ETV Bharat / business

నెలకు రూ.1 లక్ష పెన్షన్​ కావాలా? ఈ ప్రభుత్వ పథకంపై ఓ లుక్కేయండి! - NPS Pension

author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 5:00 PM IST

NPS Pension : రిటైర్మెంట్ ఏజ్ వచ్చిందంటే జీవితంలో మలిదశ మొదలైందని అర్థం. కాళ్లూ చేతులు గతంలో మాదిరిగా పనిచేయవు. ఆదాయం ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో పెన్షన్ అనేది లేకపోతే ఇతరుల మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా నెలకు రూ.1 లక్ష పెన్షన్ వచ్చే ప్రభుత్వ పథకం ఉంది. ఆ పథకం పేరే నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్​పీఎస్).

NPS PENSION benefits
NPS PENSION CALCULATOR (ETV Bharat)

NPS Pension : ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్‌ అయ్యేవరకు ప్రతివ్యక్తీ కాలంతో పరుగులు తీస్తారు. చూస్తుండగానే రిటైర్మెంట్ సమయం వచ్చేస్తుంది. ఉన్నట్టుండి సంపాదన ఆగిపోతుంది. రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా భరోసా ఇచ్చేది పెన్షనే. కాబట్టి ముందు నుంచే పొదుపు చేయడం అనివార్యం. అయితే రిటైర్ అయిన తర్వాత మీకు నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్‌ వస్తే ఎలా ఉంటుంది. అంత మొత్తంలో పెన్షన్ పొందాలంటే తప్పకుండా మీరు జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్​పీఎస్)లో పెట్టుబడులు పెట్టాలి. మరి ఉద్యోగ విరమణ తర్వాత నెలనెలా లక్ష రూపాయలను అందించే ఈ స్కీమ్​లో ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి? ఎంతెంత పెట్టాలి? ఎవరు అర్హులు? ఏ వయసులో పెట్టుబడులు ప్రారంభించడం బెటర్? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద్యోగులే కానవసరం లేదు!
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం పేరు నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS). దీన్నే నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ అని కూడా అంటారు. జాతీయ పెన్షన్ స్కీమ్​లో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సురక్షితం. ఎందుకంటే దీనికి ప్రభుత్వ మద్దతు ఉంటుంది. ఈ జాతీయ పెన్షన్‌ పథకం అనేది స్వచ్ఛంద, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక. 18-70 ఏళ్లలోపు వయసున్న వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దేశంలోని సాధారణ పౌరులతోపాటు ప్రవాస భారతీయులు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

పన్ను ప్రయోజనాలు!
ఈ ఎన్​పీఎస్​ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినవారికి ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే సెక్షన్ 80సీ ప్రకారం, రూ.1.5 లక్షల లిమిట్ దాటిన వాళ్లు ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్‌ లో పొదుపు చేసి అదనంగా రూ.50 వేల పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1బీ) ప్రకారం కూడా పన్ను మినహాయింపులు లభిస్తాయి. అయితే చాలా మంది రిటైర్మెంట్​కు చాలా సమయం ఉందని యుక్త వయసులో పదవీ విరమణ ప్రణాళికను చేసుకోరు. ఆలస్యంగా పెట్టుబడులు ప్రారంభిస్తారు. దీని వల్ల మీకు వచ్చే ఆర్థిక లబ్ధి తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి.

NPS Pension Calculations : ప్రతి నెలా రూ.1 లక్ష పెన్షన్ రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు 25 ఏళ్లు వయస్సున్నప్పుడు నేషనల్ పెన్షన్ సిస్ట​మ్​లో అకౌంట్​ తెరిచి పొదుపు చేయడం ప్రారంభించారని అనుకుందాం. నెలకు రూ.8,150 చొప్పున అంటే రోజుకు 270 రూపాయల చొప్పున ఎన్​​పీఎస్​​లో పొదుపు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా మీరు 60 సంవత్సరాల వరకు ఇందులో పెట్టుబడి పెట్టారు. అంటే మొత్తం 35 ఏళ్ల పాటు ఈ స్కీమ్​లో డబ్బు డిపాజిట్ చేశారు. ఇలా 60 ఏళ్లు వచ్చేసరికి ఈ పథకంలో మొత్తంగా రూ.34,23,000 మదుపు చేసి ఉంటారు. ఇప్పుడు 8 శాతం రాబడి మీకు వచ్చిందని ఊహించినట్లయితే, మొత్తం కార్పస్ విలువ రూ.1,88,19,777గా ఉంటుంది. అప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) 80 శాతం మెచ్యూరింగ్ ఆదాయం నుంచి యాన్యుటీని కొనుగోలు చేస్తే మొత్తం రూ.1,53,96,777 అవుతుంది. ఈ విధంగా మనం ఎన్​​పీఎస్​​లో పెట్టుబడి పెట్టడం ద్వారా 60 సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు రూ.1,00,228 పెన్షన్​​గా పొందవచ్చు.

సొంత ఇల్లు Vs అద్దె ఇల్లు - ఏది బెటర్ ఆప్షన్​! - own house vs Rental House

జియో ఫైబర్‌ నయా ప్లాన్​ - నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్ సహా 15 ఓటీటీలు ఫ్రీ! - Jio OTT Plan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.