ETV Bharat / entertainment

'దిల్​రాజులా నేను చేయలేను - అలాంటి పనులు ఆయనకే సాధ్యం' - Alluarvind Dilraju

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 10:40 PM IST

LOVE ME MOVIE PRE RELEASE EVENT : ప్రముఖ నిర్మాత దిల్​రాజుపై మరో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏం అన్నారంటే?

Source ETV Bharat
Dilraju (Source ETV Bharat)

LOVE ME MOVIE PRE RELEASE EVENT : ఆశిష్‌, వైష్ణవీ చైతన్య కలిసి నటించిన కొత్త సినిమా లవ్‌ మీ. నూతన దర్శకుడు అరుణ్‌ భీమవరపు తెరకెక్కించారు. ఈనెల 25న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చీఫ్ గెస్ట్​గా వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా దిల్​ రాజుపై ప్రశంసలు కురిపించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"మీరు గతంలో ఏమైనా సినిమాలు చేశారా? అని అరుణ్‌ను అడిగితే చేయలేదని చెప్పారు. డైరెక్షన్​లో ఎక్స్​పీరియన్స్​ లేని వారికీ ఛాన్స్​లు ఇవ్వడం దిల్‌ రాజుకే సాధ్యం అని అన్నాను. వెంటనే మీరు కూడా చేయాలి సర్‌ అని ఆయన అనగా ​ ఆ ధైర్యం నేను చేయలేనన్నాను(నవ్వుతూ). కీరవాణి, పీసీ శ్రీరామ్‌లాంటి స్టార్ టెక్నిషియన్స్​తో మొదటి సినిమాకే పని చేయడం అరుణ్‌ అదృష్టం. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అల్లు అరవింద్ ఆకాంక్షించారు.

లక్ష్యం అదే - "హర్షిత్‌ రెడ్డి సినిమాపై ఉన్న ప్యాషన్​తో ప్రొడ్యూసర్​గా మారాడు. హన్షిత చిన్నప్పటి నుంచి షూటింగ్స్‌కు వెళ్లేది. కానీ ఇండస్ట్రీలోకి వస్తుందని అనుకోలేదు. వీరిద్దరు కలిసి దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై సినిమాలు నిర్మిస్తున్నారు. అలా మొదటి సినిమా బలగంతో వేణు యెల్దండిని డైరెక్టర్​గా ఇంట్రడ్యూస్ చేశారు. లవ్‌ మీతో అరుణ్‌కు అవకాశం ఇచ్చారు. హరి, శాండీ ఇలా ఇంకొంతమంది ఉన్నారు. త్వరలోనే వారి సినిమాల గురించి అనౌన్స్​ చేస్తాం. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త వారిని ఎంకరేజ్​ చేయాలనేదే మా లక్ష్యం. ఆశిష్‌ చిన్నప్పుడు నుంచే డ్యాన్స్‌ మంచిగా వేస్తాడు. అతడి జోష్​ చూసి హీరో అవుతాడని అప్పుడే అనుకున్నాను. నాకు సినిమా తప్ప మరో రంగంపై ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను వేరే బిజినెస్​లేమీ చేయట్లేదు. లవ్‌ మీ సవాలుతో కూడిన కథ. దర్శకత్వంలో ఎక్స్​పీరియన్స్​ లేకపోయినా అరుణ్‌ సూపర్​గా తెరకెక్కించారు. కీరవాణి గారు అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేకం. ఆయన 10 పాటలు ఇచ్చారు. కానీ ఐదు పాటలనే సినిమాలో ఉపయోగించుకున్నాం." అని దిల్‌ రాజు పేర్కొన్నారు.

రూ.15 కోట్ల బడ్జెట్​తో రూ.900 కోట్ల కలెక్షన్లు - ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే? - Highest Profits Indian movie

OTTలోకి ముగ్గురు ముద్దుగుమ్మల రూ.100 కోట్ల సినిమా - స్ట్రీమింగ్ ఎక్కడంటే? - Crew OTT Release Date

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.