ETV Bharat / health

ముఖంపై అవాంఛిత రోమాలా? - ఇలా చేశారంటే ఆ సమస్యే ఉండదిక! - Facial Hair Removal Remedies

author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 2:19 PM IST

Facial Hair Removal Remedies : హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి.. అవాంఛిత రోమాలు. మీరూ ఈ సమస్యతో బాధ పడుతున్నట్టయితే.. కొన్ని హోమ్ రెమిడీస్​తో సమస్యకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Home Remedies To Remove Facial Hair
Facial Hair Removal Remedies (ETV Bharat)

Best Home Remedies To Remove Facial Hair : టీనేజ్ అమ్మాయిల్లో, మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా రకరకాల సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి.. అవాంఛిత రోమాలు. పెదవుల పైన, గడ్డం మీద వెంట్రుకలు మొలుస్తుంటాయి. కొన్ని హోమ్ రెమిడీస్ ఫాలో అయ్యారంటే ఇంటి వద్దే అవాంఛిత రోమాలకు(Unwanted Hair) చెక్ పెట్టొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పసుపు పేస్ట్ : అవాంఛిత రోమాలను తొలగించడంలో ఈ హోమ్ రెమిడీ చాలా చక్కగా ఉపయోగపడుతుందంటున్నారు. ఇందుకోసం ఒక బౌల్​లో కాస్త పసుపు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ లేదా పాలు యాడ్ చేసుకొని దాన్ని పేస్ట్​లాగా చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట సున్నితంగా రుద్దుతూ అప్లై చేయాలి. అలా 15 నుంచి 20 నిమిషాలు ఉంచి పొడిగా మారాక గోరువెచ్చని వాటర్​తో కడిగేసుకోవాలి.

2017లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ కాస్మెటిక్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పసుపు సంబంధిత ప్యాక్‌లు అవాంఛిత రోమాలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దిల్లీలోని జామియా హమ్​దార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ అమిత్ సింగ్ పాల్గొన్నారు. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, కర్కుమిన్ అనే పదార్థం అవాంఛిత రోమాలను తొలిగించడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

శనగపిండి, రోజ్ వాటర్ మాస్క్ : దీన్ని బెస్ట్‌ నేచురల్‌ ఫేషియల్ హెయిర్‌ రిమూవల్‌ మాస్క్‌ అని చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా కాస్త శనగపిండిని తీసుకొని కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని పేస్ట్​గా చేసుకోవాలి. ఆపై దాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై గోరువెచ్చని వాటర్​తో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల శరీరంపై ఉండే అవాంఛిత రోమాలు మాయమవుతాయని సూచిస్తున్నారు నిపుణులు.

మీ చర్మం మెరవాలంటే రాయాల్సింది క్రీమ్స్ కాదు - చేయాల్సింది ఇవీ! - Skin Care Tips

బొప్పాయి, పసుపు మాస్క్ : ఇందుకోసం మిక్సీ జార్​లో ఒక పచ్చి బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఆపై అందులో చిటికెడు పసుపు యాడ్ చేసి దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని అవాంఛిత వెంట్రుకలు ఉన్న చోట అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. అలా 15-20 నిమిషాలు ఉంచి ఆపై కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం అవాంఛిత రోమాల సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

చక్కెర, నిమ్మకాయ స్క్రబ్ : ఇది కూడా అవాంఛిత రోమాలను తొలగించడంలో సహజమైన స్క్రబ్​లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక బౌల్​లో కాస్త నిమ్మరసం తీసుకొని అందులో కొద్దిగా చక్కెర కలుపుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని అవాంఛిత వెంట్రుకలు ఉన్న చోట సున్నితంగా స్క్రబ్ చేయాలి. అలా కాసేపు ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని వాటర్​తో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ ​మీల్, అరటి స్క్రబ్ : ఈ హోమ్ రెమిడీతో అవాంఛిత రోమాలకు ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం పండిన అరటిపండ్లను ముక్కలు కట్ చేసుకొని వాటికి ఓట్​ మీల్ యాడ్ చేసుకొని మందపాటి పేస్ట్​లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ముఖంపై అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉండనిచ్చి కడుక్కోవాలి.

గుడ్డు తెల్లసొన మాస్క్ : అవాంఛిత రోమాలను తొలగించడంలో ఇది చాలా చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక బౌల్​లో రెండు లేదా మూడు గుడ్లు పగులకొట్టి అందులోని తెల్లసొనను తీసుకొని దాన్ని నురుగు వచ్చేవరకు కలుపుకోవాలి. ఆపై దాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని వాటర్​తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సూపర్ న్యూస్: ఐస్ వాటర్​లో ముఖం ముంచారంటే అద్భుత సౌందర్యం! - మీరూ తప్పక ట్రై చేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.