ETV Bharat / health

అబ్బాయిలకు బ్యూటీ టిప్స్ - ఇలా చేస్తే ఫుల్ హ్యాండ్సమ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 12:01 PM IST

Men Skin Care Tips: అందంగా కనిపించాలని అమ్మాయిలకు మాత్రమే కాదు.. అబ్బాయిలకు కూడా ఉంటుంది. ఇందుకోసం.. వాళ్లు కూడా బ్యూటీ​ ప్రొడక్ట్స్​​ వాడుతుంటారు. కానీ.. చాలా మంది విఫలమవుతుంటారు. దానికి కారణం తమ స్కిన్‌కేర్‌ రొటీన్‌లో కొన్ని తప్పులు చేస్తుండడమే అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Men Skin Care Tips
Men Skin Care Tips

Skin Care Tips for Men: సౌందర్యంపై మహిళలు ఎంత శ్రద్ధ చూపిస్తారో తెలిసిందే. పార్లర్లు, బ్యూటీ ప్రొడక్ట్స్​ అంటూ అందానికి మెరుగులు అద్దుకుంటుంటారు. అయితే.. ప్రస్తుత రోజుల్లో పురుషులు కూడా తమ అందం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆడవారిని మించి మగవారు బ్యూటీ ప్రొడక్ట్స్​ వాడటం, సెలూన్లలో గడపడం చేస్తుంటారు. అయినా కానీ చాలా మంది ఫేస్​లో గ్లో ఉండదు. దానికి కారణం తమ స్కిన్‌కేర్‌ రొటీన్‌లో భాగంగా కొన్ని తప్పులు చేస్తుండమే అంటున్నారు నిపుణులు. వాటిని అధిగమించి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అనిపించుకోవాలంటే ఈ టిప్స్​ పాటించమని సలహా ఇస్తున్నారు. ఆ టిప్స్​ ఏంటంటే..

అండర్‌ ఐ సీరమ్‌​​: అందంగా కనిపించాలని ఫేస్‌క్రీమ్‌లు, లోషన్లు ఎడాపెడా మొహానికి అద్దేస్తుంటారు మగాళ్లు. ఈ ప్రయత్నంలో కళ్ల కింద సరిగా అప్లై అవ్వక.. దీంతో నల్లగా, వలయాలుగా మరకల్లాంటివి ఏర్పడతాయి. దీంతో ముఖం చూడటానికి అంత అందంగా ఉండదు. అండర్‌ ఐ సీరమ్‌ లేదా క్రీమ్‌ని వాడుతుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది.

ఎక్స్‌ఫోలియంట్లు: ప్రస్తుతం చాలా మంది అబ్బాయిలు చేసే పని.. పదేపదే అద్దంలో చూసుకోవడం, రోజుకి రెండు లేదా మూడు సార్లు మొహం కడుక్కోవడం. అయితే.. ముఖం కడుక్కోవడం అంటే చాలా మంది నీళ్లు చిమ్ముకుని టవల్​తో తుడుచుకుంటారు. కానీ అలా చేయొద్దు. కేవలం నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్మూధూళీ, కాలుష్యం.. నిగారింపు కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి చర్మం మృతకణాలను తొలగించే ఎక్స్‌ఫోలియంట్లను వాడుతుండాలి. ముఖ్యంగా బయట బాగా తిరిగేవాళ్లు ఫేస్‌ మాస్క్‌లు ధరించాలి.

జెల్‌ బేస్డ్‌ ఉత్పత్తులు: చాలా మంది అబ్బాయిలు ఒకటే రకమైన క్రీములు, ఫేస్​వాష్​లు వాడుతుంటారు. అయితే చర్మం తీరును బట్టి బ్యూటీ ఉత్పత్తుల తీరు మారుతుండాలని నిపుణులు సూచిస్తున్నారు. పొడి చర్మం ఉన్నవారు ఆయిల్‌ బేస్డ్‌ సీరమ్స్‌, క్రీములు ఉపయోగించొచ్చు. ఆయిలీ చర్మం ఉన్న వారు జెల్‌ బేస్డ్‌ ఉత్పత్తులు యూజ్​ చేసుకోవచ్చు. ఇవేమీ తెలుసుకోకుండానే ప్రోడక్ట్స్‌ వాడటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

టవల్​: ముఖాన్ని క్లీన్​ చేసిన తర్వాత కొంతమంది గరుకుగా ఉండే టవల్​తో మొహాన్ని తెగ రుద్దేస్తుంటారు. ఇలా తరచూ చేస్తుంటే రాషెస్‌ వస్తుంటాయి. చర్మం సాగుతుంది. అలా కాకుండా ఉండాలంటే గరుకుగా ఉండే టవల్​తో కాకుండా మెత్తని టవల్‌తోనే తుడుచుకోవాలి. స్కిన్‌కేర్‌ రొటీన్‌ సైతం టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌.. ఈ వరుస క్రమమే పాటించాలి.

ఇక చివరగా అందంగా కనిపించాలని స్టార్టింగ్​లో కొందరు క్రీములు, జెల్స్‌ వాడుతుంటారు. తర్వాత ఆపేస్తారు. మళ్లీ కొద్దిరోజులకు మళ్లీ షురూ చేయడం లేదా మరో కొత్త బ్రాండ్‌ వాడటం మొదలుపెడతారు. చర్మం నిగారింపు, మెరుపు రావాలంటే.. మధ్యమధ్యలో ఆపేయకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించాలి.

పురుషుల్లో మొటిమల సమస్య - ఇలా చెక్ పెట్టండి!

'అతడు' ఎలా ఉన్నాడు!

ఎంత ట్రై చేసినా స్మోక్ చేయడం మానలేకపోతున్నారా?- ఈ టిప్స్​ ట్రై చేస్తే అస్సలు తాగరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.