ETV Bharat / health

మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలా? - బ్లాక్ టీని ఇలా వాడితే రిజల్ట్ పక్కా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 5:09 PM IST

Black Tea
Black Tea

Black Tea Health Benefits: చాలా మందికి బ్లాక్ టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. ఈ బ్లాక్ టీ ద్వారా జుట్టు ఆరోగ్యంగా, అందంగా తయారవుతుందంటున్నారు. అదేలాగో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.!

How to Use Black Tea for Healthy Hair: ప్రస్తుత రోజుల్లో వాతావరణ కాలుష్యం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, నిద్రలేమి.. కారణంగా ఎక్కువ మంది చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాగే కొంతమంది తెల్ల జుట్టు, చుండ్రు వంటి ప్రాబ్లమ్స్​తో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది జుట్టు(Hair) సంరక్షణ కోసం ఏవేవో హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడుతుంటారు. అయినా రిజల్ట్ అంతంతమాత్రమే. అయితే బ్లాక్ టీతో హెయిర్ ప్రాబ్లమ్స్​కు​ ఈజీగా చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? బ్లాక్ టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, అదే టీ జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు. అంతేకాదు హెయిర్​ను అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఇంతకీ ఈ బ్లాక్ టీని హెయిర్​కు ఎలా ఉపయోగించాలి? దాని ద్వారా జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బ్లాక్ టీ జుట్టుకు ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

  • ముందుగా మీరు బ్లాక్ టీ తయారు చేసుకోవాలి. ఇందుకోసం 1 కప్పు నీటిని మరిగించాలి. ఆ తర్వాత అందులో ఒక బ్లాక్ టీ బ్యాగ్ వేసి 30 నిమిషాలు మరిగించాలి. తర్వాత ఆ వాటర్​ని చల్లారనివ్వాలి. ఆపై దానిని ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్​లో పోసుకోవాలి.
  • ఇక జుట్టుకు బ్లాక్ టీని అప్లై చేసే ముందు షాంపూతో హెయిర్​ను వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు చుట్టూ టవల్ చుట్టి కొద్దిగా ఆరబెట్టాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. బ్లాక్​ టీని జుట్టుకు అప్లై చేసేటప్పుడు హెయిర్ కొద్దిగా తడిగా ఉండేట్లు చూసుకోవాలి.
  • ఇప్పుడు తడిగా ఉన్న జుట్టు మీద బ్లాక్ టీని అప్లై చేసుకోవాలి. అయితే దీనిని జుట్టు మొత్తానికి స్ప్రే అయ్యేలాగా చూసుకోవాలి.
  • తర్వాత చిన్నగా వేళ్లతో మసాజ్​ చేయాలి. ఇలా చేయడం వల్ల అది జుట్టు మొదళ్లకు పడుతుంది. ఆ తర్వాత మీరు జుట్టు మీద హెయిర్ క్యాప్ ధరించాలి.
  • ఇక బ్లాక్ టీని అప్లై చేసిన సుమారు గంట తర్వాత శుభ్రమైన నీటితో వాష్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. జుట్టును కడిగిన తర్వాత కండిషన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇది మీ జుట్టుును మృదువుగా, మెరుస్తూ కనిపించడానికి సహాయపడుతుంది.

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? - మీ జుట్టు రకం ఆధారంగా ఇప్పుడే తెలుసుకోండి!

బ్లాక్ టీతో కలిగే ప్రయోజనాలు: బ్లాక్ టీలో టానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్ టాక్సిన్స్​ను తొలగించి స్కాల్ప్​ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే విధంగా మీరు బ్లాక్ టీని ఉపయోగించడం ద్వారా జిడ్డు జుట్టును కూడా వదిలించుకోవచ్చు. అంతేకాకుండా, బ్లాక్ టీ జుట్టును మెరిసేలా, మృదువుగా, చుండ్రు లేకుండా చేస్తుంది. అలాగే మీరు తరచుగా జుట్టుకు బ్లాక్​ టీని అప్లై చేయడం ద్వారా తెల్ల జుట్టు, జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చు. వీటితో పాటు మీరు జుట్టుకు సహజంగా రంగు వేయడానికి బ్లాక్ టీని ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు కూడా హెయిర్ ప్రాబ్లమ్స్​తో ఇబ్బంది పడుతున్నట్లయితే ఓసారి బ్లాక్​ టీని ట్రై చేసి చూడండి అంటున్నారు నిపుణులు.

జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా? - అయితే ఇది ట్రై చేశారంటే మీ జుట్టు అస్సలు ఊడదు!

జుట్టు ఎక్కువగా రాలుతోందా? మీరు చేసే ఈ తప్పులే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.