ETV Bharat / business

మీరు హిందువులా? HUF రూల్స్ తెలుసుకుంటే - బోలెడు టాక్స్ బెనిఫిట్స్ గ్యారెంటీ​! - What Is HUF In Income Tax

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 12:40 PM IST

What Is HUF In Income Tax : 'హెచ్‌యూఎఫ్' అంటే తెలుసా? ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపులు, రిటర్న్‌ల దాఖలుకు కౌంట్‌డౌన్‌ మొదలైన ప్రస్తుత తరుణంలో హిందూ, సిక్కు, జైన కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి. అప్పుడే అధికంగా పన్ను ప్రయోజనాలను పొందగలుగుతారు.

What Is HUF In Income Tax
Hindu Undivided Family (Getty Images)

What Is HUF In Income Tax : ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపులు, రిటర్న్‌ల దాఖలుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. పన్ను చెల్లింపుదారులంతా జులై 31లోగా తమ రిటర్న్‌లను ఫైల్ చేయాల్సి ఉంది. ఐటీ రిటర్న్(ITR) ఫైల్ చేసేటప్పుడు, ప్రతి ఒక్కరు సాధ్యమైనంత మేర పన్నుభారాన్ని తగ్గించుకునేందుకు, తమ డబ్బులను ఆదా చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారు తప్పకుండా తెలుసుకోవాల్సింది 'హెచ్‌యూఎఫ్' గురించి. హెచ్‌యూఎఫ్ అంటే హిందూ అవిభక్త కుటుంబం. దేశంలోని ఏదైనా హిందూ కుటుంబం 'హెచ్‌యూఎఫ్' కేటగిరీ కింద బ్యాంకు ఖాతాను తెరుచుకొని భారీగా పన్ను ఆదాను పొందవచ్చు. జైనులు, సిక్కులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీంను ముస్లింలకు కూడా వర్తింపజేయాలని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ తరుచూ డిమాండ్ చేస్తుంటారు. హెచ్‌యూఎఫ్ రకానికి చెందిన బ్యాంకు అకౌంటుతో ఏ రకంగాా పన్ను ప్రయోజనాలను పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మొత్తం కుటుంబాన్ని ఒక వ్యక్తిగా లెక్కిస్తూ!
భారతీయ ఆదాయపు పన్ను చట్టంలో హిందూ అవిభక్త కుటుంబాలకు (HUF)కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. వారికి గరిష్ఠ ప్రయోజనాలను అందించే ఎన్నో రూల్స్‌ను ఆదాయపు పన్ను చట్టంలో ప్రస్తావించారు. ఏదైనా హిందూ కుటుంబం హెచ్‌యూఎఫ్ కేటగిరీలో బ్యాంకు ఖాతాను తెరిచి, లావాదేవీలు నిర్వహించి, ఆదాయాన్ని గడిస్తే, దాన్ని కేవలం ఒకే వ్యక్తికి సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. అంటే సదరు హిందూ కుటుంబం చాలా మంది వ్యక్తుల సమూహంగా కాకుండా సింగిల్ వ్యక్తిగా లెక్కిస్తారు. ఒక వ్యక్తికి ఏవైతే పన్ను ప్రయోజనాలు లభిస్తాయో, మొత్తం కుటుంబానికి కూడా ఆ బెనిఫిట్స్ అన్నీ చేకూరుతాయి.

ప్రయోజనం ఎలా పొందాలి?
హెచ్‌యూఎఫ్ బ్యాంకు ఖాతాను తెరవాలంటే తొలుత మీరు చేయాల్సిన పని పాన్‌కార్డును తయారు చేయడం. ఇందుకోసం మీరు హెచ్‌యూఎఫ్ పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. అది వచ్చాక బ్యాంకుకు వెళ్లి హెచ్‌యూఎఫ్ అకౌంటు కోసం దరఖాస్తు సమర్పించాలి. కుటుంబ పెద్ద పేరిట ఈ అకౌంట్​ నడుస్తుంటుంది. ఈ అకౌంటులో సభ్యులుగా మిగతా కుటుంబ సభ్యులంతా ఉండొచ్చు. కుటుంబంలో కొత్తగా పుట్టేవారు, వివాహం ద్వారా కుటుంబంలోకి ప్రవేశించే వారు కూడా ఈ అకౌంటులో భాగస్వాములుగా మారొచ్చు. వీరంతా కలిసి హెచ్‌యూఎఫ్ బ్యాంకు అకౌంటు ద్వారా చేసే లావాదేవీలను, ఒక వ్యక్తి చేసిన లావాదేవీగా పరిగణించి పన్ను ప్రయోజనాలను అందిస్తారు.

సాలరీతో లింక్ పెట్టారో - ఇక అంతే!
హెచ్‌యూఎఫ్ అకౌంటులో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ అకౌంటులో సభ్యులుగా ఉన్నవారు ఉద్యోగం చేస్తున్నట్లయితే, సాలరీ ద్వారా వచ్చే మొత్తాన్ని ఇందులో ఇన్వెస్ట్ చేయడం ఏమాత్రం మంచిదికాదు. ఎందుకంటే, దానివల్ల పన్ను ప్రయోజనాలను కోల్పోతారు. ఉదాహరణకు మీరు పనిచేసే కంపెనీ నుంచి సంవత్సరానికి రూ.10 లక్షల జీతం వస్తుందని అనుకుందాం. ఈ ఉద్యోగంతో పాటు మీరు సైడ్ బిజినెస్‌ చేసి సంవత్సరానికి రూ.5 లక్షలు సంపాదిస్తున్నారని భావిద్దాం. ఇవి రెండూ కలిపితే రూ.15 లక్షల ఆదాయం అవుతుంది. హెచ్‌యూఎఫ్ అకౌంటు అనేది వ్యక్తిగత అకౌంటు తరహాలో కేవలం రూ.5 లక్షల ఆదాయం వరకు మాత్రమే పన్ను ప్రయోజనాలను అందించగలుగుతుంది. సాలరీ ద్వారా మీ హెచ్‌యూఎఫ్ అకౌంటులో జమ అవుతున్న రూ.10 లక్షలకు పన్ను ప్రయోజనాలను పొందారు కాబట్టి సైడ్ బిజినెస్ ద్వారా వస్తున్న రూ.5 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపులు లభించవు. అందుకే కేవలం వ్యాపార అవసరాలకు హెచ్‌యూఎఫ్ అకౌంటును పరిమితం చేయాలి. హెచ్‌యూఎఫ్ అకౌంటు ద్వారా లావాదేవీలు చేసి, బిజినెస్‌పై సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తే, దానిపై ఎలాంటి పన్ను విధించరు. రూ.2.50 లక్షలపై ప్రాథమిక పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగిలిన రూ.2.5 లక్షలపై రూ.12,500 రాయితీ (రిబేట్​) లభిస్తుంది.

పన్ను మినహాయింపు మార్గాలు ఏమిటి ?

  • జీవిత బీమా, ఎఫ్‌డీ, పీపీఎఫ్, చిన్నతరహా పొదుపు పథకాలు, గృహ రుణాలు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో పెట్టుబడులు పెడుతుంటే, ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు.
  • సెక్షన్ 80డీ కింద మీకు, మీ కుటుంబానికి ఆరోగ్య బీమా ప్రీమియంలపై రూ.25,000, మీ వృద్ధ తల్లిదండ్రుల ఆరోగ్య బీమా ప్రీమియంలపై రూ.50,000 వరకు తగ్గింపును పొందొచ్చు.
  • మీరు హెచ్‌యూఎఫ్ పేరుతో ఇంటిని కొనొచ్చు. దాని వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24బీ కింద రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
  • మీరు సెక్షన్ 54ఎఫ్ కింద ఈక్విటీ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, సంవత్సరానికి రూ.1 లక్ష వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలను కూడా పన్నురహితంగా పొందొచ్చు. దీనికి మించిన ఆదాయంపై 10 శాతం పన్ను విధిస్తారు.
  • మీరు హెచ్‌యూఎఫ్ పేరుతో 2 ఆస్తులను కూడా కొనొచ్చు. ఈ లావాదేవీలు కూడా పూర్తి పన్నురహితం. నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ విలువైన ఆస్తుల కొనుగోలు కోసం జాతీయ అద్దెల విధానం ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

నెలకు రూ.1 లక్ష పెన్షన్​ కావాలా? ఈ ప్రభుత్వ పథకంపై ఓ లుక్కేయండి! - NPS Pension

ముకేశ్ అంబానీ సంపాదన గంటకు రూ.90 కోట్లు - మరి మనకెంత టైమ్​ పడుతుంది? - Mukesh Ambani One Hour Income

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.