ETV Bharat / health

మీ చర్మం మెరవాలంటే రాయాల్సింది క్రీమ్స్ కాదు - చేయాల్సింది ఇవీ! - Skin Care Tips

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 2:00 PM IST

Skin Care Tips : వయసు ఎంత పెరిగినా.. అందం తగ్గకూడదని ఆశిస్తున్నారా? చర్మం ఎప్పుడూ మృదువుగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటున్నారా? అయితే.. మార్కెట్లో దొరికే క్రీమ్స్ పూసుకుంటే సరిపోదు అంటున్నారు నిపుణులు. దానికోసం కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు!

Skin Care Tips
Skin Care Tips

Skin Care Tips : అందంగా కనిపించాలని మహిళలు ఎన్నో ప్రయాత్నాలు చేస్తుంటారు. దీనికోసం రోజూ ఎన్నో రకాల క్రీమ్‌లు, కాస్మెటిక్స్‌ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే.. అందంగా కనిపించడానికి ఎన్ని సౌందర్య ఉత్పత్తులు వాడినా.. ఫలితం కొద్దిసేపటి వరకే ఉంటుంది. కాబట్టి.. మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఎక్కువ కాలం ఉండాలంటే రోజూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నీళ్లు ఎక్కువగా తాగాలి :
చర్మం మెరుస్తూ, ముడతలు లేకుండా ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాలి. సరిపడా వాటర్‌ తాగడం వల్ల చర్మ కణాలకు తేమ అందడంతో స్కిన్‌ మృదువుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. బాడీ హైడ్రేట్​గా మారి చర్మానికి ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది. దాంతో.. మృదువుగా కనిపిస్తుంది. కాబట్టి.. రోజూ కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీ మోచేతులు నల్లగా మారాయా? - ఈ టిప్స్​తో అందంగా మెరిసిపోవడం ఖాయం!

హెల్దీ ఫుడ్‌ :
చర్మం ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను తినాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే అవిసె గింజలు, అవకాడో, గుడ్లు వంటి పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని డాక్టర్‌ మధులిక ఆరుట్ల (చీఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌) చెబుతున్నారు.

ఇవి వద్దు..

మద్యం తాగడం, స్మోకింగ్‌ చేయడం వంటి చెడు అలవాట్ల వల్ల స్కిన్‌ పాడవుతుంది. 2013లో 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్' ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. పొగ తాగేవారు ఆ అలవాటును మానేయడం వల్ల చర్మంపై ముడతలు పడే ప్రమాదం 30 శాతం తగ్గిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో 1000 మంది పాల్గొన్నారు. కాబట్టి.. స్మోకింగ్‌కు దూరంగా ఉండమని నిపుణులు చెబుతున్నారు.

ఎండ నుంచి రక్షించండి :
చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఎండలోకి వెళ్లేటప్పుడు కచ్చితంగా సన్‌స్క్రీన్ ఉపయోగించండి. ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల నుంచి రక్షిస్తుంది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు స్కార్ఫ్‌, సన్‌గ్లాసెస్ వంటివి తప్పకుండా ధరించండి.

ఇంకా :

  • చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి రోజూ మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. దీనివల్ల చర్మం ముడతలు పడకుండా, మెరుస్తూ ఉంటుంది.
  • ప్రస్తుత కాలంలో చాలా మంది అర్ధరాత్రి వరకూ స్మార్ట్‌ఫోన్‌ యూజ్‌ చేస్తూ ఉన్నారు. దీనివల్ల సరిగ్గా రాత్రి నిద్రపోవడం లేదు. ఇది చర్మానికి ఏ మాత్రం మంచిది కాదు.
  • చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కనీసం 7-8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. కంటినిండా నిద్రపోవడం వల్ల యవ్వనంగా కనిపిస్తామని అంటున్నారు.
  • చివరగా.. డైలీ శారీరక శ్రమను కలిగించే నడక, పరుగు, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు చేయాలి.
  • అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి ప్రాక్టీస్‌ చేయాలని సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

స్ట్రయిట్ టు కర్లీ - ఎలాంటి హెయిర్​ బ్రష్​ వాడాలో మీకు తెలుసా?

మిలమిల మెరిసే గోళ్లు మీ సొంతం కావాలా? ఈ టిప్స్ పాటిస్తే సరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.