ETV Bharat / sitara

lovestory trailer: చైతూ, సాయి పల్లవి కెమెస్ట్రీ సూపర్!

author img

By

Published : Sep 13, 2021, 11:13 AM IST

నాగ చైతన్య, సాయిపల్లవి ప్రధానపాత్రల్లో నటించిన 'లవ్​స్టోరీ' ట్రైలర్(lovestory trailer) విడుదలైంది. చైతూ, పల్లవి జోడీ చూడముచ్చటగా ఉంది. లవ్, రొమాన్స్, సెంటిమెంట్, బ్యూటిఫుల్​ మ్యూజిక్​తో ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.

lovestory
లవ్​స్టోరీ

అక్కినేని నాగచైతన్య(naga chaitanya movies), సాయి పల్లవి(sai pallavi movies) జంటగా ప్రముఖ దర్శకుడు శేఖర్ ఖమ్ముల తెరకెక్కించిన చిత్రం 'లవ్​స్టోరీ'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ చాలాకాలంగా​ వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. సెప్టెంబర్ 24(lovestory release date)న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్(lovestory trailer)​ను నేడు విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. చైతూ, పల్లవి జోడీ చూడముచ్చటగా ఉంది. లవ్, రొమాన్స్, సెంటిమెంట్, బ్యూటిఫుల్​ మ్యూజిక్​తో ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది. ఈ చిత్రానికి పవన్.సీహెచ్​ సంగీతమందించగా, పి.రామ్మోహన్, నారాయణ్​దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మించారు.

ఇవీ చూడండి: చూపులతో కట్టిపడేస్తున్న 'కర్ణన్'​ బ్యూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.