ETV Bharat / sukhibhava

జుట్టు ఎక్కువగా రాలుతోందా? మీరు చేసే ఈ తప్పులే కారణం!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 10:54 PM IST

Updated : Dec 30, 2023, 6:17 AM IST

Hair Fall Reason : జుట్టు రాలిపోవడం అనే సమస్య మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ముఖ్యంగా మహిళలైతే శిరోజాలు రాలిపోతుంటే ఏదో కోల్పోతున్నట్లు దిగులు చెందుతుంటారు. అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది? జుట్టు ఊడిపోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం..

hair fall reasons
hair fall reasons

Hair Fall Reason : స్నానం చేస్తున్నప్పుడు, దువ్వెనతో దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు రాలిపోతుంటే మనసంతా శూన్యంగా, దైన్యంగా మారిపోతుంటుంది. నాకే ఎందుకిలా అవుతుందని అంతర్మథనం అనుక్షణం కుంగదీస్తుంది. తలకు నూనె సరిగా రాయడం లేదనో విటమిన్ల లోపం ఉందనో అనుకుంటూ వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తుంటాం. నిజానికి జుట్టు రాలడం వెనుక మనం తెలిసో తెలియకో చేసే తప్పులే కారణమవుతాయి అంటున్నారు డాక్టర్లు. షాంపూల వాడకం, జుట్టుకు రంగేయడం వరకు మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో? జుట్టు సంరక్షణకు ఏం చేయాలో తెలుసుకుందాం.

జుట్టు రాలడానికి సాధారణ కారణాలు
సాధారణంగా జుట్టు రాలుతుందనుకునే వారిలో 80 శాతం మందికి అది సమస్య కాదని తెలియదు. జుట్టు రాలుతుందనే భావనలోనే ఎక్కువ మంది ఉంటారు. నిజానికి జుట్టు రాలడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొదటిది లోకలైజడ్ హెయిర్ లాస్. అంటే తలపై భాగంలో అక్కడక్కడ జుట్టు ఊడిపోవడం. ఇది నిజంగా పెద్ద సమస్యే. దీన్ని అలబూషియా ఏరియేట్ అంటారు. రెండోది ఫంగల్ ఇన్ఫెక్షన్స్. తలకు ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ప్రాంతంలో చీము కారడం, పుండ్లు పుట్టడం వల్ల జుట్టు రాలిపోతుంటుంది. ఈ రకమైన సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లో ఉంటుంది. ఇలాంటి సమయంలో నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. మూడోది ఏదైనా జబ్బుల వల్ల జుట్టు రాలిపోతుంటుంది.

డిసీజ్డ్ హెయిర్ లాస్
చాలా మంది డిసీజ్డ్ హెయిర్ లాస్​తో బాధపడుతుంటారు. ఈ రకమైన సమస్యకు కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆహారంలో పోషకాలు లేకపోవడం జీర్ణం సరిగా అవ్వకపోవడం, ఐరన్ లోపించడం, థైరాయిడ్ సమస్య, హర్మోన్లు లోపం వల్ల జుట్టు రాలిపోతుంటుంది. అదేవిధంగా జ్వరం బారిన పడిన తర్వాత రెండు మూడు నెలలపాటు జుట్టు ఊడిపోతుంటుంది. గర్భిణులు ప్రసవించిన తర్వాత రెండు మూడు నెలలపాటు జుట్టు రాలిపోతుందని చెబుతుంటారు. ఆపరేషన్లు చేయించుకున్న వారు కూడా జుట్టు ఊడిపోయే సమస్యను ఎదుర్కొంటారు. కీమోథెరపీ, రేడియో థెరపీ, క్యాన్సర్ చికిత్స పొందేవారు ఎక్కువగా జుట్టును కోల్పోతుంటారు.

శిరోజాల కోసం వాడే రసాయనాల ప్రభావం
హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వంటి రసాయనాలు వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. హెయిర్ స్ట్రైట్నింగ్ రసాయనాల వల్ల జుట్టు దెబ్బతింటుంది. అదేవిధంగా హెయిర్ స్మూతినింగ్ చేయడానికి ఐరెనింగ్ చేయడం కూడా జుట్టు ఊడిపోయేందుకు కారణమవుతుంది. హెయిర్ బ్లోయింగ్ చేయించడం వల్ల జుట్టు రాలిపోతుంది. ఈ రకమైన అలవాట్ల వల్ల జుట్టు డ్రైగా మారడం, పగుళ్లు బారి ఊడిపోతుంది. ఇవన్నీ మన స్వయం కృతాపరాధాలు అంటారు.

హెల్మెట్ వాడటం, చుండ్రు
హెల్మెట్ వాడటం వల్ల జుట్టు రాలిపోతుందనేది కేవలం అపోహే. హెల్మెట్ వాడటానికి జుట్టు రాలిపోడానికి ఎలాంటి సంబంధం లేదు. చుండ్రు వల్ల మాత్రం జుట్టు కచ్చితంగా ఊడిపోయే అవకాశం ఉంది. చుండ్రు ఎక్కువగా ఉండే తలపై దురద ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో చేతితో తలపై గోకడం వల్ల జుట్టు కుదుళ్లతో సహా ఊడిపోతుంది.

ప్రసవం తర్వాత
ప్రసవం తర్వాత జుట్టు రాలడం సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇస్ట్రోజెన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. జుట్టు పటుత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. డెలివరీ తర్వాత ఇస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల జుట్టు పటుత్వం కోల్పోయి రాలిపోతుంటుంది. ప్రసవం తర్వాత నెల రోజుల నుంచి ఆర్నెళ్ల వరకు మహిళలు ఈ సమస్య ఎదుర్కొంటుంటారు. ఆర్నెళ్ల తర్వాత మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం వల్ల జుట్టు పెరిగే అవకాశం ఉంటుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళనలు
ట్రైకో టిల్లో మేనియా అనే సమస్య వల్ల జుట్టు రాలిపోతుంటుంది. ట్రైకో అంటే జుట్టు, టిల్లో అంటే పెరగడం, మేనియా అంటే వ్యాధి. ఈ సమస్య మానసిక వ్యాధితో బాధపడేవారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ మేనియా ఆడపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటారు. ఒత్తిడి అనేది హర్మోన్లను ప్రభావితం చేస్తుంటుంది. హర్మోన్లు పెరగకపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోయే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.

కాలుష్యం ప్రభావం
కాలుష్య ప్రభావం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువ. గాలి, నీరు, ఆహార కలుషితాల ప్రభావం శిరోజాలపై పడుతుంది. కలుషిత వాతావరణం ఉన్నవారు కచ్చితంగా జుట్టును కోల్పోతారు.

షాంపూలు, హెయిర్ డైతో సమస్యలు
సబ్బులు, షాంపూల వల్ల సాధారణంగా జుట్టు రాలిపోయే అవకాశం లేదు. లూస్ హెయిర్ ఉన్నవారు షాంపూలను రుద్దుకునే సమయంలో సహజంగా జుట్టు ఊడిపోతుంది. అంతేకాని జుట్టు ఊడిపోడానికి షాంపూలు కారణం కాదు. కానీ, తలకు రంగు వేసుకోవడంతో జుట్టును కోల్పోయే అవకాశం ఉంది. ఇక తలను ఎక్కువగా రుద్దుకోవడం, దువ్వుకోవడం, తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం లేదు. కానీ, ఎక్కువగా తల దువ్వుకోవడం, దువ్వెన మరీ మొరటగా ఉంటే జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.

అదేసమయంలో జుట్టుకు హెన్నా రాసుకోవడం వల్ల బాగా పెరిగే అవకాశం ఉంది. కొంతమంది గుండు కొట్టించుకుంటే జుట్టు బాగా పెరుగుతుందని భావిస్తుంటారు. నిజానికి ఇది కేవలం అపోహ మాత్రమే. గుండు కొట్టించుకోవడం వల్ల జుట్టు పెరిగే అవకాశం లేదు. హెయిర్ డైలు మాత్రం జుట్టుకు హానికరం, చాలా రకాల హెయిర్ డైల్లో నో అమోనియా అంటారు. నిజానికి జుట్టుకు హానికలిగించేది అమోనియా కాదు. అమోనియా కేవలం వాసనకు సంబంధించినది. హెయిర్ డైలల్లో ప్రమాదకరమైన ప్యారా ఫిల్లింగ్ డైమన్ (పీపీడీ) ఉంటుంది. ఏ హెయిర్ డైపైనా నో పీపీడీ అని రాయరు. అంటే పీపీడీ వల్లే జుట్టు నల్లగా మారుతుంది. పీపీడీ రసాయనాలు వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఎక్కువ. పీపీడీ వల్ల అలర్జీ కూడా వచ్చే అవకాశం ఉంది.

జుట్టు రాలడానికి కారణాలు

హెయిర్ ట్రాన్స్​ప్లాంటేష‌న్‌కు వెళ్తున్నారా? జుట్టు శాశ్వతంగా ఉంటుందా? ఉన్న వెంట్రుకలు ఊడతాయా?

Hair Loss in Men : పురుషుల్లో జుట్టు రాలే సమస్య.. 50% పాతికేళ్ల యువకుల్లోనే..

Last Updated : Dec 30, 2023, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.