ETV Bharat / spiritual

వాస్తు​: ఉదయం నిద్ర లేచిన వెంటనే వీటిని చూస్తున్నారా? - తీవ్ర నష్టాలు తప్పవు! - Do Not See These Things by vastu

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 1:25 PM IST

Do Not See These Things: "ఉదయాన్నే నిద్ర లేచి ఎవరి ముఖం చూశానో.." అనే మాట తరుచూ వింటూనే ఉంటాం. దేవుడు, వాస్తును నమ్మేవారు ఈ మాటలను బలంగా విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో.. వాస్తు పండితులు కీలక విషయాలు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్నింటిని చూడకూడదని అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Do Not See These Things
Do Not See These Things (Etv Bharat)

Do Not See These Things After Wakeup as per Vastu: ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని పనులు చేయకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అద్దం: ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు చాాలా మందికి ఉంటుంది. అలాగే.. జుట్టు దువ్వుకునే అలవాటు కూడా ఉంటుంది. ఈ రెండు అలవాట్లు మానుకుంటే మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల అరిష్టం వస్తుందని, పొద్దున్నే జుట్టు దువ్వడం దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుందని, ఇది ఏ మాత్రం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి పూజ గదిని సందర్శించిన తర్వాతే అద్దంలో ముఖం చూసుకోవాలని, జుట్టు దువ్వుకోవాలని సూచిస్తున్నారు.

గోడ గడియారాలు: చాలా మంది ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంట్లో గోడ గడియారాలను చూస్తూ ఉంటారు. టైమ్ ఎంతయిందో తెలుసుకోవడం కోసం చేసే ఈ పని మంచిదే అయినప్పటికీ.. పాడైపోయిన, పగిలిపోయిన గడియారాలను చూడటం అశుభ సూచకమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పాడైపోయిన గడియారాలను ఎట్టి పరిస్థితులలోనూ చూడకుండా ఉండాలి. ఒకవేళ అలా చూస్తే అది మనకు చెడు జరిగేలా చేస్తుందని చెబుతున్నారు.

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం - సరిగ్గా ఆ సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలట! - Best Time to Open Doors and Windows

పెయింటింగ్స్​: చాలా మంది ఇంటి అలంకరణలో భాగంగా పలు రకాల పెయింటింగ్స్​ గోడకు తగిలిస్తుంటారు. అలాంటి వాటిలో అడవి జంతువులు, యుద్ధానికి సంబంధించినవి, హింసాత్మక ఘటనలను ప్రేరేపించే ఫొటోలు ఉంటాయి. అయితే నిద్ర లేచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చూడకుడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు.

నీడ: ఉదయం నిద్ర లేచిన తర్వాత తమ నీడను చూడటం కూడా వాస్తు ప్రకారం అశుభమని.. ఆ రోజు చేసే పనుల్లో ఆటంకం ఏర్పడుతుందని అంటున్నారు. అలాగే మీరు ఉదయం సూర్యుడిని చూస్తూ అనుకోకుండా పడమటి దిశలో మీ నీడను చూసినట్లయితే రాహువుకు సంకేతంగా పరిగణస్తారని.. ఈ విధంగా జరిగితే మీరు ఆ రోజుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం లేదా డబ్బుకు సంబంధించిన పనులు వాయిదా వేయాలని సూచిస్తున్నారు.

గిన్నెలు: చాలా మంది ఉదయం లేవగానే కిచెన్​లోకి వెళ్లి రాత్రిపూట తిని వదిలేసిన గిన్నెలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎట్టి పరిస్థితులలోనూ రాత్రిపూట తిని వదిలేసిన ఎంగిలి గిన్నెలను ఉదయం చూడకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దరిద్రం పడుతుందని అంటున్నారు. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదట మీరు మీ చేతులను చూసి భూదేవికి ప్రణామం చేయాలని అంటున్నారు.

NOTE : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇంట్లో రెండు వంట గదులు ఉండొచ్చా? - వాస్తు నిపుణుల సమాధానమిదే! - Is Two Kitchens are Good in Duplex

చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా? - వాస్తు ఏం చెబుతోంది! - What to Do Dead Person Belongings

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.