హైదరాబాద్​ కూకట్​పల్లిలో జలకన్యల సందడి - చూడటానికి రెండు కళ్లు చాలవు! - Mermaid Show In Kukatpally

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 10:25 PM IST

thumbnail
Mermaid Show In Kukatpally (ETV Bharat)

Mermaid Show AT Kukatpally : అందమైన జల ప్రపంచంలో కనువిందు చేసే జలకన్యల సోయగాలు చూడముచ్చటగా ఉంటాయి కదూ? అసలు వాస్తవానికి జలకన్యలు ఉన్నాయో లేదో తెలియదు కానీ జలకన్యల పేరుతో వచ్చే కథలు, సినిమాలు, వీడియోలకు ఎంతగానో ఆదరణ ఉంటుంది. అలాంటి జలకన్యలు మన కళ్లెదుటే కనిపిస్తే. మనల్ని ముచ్చటగా పలకరిస్తూ ముద్దులు ఇస్తే ఆ ఆనందమే వేరు కదా. అలాంటి జలకన్యలను నగరానికి తీసుకువచ్చింది కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్ ఎగ్జిబిషన్. ఈ ప్రదర్శనకు నగరవాసులు తరలివస్తున్నారు.

సినిమాల్లో, యూట్యూబ్​లలో చూసే జలకన్యలను స్వయంగా చూడటం చాలా ఆనందంగా ఉందని తిలకించడానికి వచ్చిన వారు చెబుతున్నారు. చిన్నారి పిల్లలకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పాటు చిన్నారులకు స్కూబా డ్రైవింగ్​ కూడా నేర్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ముచ్చటైన జలకన్యలు నీళ్లలోపల చేసే విన్యాసాలు చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. మరిన్ని విశేషాలను ఇప్పుడు స్వయంగా తెలుసుకుందాం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.