ETV Bharat / business

ఎన్​పీఎస్ నయా రూల్​ - ఇకపై ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి! - NPS New Login Rules

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 11:35 AM IST

NPS New Login Rules : ఎన్​పీఎస్​ ఖాతాదారులకు అలర్ట్​. ఆన్​లైన్​ మోసాలను అరికట్టేందుకు 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ' 2024 ఏప్రిల్ 1 నుంచి 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' (NPS) ఖాతాల లాగిన్ ప్రక్రియలో మార్పులు చేసింది. దీని ప్రకారం, ఇకపై ఎన్​పీఎస్​ ఖాతాలోకి లాగిన్ కావాలంటే టూ-ఫ్యాక్టర్​ ఆధార్ అథంటికేషన్​ తప్పనిసరి. పూర్తి వివరాలు మీ కోసం.

NPS Two-factor Aadhaar authentication
NPS New Login Rules

NPS New Login Rules : ఆన్​లైన్​ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ (PFRDA) 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' (NPS) ఖాతా లాగిన్ ప్రక్రియలో మార్పు చేసింది. దీని ప్రకారం, ఖాతాదారులు టూ-ఫ్యాక్టర్ ఆధార్​ అథంటికేషన్​ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త లాగిన్ ప్రక్రియ 2024 ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానుంది. దీని వల్ల ఖాతాదారులకు అదనపు భద్రత చేకూరనుంది.

NPS సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ(CRA) సిస్టమ్​లోకి లాగిన్ అయ్యే పాస్​వర్డ్ బేస్డ్​ వినియోగదారులందరూ కచ్చితంగా ఈ టూ-ఫ్యాక్టర్ ఆధార్​ అథంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. దీని తరువాత వారి రిజిస్టర్ మొబైల్ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్​ చేసిన తరువాత మాత్రమే యూజర్లు వారి ఖాతాను యాక్సెస్ చేయగలుగుతారు.

NPS New Login Rule Benefits : పీఎఫ్​ఆర్​డీఏ 2024 మార్చి 15న కొత్త ఎన్​పీఎస్​ లాగిన్ ప్రక్రియ గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని వల్ల ఎన్​పీఎస్​ ఖాతాదారులకు మరింత భద్రత చేకూరునుంది. దీని వల్ల చందాదారులకు, వాటాదారులకు రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా ఎన్​పీఎస్​ లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగకుండా నిలువరించడానికి వీలవుతుంది.

కొత్త మెకానిజం ఎలా ఉంటుంది?
పీఎఫ్​ఆర్​డీఏ సర్క్యూలర్ ప్రకారం, ఎన్​పీఎస్​ CRA సిస్టమ్ యాక్సెస్ చేయాలంటే, ముందుగా మీ యూజర్​ ఐడీ, పాస్​వర్డ్ నమోదు చేయాలి. తరువాత 2-ఫ్యాక్టర్ అథంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం -

  • ముందుగా మీరు NPS అధికారిక వెబ్​సైట్​ https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లోకి PRAIN/ IPINతో లాగిన్ కావాలి. వెంటనే ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • ఆ కొత్త విండోలో మీ యూజర్ ఐడీ, పాస్​వర్డ్​, క్యాప్చాలను ఎంటర్ చేయాలి.
  • వెంటనే టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ చేసుకోమని మీకు ఒక ప్రాంప్ట్ వస్తుంది.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
  • వెంటనే మీ ఎన్​పీఎస్ అకౌంట్​ ఓపెన్ అవుతుంది. అంతే సింపుల్​!

ఇలా చేస్తే ఎన్​పీఎస్ అకౌంట్​ను యాక్సెస్​ చేయలేరు!
ఎన్​పీఎస్ ఖాతాదారులు వరుసగా 5 సార్లు టూ-ఫ్యాక్టర్​ అథంటికేషన్​ చేయడంలో విఫలమైతే, అతని/ఆమె ఖాతా లాక్ అయిపోతుంది. ఇలా జరిగినప్పుడు ఖాతాదారులు సీక్రెట్​ క్వెశ్చన్​కు సరైన సమాధానం ఇచ్చి పాస్​వర్డ్​ను రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారులు సీక్రెట్​ క్వశ్చన్​-ఆన్సర్ కూడా మర్చిపోయినట్లైతే, వారికి మరో ఛాన్స్ కూడా ఉంటుంది. ఇందుకోసం యూజర్లు IPINను రీఇష్యూ చేయమని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారు మళ్లీ ఎన్​పీఎస్​ను యాక్సెస్ చేయగలరు. ఇదంతా యూజర్ల భద్రత కోసమే అని మీరు గుర్తించుకోవాలి.

ఏప్రిల్​ 1లోపు చేయాల్సిందే!
అన్ని ప్రభుత్వ రంగ, స్వయంప్రతిపత్తి సంస్థలు ఏప్రిల్ 1లోపు సీఆర్​ఏ సిస్టమ్​లోకి ఎన్​పీఎస్​ ఖాతాదారులు లాగిన్ అయ్యేందుకు ఆధార్ ఆధారిత లాగిన్​ ఫీచర్లను అందుబాటులోకి తేవాలని పీఎఫ్​ఆర్​డీఏ ఆదేశించింది.

ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలా? సరైన ITR ఫారాన్ని ఎంచుకోండిలా! - How To Choose Right ITR Form

క్రెడిట్​ కార్డ్​ యూజర్లకు అలర్ట్ ​- ఏప్రిల్‌ 1 నుంచి మారనున్న రూల్స్​! - Credit Card Rules From April 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.