ETV Bharat / sukhibhava

గుడ్డు పెంకులతో సౌందర్యం - అలా చేస్తే ముఖంలో కొత్త మెరుపు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 2:50 PM IST

Eggshell Uses for Beauty : కోడిగుడ్డు పొట్టును మొక్కలకు ఎరువుగా వేయడం అందరికీ తెలుసు. కానీ.. అందానికి కూడా ఎరువుగా వాడతారని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకుందాం రండి..

Eggshell for Beauty
Eggshell for Beauty

Eggshell Uses for Beauty : అరోగ్యానికి గుడ్డు ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. కానీ.. డస్ట్ బిన్​లో పడేసే గుడ్డు పెంకులు ముఖాన్ని మరింత మెరిపిస్తాయని మీకు తెలుసా? అందానికి మెరుగులు దిద్దుతాయని తెలుసా? "అవునా.. అదెలా సాధ్యం?" అనుకుంటున్నారా? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఆర్టిఫిషియల్​ స్వీట్నర్స్​ వాడుతున్నారా! ఈ సైడ్​ ఎఫెక్ట్స్​ తెలిస్తే అసలు ముట్టుకోరు!

మృత కణాల నివారణకు :

చర్మంపై ఏర్పడే మృతకణాల వల్ల.. ముఖం అంద విహీనంగా తయారవుతుంది. వాటిని తొలగించి.. వాటి స్థానంలో కొత్త కణాల్ని ఉత్పత్తి చేసే గుణాలు గుడ్డు పెంకుల్లో ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులోని క్యాల్షియం కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే..?

  • కొన్ని గుడ్డు పెంకుల్ని తీసుకొని శుభ్రంగా కడగాలి.
  • ఆ తర్వాత వాటిని ఎండబెట్టి.. మెత్తటి పొడిలా చేసుకోవాలి. (స్టోర్​ చేసుకోవచ్చు కూడా)
  • తర్వాత గుడ్డు తెల్లసొనలో ఈ పొడి వేసి కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని అరగంటయ్యాక కడిగేసుకోవాలి.
  • ఈ ఫేస్‌ప్యాక్‌ వల్ల ముఖానికి తేమ అందుతుంది.
  • ఇది చర్మానికి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది.
  • తద్వారా మృతకణాలు తొలగిపోయి ముఖం మెరుపును సంతరించుకుంటుంది.
  • ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్​లో గుడ్డు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

సున్నితమైన చర్మానికి ఇలా:

సున్నితమైన చర్మం ఉన్న వారు ఏ వాతావరణాన్నీ తట్టుకోలేరు. ఎండ వేడికి త్వరగా కందిపోవడం, చల్లటి వాతావరణంలో చర్మం పొడిబారిపోవడం, ఎర్రటి దద్దుర్లు.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వారు గుడ్డు పెంకుల్ని ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

  • ఒక బౌల్‌ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ తీసుకొని.. గుడ్డు పెంకుల పొడిని అందులో వేసి బాగా కలుపుకొని ఐదు రోజుల పాటు నాననివ్వాలి.
  • ఆ తర్వాత ఒక కాటన్‌ని ఈ మిశ్రమంలో ముంచి, ముఖానికి అప్లై చేసుకోవాలి.
  • 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • ఇలా తరచూ చేస్తుంటే ఆయా సమస్యలు తగ్గుముఖం పడతాయట.

దంతాల ఆరోగ్యం: గుడ్డు పెంకుల పొడిని టూత్‏పేస్ట్‏గా ఉపయోగిస్తే చాలా మంచిది. ఇందుకోసం ఒక టీస్పూన్ ఎగ్ షెల్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా కలిపాలి. అలాగే ఇందులో కొబ్బరి నూనె కలపాలి. దీనితో వారానికి ఒకసారి పళ్లు తోముకోవడం వలన దంతాలు బలంగా ఉండడమే కాకుండా.. తెల్లగా మెరుస్తాయట.

బాణపొట్ట ఎబ్బెట్టుగా ఉందా? ఉదయాన్నే ఇలా చేస్తే చాలు - ఐస్​లా కరిగిపోతుంది!

ఫేస్ ప్యాక్ : ఒక గిన్నెలో ఒక టీస్పూన్ గుడ్డు పెంకుల పౌడర్ తీసుకోవాలి. అందులో తేనె కలుపుతూ మెత్తటి పేస్ట్‏గా మార్చాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మొత్తానికి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది బియ్యం పిండి ఫేస్ ప్యాక్ ఉపయోగించినట్లుగా అనిపిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

అతి వద్దు : గుడ్డు పెంకుల్లోని క్యాల్షియం మోతాదుకు మించితే మంచిది కాదంటున్నారు నిపుణులు. కాబట్టి ఏ ప్యాక్‌లో ఎంత వాడాలనే విషయంలో సౌందర్య నిపుణుల్ని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

ముఖంలో అప్పుడే వృద్ధాప్య ఛాయలా? అర్జెంటుగా ఇవి తినడం స్టార్ట్ చేయండి - నిగనిగలాడిపోద్ది!

పీరియడ్స్ టైమ్​లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.