ETV Bharat / bharat

రైతులకు గుడ్‌న్యూస్ - 'పీఎం కిసాన్‌ నిధులు' రిలీజ్​ డేట్‌ ఫిక్స్‌ - ఆ రోజునే అకౌంట్లోకి రూ.2 వేలు! - PM Kisan 17th Installment

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 11:04 AM IST

PM Kisan 17th Installment Release Date : రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించి తేదీని ఖరారు చేశారు. మరి రైతుల అకౌంట్‌లలో డబ్బులు ఏ రోజు జమ అవుతాయో ఇప్పుడు చూద్దాం.

PM Kisan 17th Installment
PM Kisan 17th Installment Release Date (ETV Bharat)

PM Kisan 17th Installment Release Date : అన్నదాతలకు మోదీ సర్కార్​ శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించింది. ఈ పథకం ద్వారా మొత్తం 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మరి ఆ డబ్బులు ఎప్పుడు పడతాయి ? స్టేటస్​ ఎలా చెక్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం "ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి" పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం​ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి సంవత్సరానికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను ఏటా మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్స్​లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ - జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కాబోతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో "జూన్ 18వ" తేదీన.. పీఎం కిసాన్ 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు చొప్పున 20వేల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.

పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

  • పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్​ను నమోదు చేసి, క్యాప్చా కోడ్​ను ఎంటర్‌ చేయాలి.
  • ఇప్పుడు Get Data అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్​ చేసుకోవాలి?

  • ఫస్ట్‌ మీరు www.pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
  • తర్వాత వెబ్​సైట్​లోని "Beneficiary List" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ స్టేట్‌, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.
  • అలాగే లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి. అంతే ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
  • మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.

ప్రధాని అయ్యాక మోదీ ఫస్ట్ సంతకం- వారందరి ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు! - Modi First Signature

Kisan Rin Portal Details and Benefits in Telugu : అన్నదాతకు శుభవార్త.. అప్పుకోసం వడ్డీ వ్యాపారి వద్దకు అవసరం లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.