంజ్, ఆడీ, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా పట్టుబడిన వారి రక్త నమూనాలు సేకరించి ఇటీవల వైద్య పరీక్షలకు పంపగా, 103 మందికి డ్రగ్‌ పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు కర్ణాటక పోలీసులు నిర్ధారించారు. పలువురు నటుల రక్త నమూనాల్లోనూ మాదక ద్రవ్యాల ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు, వారిలో తెలుగు నటి సైతం ఉన్నట్లు స్పష్టం చేశారు. పాజిటివ్​ వచ్చిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.