ETV Bharat / technology

మీకు ఈ ట్రిక్స్ తెలిస్తే - AI సృష్టించే డీప్​ఫేక్ ఫొటోలను ఈజీగా కనిపెట్టేస్తారు! - How to Spot Deepfake Photos

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 1:35 PM IST

How to Spot Deepfake Photos : ఆర్టిఫీషియల్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్న ఈరోజుల్లో ఏది నిజమో? ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. చాలా మందికి ఇది అసాధ్యం కూడా! కానీ.. ఈ ట్రిక్స్​తో డీప్​ఫేక్ ఇమేజ్​లను ఈజీగా కనిపెట్టొచ్చని మీకు తెలుసా?

Best Tricks to Detect Deepfake Photos
How to Spot Deepfake Photos (ETV Bharat)

Best Tricks to Detect Deepfake Photos : నేటి టెక్నాలజీ యుగంలో మానవాళి సాధించిన గొప్ప విజయాల్లో కృత్రిమ మేధ(Artificial intelligence) ఒకటని చెప్పుకోవచ్చు. కానీ.. అది అంతేస్థాయిలో ప్రమాదకరంగానూ పరిణమిస్తోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఏఐతో ఎన్నో ప్రయోజనాలున్నా.. కొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు.

ముఖ్యంగా.. డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోలు ఎన్నో విధాలుగా ముప్పుగా మారుతున్నాయి. ఇటీవల పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. మీరూ అలాంటి వాటి బారినపడకుండా ఉండాలంటే ఈ ట్రిక్స్ తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. వీటి ద్వారా ఏఐ సృష్టించే డీప్​ఫేక్(Deepfake) ఫొటోలను ఈజీగా కనిపెట్టవచ్చంటున్నారు. మరి, ఈ ట్రిక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రస్తుతం మన దేశంలోనూ ఈ డీప్​ఫేక్ వ్యాప్తి చాలా మందిని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి పలు సూచనలు చేసింది. అలాగే నకిలీలను గుర్తించేందుకు వీలుగా ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఎలాంటి టెక్నాలజీ అవసరం లేకుండా.. కేవలం చిన్న చిన్న అంశాలను గుర్తించడం ద్వారా.. ఏఐతో సృష్టించే ఈ డీప్‌ఫేక్‌ ఫొటోలను సులభంగా పసిగట్టవచ్చని చెబుతోంది. నిశితంగా వాటిని గమనిస్తే.. వాస్తవ దూరంగా ఉండే చిత్రాలు, వింత వింత లైటింగ్‌, నీడలు, చిత్రాల్లో అసమానతలు తదితర తప్పులను మనం గుర్తుపట్టొచ్చని కేంద్రం తెలిపింది.

వాట్సాప్ స్పెషల్​ హెల్ప్​లైన్​తో 'డీప్​ఫేక్స్​'కు చెక్​!

డీప్​ఫేక్ ఫొటోలను ఈజీగా ఎలా గుర్తించాలంటే? :

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​తో సృష్టించే ఈ డీప్‌ఫేక్‌ ఫొటోలు చూడటానికి ఎంతో పర్ఫెక్ట్​గా కనిపిస్తాయి. కానీ, ఎంత పెద్ద నేరం చేసినా ఎక్కడో ఓ చోట క్లూ వదిలేస్తుంటారనే పాత డైలాగ్​.. డీప్​ ఫేక్​ విషయంలోనూ వర్తిస్తుందట. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ గుర్తించడం ద్వారా.. ఫేక్​ ఫొటోలు, వీడియోలను పట్టుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

  • AI జనరేట్​ చేసే నకిలీ ఫొటోలు.. ఒరిజినల్​ ఫొటో కన్నా చాలా పర్ఫెక్ట్​గా ఉంటాయి.
  • డీప్​ఫేక్ ఫొటోలోని వ్యక్తి ముఖం, స్మైల్, ఆకారం అన్నీ చాలా చాలా పర్ఫెక్ట్​గా, షార్ప్​గా ఉంటాయి. ఒరిజినల్ ఫొటోలు అంత లైటింగ్​తో, అంత షార్ప్​గా, అంత పర్ఫెక్ట్​గా ఉండవు.
  • అదేవిధంగా అందులో కనిపించే ఆబ్జెక్ట్స్ కూడా మరింత ఎలివేట్​ అవుతూ ఉంటాయి.
  • చిత్రంలోని వ్యక్తి డ్రైస్ చాలా బ్రైట్​గా, చాలా పర్ఫెక్షనిజంతో కనిపిస్తుంది. రియల్​ చిత్రాల్లో అంత ఖచ్చితంగా ఉండదు.
  • ఫేక్ ఫొటోలో ఉండే వ్యక్తులు వాడే వస్తువులు కాస్త వైవిధ్యంగా, నమ్మశక్యంగా లేకుండా ఉంటాయి.
  • ఫొటోల్లోని మనుషుల శరీర తీరు వాస్తవానికి దూరంగా ఉంటుంది. కాస్త పరీక్షగా చూస్తే మనకు అర్థమైపోతుంది.
  • AI ఎడిట్‌ చేసే ఫొటోల్లో ఉండే నీడలు తేడాగా ఉంటాయి. కాబట్టి.. ఏఐ జనరేట్ చేసే ఫేక్ ఫొటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది.
  • ఇక కేంద్ర ప్రభుత్వం కూడా.. ఈ డీప్​ఫేక్ ఫొటోలు, వీడియోలను అడ్డుకునేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని తెలిపింది.
  • లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనిపై చట్టం తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అర్జెంట్​గా డబ్బులు కావాలని ఫ్రెండ్​ కాల్​ చేశాడా?.. అది డీప్​ ఫేక్ స్కామ్ కావచ్చు! జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.