ETV Bharat / health

మీ ఫేస్ మిలమిల మెరిసిపోవాలా? - అయితే నైట్​టైమ్ ఇలా చేయాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 3:27 PM IST

Skin Care Tips : మీరు అందంగా కనిపించాలని ఉదయం ఫేస్​వాష్​ చేస్తున్నారా? మరి రాత్రి సంగతి ఏంటి? మృదువైన, సున్నితమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే ఉదయం మాత్రమే కాదు.. రాత్రిళ్లు కూడా ముఖం కడుక్కోవడం చాలా అవసరమంటున్నారు సౌందర్య నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో

How to get Smooth Skin
Skin Care Tips

Best Tips for Cleanse Your Face : ముఖం ఎప్పుడూ ఫ్రెష్​గా, మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. అందులో భాగంగానే ఎక్కువ మంది ఉదయం పూట సబ్బుతో పలుమార్లు ఫేస్ వాష్ చేసుకుంటే, కొందరేమో ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. అయితే, నైట్​ టైం లో మాత్రం ఫేస్​ క్లీనింగ్​ గురించి పట్టించుకోరు. అయితే మృదువైన, సున్నితమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే ఉదయం మాత్రమే కాదు.. రాత్రిళ్లు కూడా ముఖం కడుక్కోవడం చాలా అవసరమంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగే, నైట్​ టైమ్ ముఖం కడుక్కునే క్రమంలో ఈ టిప్స్ పాటిస్తే చర్మ ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • నైట్ టైమ్ ఫేస్ వాష్ చేసుకునే ముందు అందుకు అవసరమయ్యే కొన్ని వస్తువులను ఎంపిక చేసుకోవాలి. అంటే.. మీ చర్మ రకానికి తగిన క్లెన్సర్‌, శుభ్రంగా ఉండే మృదువైన వాష్‌క్లాత్, గోరువెచ్చని నీరు, మీ ముఖాన్ని పొడిగా ఉంచడానికి టవల్, అవసరమైతే అద్దం వంటివి ఎంచుకోవాలి. ఇక ఇప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ రాత్రిళ్లు మీ ముఖాన్ని కడుక్కోండి.
  • మీరు ఫేస్ వాష్ చేసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే హ్యాండ్స్​కు ఉన్న మురికి, బ్యాక్టీరియా చర్మానికి అంటుకోకుండా ఉండాలంటే ముఖాన్ని తాకడానికి లేదా ఏదైనా ప్రొడక్ట్స్ అప్లై చేసే ముందు చేతులు శుభ్రంగా క్లీన్​ చేసుకోవాలంటున్నారు నిపుణులు.
  • ఇక మీరు ముఖానికి మేకప్ వేసుకున్నట్లయితే ఫేస్ వాష్​కి ముందు దానిని తొలగించాలి. అందుకోసం మేకప్ రిమూవర్ లేదా మిసెల్లార్ వాటర్​ని ఉపయోగించి సున్నితంగా మేకప్​ను రిమూవ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కొన్ని గోరువెచ్చని నీరు తీసుకొని ముఖంపై స్ల్పాష్​(ముఖంపై నీళ్లు చల్లుకోవాలి) చేసుకోవాలి. అయితే ఫేస్​ వాష్​కి ఎప్పుడూ వేడి నీటిని ఉపయోగించక పోవడం మంచిది. ఎందుకంటే ఆ వాటర్ మీ చర్మాన్ని డ్యామేజ్​ చేయడమే కాకుండా పొడిగా మార్చుతాయని చెబుతున్నారు.
  • అనంతరం మీరు ఎంచుకున్న ఫేసియల్ క్లెన్సర్​ను కొద్ది మొత్తంలో తీసుకుని ముందుగా మీ చేతివేళ్లకు అప్లై చేయండి. ఆ తర్వాత మీ ముఖంపై సున్నితంగా సర్కిల్ మోషన్​లో మసాజ్ చేయండి. ముఖ్యంగా మురికి, నూనె, మేకప్ ఉండే నుదురు, ముక్కు, గడ్డం ప్రాంతాలపై ఫోకస్ చేయండి.

అబ్బాయిలకు బ్యూటీ టిప్స్ - ఇలా చేస్తే ఫుల్ హ్యాండ్సమ్​!

  • మీ ముఖాన్ని శుభ్రం చేయడానికి కనీసం 20 సెకన్ల సమయం కేటాయించండి. ఇది క్లెన్సర్ మలినాలను విచ్ఛిన్నం చేయడానికి, మీ చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయడానికి తోడ్పడుతుంది. అయితే స్క్రబ్ చేసేటప్పుడు సున్నితంగా చేయండి. అంతేకానీ చాలా గట్టిగా స్క్రబ్ చేయకండి. ఎందుకంటే అలా చేయడం వల్ల చర్మం కందిపోయే అవకాశం ఉంటుంది.
  • ఇక క్లెన్సర్​ను సున్నితంగా 20 సెకన్ల పాటు స్క్రబ్ చేశాక గోరువెచ్చని నీటితో నీట్​గా ఫేస్​పై ఎలాంటి అవశేషాలు లేకుండా కడుక్కోవాలి. ఆ తర్వాత శుభ్రంగా ఉండే మృదువైన టవల్ తీసుకుని ఫేస్​ను నిదానంగా తుడుచుకోవాలి. అనంతరం రాత్రిపూట చర్మ సంరక్షణ కోసం యూజ్ చేసే ఏవైనా సీరమ్‌లు, మాయిశ్చరైజర్‌లు ఉంటే వాటిని అప్లై చేయాలి.
  • అయితే చాలా మంది ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మెడ భాగాన్ని వాష్ చేసుకోరు. కానీ, ముఖాన్ని కడుక్కునేటప్పుడు మెడ భాగాన్ని తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మురికి, నూనె పేరుకుపోతుందని చెబుతున్నారు.

డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ చర్మం దెబ్బతినడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.