ETV Bharat / sukhibhava

మీ మోచేతులు నల్లగా మారాయా? - ఈ టిప్స్​తో అందంగా మెరిసిపోవడం ఖాయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 5:26 PM IST

Elbow Darkness Removal Tips : కోమలమైన మెరిసే చర్మం కావాలని అందరమ్మాయిలు కోరుకుంటారు. ఈ క్రమంలో ముఖం, చేతులు, పెదవులు, కాళ్ల అందంపై ప్రత్యేక దృష్టి పెడతారు. అయితే, చాలా మంది అమ్మాయిలు మోచేతులు, కాలిమడమల చర్మంపై నిర్లక్ష్యంగా ఉంటారు. దీని కారణంగా చర్మం నల్లగా, గరుకుగా మారి.. అందవిహీనంగా కనిపిస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం కోసం కొన్ని టిప్స్​ పట్టుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Elbow Darkness
Elbow Darkness

How to Lighten Dark Elbows in Telugu : ఆడవాళ్లు అందంగా కనిపించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తారు. ఈ క్రమంలో ఫేస్​పై చిన్నమచ్చ వచ్చినా అది తగ్గేవరకు.. ఏవేవో క్రీమ్‌లు, ఫేస్​మాస్క్​లు అప్లై చేస్తుంటారు. అలాగే చేతులు, కాళ్లు అందంగా ఉండడం కోసం.. మానిక్యూర్‌, పెడిక్యూర్‌(Pedicure) లాంటివి చేయించుకుంటూ ఉంటారు. కానీ, కొంతమంది మోచేతులు విషయానికొచ్చే సరికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాంతో అవి నల్లగా, గరుకుగా మారి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వారి కోసం అదిరిపోయే హోమ్ మేడ్ చిట్కాలు పట్టుకొచ్చాం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పాలు, పసుపుతో.. ఆరోగ్యంగా ఉండడానికి మనం రోజూ తాగే పాలు.. మోచేతుల నలుపును ఈజీగా పోగొడతాయి. మీ మోచేతులు నల్లగా మారినట్లయితే.. పాలు, పసుపుతో తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఇందుకోసం పాలు, పసుపును సమాన పరిమాణంలో తీసుకుని.. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి, మృదువుగా మసాజ్ చేసుకోవాలి. పావు గంట ఆగి మోచేతులు కడగాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే నలుపు ఇట్టే మాయమవుతుంది. మిల్క్.. న్యాచురల్‌ క్లెన్సర్‌లా పనిచేసి చర్మానికి తేమనందిస్తాయి. పసుపు నలుపు పోగొడుతుంది.

తేనె, టమాటా రసం.. రోజూ వివిధ వంటకాల్లో వాడే టమాటాతో మోచేతల మీద నలుపుకు చెక్ పెట్టవచ్చు. దీని కోసం స్పూన్​ టమాటా రసంలో అర స్పూన్​ తేనె యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిని మోచేతులకు అప్లై చేయాలి. అలా కాసేపు ఉంచి ఆరాక కడిగేయాలి. ఈ మిశ్రమంలో ఉన్న టమాటా నలుపును పోగొడితే.. తేనె మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఓ వారం డైలీ ఉదయం, సాయంత్రం రెండు సార్లు ప్రయత్నించి చూడండి.. మంచి రిజల్ట్స్‌ ఉంటాయి.

నిమ్మరసం.. ఇది మంచి న్యాచురల్‌ క్లీనర్​గా పని చేస్తుంది. శరీరంపై పేరుకున్న మృతకణాలను ఈజీగా తొలగిస్తుంది. నిమ్మచెక్కపై కొద్దిగా ఉప్పు వేసి మోచేతులపై డార్క్​నెస్ ఉన్నచోట రుద్దాలి. కొంత సేపు ఆగాక గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే చాలు. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మోచుతుల నలుపు క్రమేణా తొలగిపోతుంది.

Face Wash Tips in Telugu : మాటిమాటికీ ఫేస్​వాష్​ చేసుకుంటున్నారా.. అయితే మీరిది తెలుసుకోవాల్సిందే

వెనిగర్‌.. మీ మోచేతుల నలుపును తగ్గించడానికి మరో అదిరిపోయే టిప్ ఏంటంటే.. పెరుగులో, వెనిగర్‌ యాడ్ చేసుకుని ఆ ప్లేస్​లో అప్లై చేయడం. ఇవి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఇందుకోసం రెండు చెంచాల పెరుగులో మూడు చుక్కల వైట్‌ వెనిగర్‌ కలిపి డార్క్​గా ఉన్న ప్రాంతంలో రాయాలి. అది ఆరాక వేడి నీటితో శుభ్రం చేసుకుంటే సరి.. నలుపు ఇట్టే మాయమవుతుంది. పెరుగులో.. ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని కాంతిమంతం చేయడమే కాకుండా తేమగా ఉంచుతుంది.

కొబ్బరి నూనె.. ఇందులో ఉండే విటమిన్లు, ఇతర పోషకాలు చర్మానికి పోషణను అందించి మృదువుగా మారుస్తాయి. రోజూ బాత్ చేసిన వెంటనే మోచేతులకు కొబ్బరినూనె రాసుకొని రెండు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఇలా డైలీ చేయడం ద్వారా అక్కడి చర్మం మృదువుగా మారుతుంది. ఇకపోతే మరో విధంగానూ కొబ్బరినూనెతో మోచేతుల డార్క్​నెస్​కు చెక్ పెట్టొచ్చు. ఎలాగంటే.. కొబ్బరినూనెలో అర టీస్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలుపుకొని.. దానిని మోచేతులకు రాసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆపై టిష్యూ పేపర్‌తో తుడి చేసుకోవాలి. ఈ విధంగా తరచూ చేస్తూ ఉంటే మోచేతులపై ఉన్న నలుపు క్రమంగా మాయమవుతుంది.

నిద్రపోయేప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త- మొటిమల సమస్య అధికమవుతుంది!

గుడ్డు పెంకులతో సౌందర్యం - అలా చేస్తే ముఖంలో కొత్త మెరుపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.