ETV Bharat / entertainment

OTTలోకి ముగ్గురు ముద్దుగుమ్మల రూ.100 కోట్ల సినిమా - స్ట్రీమింగ్ ఎక్కడంటే? - Crew OTT Release Date

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 8:02 PM IST

వీకెండ్ స్పెషల్​గా ముగ్గురు అందాల ముద్దుగుమ్మలు కలిసి నటించిన సూపర్ హిట్ రూ.100కోట్ల సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
Crew OTT (Source ETV Bharat)

CREW Movie OTT Release Date : ఓటీటీలో ఈ వీకెండ్ ఆడియెన్స్​ను అలరించేందుకు మరో సూపర్ హిట్​ బాలీవుడ్ చిత్రం రాబోతోంది. అదే క్రూ(Crew). సీనియర్ నటీమణులు టబు, కరీనా కపూర్​తో పాటు యంగ్ బ్యూటీ కృతి సనన్ కలిసి ఈ సినిమాలో తమ అందాలను ఆరబోస్తూనే తెగ నవ్వించారు. స్మగ్లింగ్ సాహసాలు చేశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

బంగారం స్మగ్లింగ్ చేసే ముగ్గురు ఎయిర్ హోస్టెస్​ల చుట్టూ ఈ కథ సాగుతుంది. నష్టాల్లో ఉన్న ఓ ఎయిర్ లైన్స్​లో టబు, కరీనా కపూర్​, కృతి సనన్ పని చేస్తుంటారు. ఎప్పటికైనా తమ జీతాలు పెరిగి జీవితాలు మారుతాయని ఆశతో ఉంటారు. కానీ అదే సమయంలో ఎయిర్ లైన్స్ దివాళా తీస్తుంది. దీంతో అప్పటి నుంచి కస్టమ్స్ వారి కళ్లు గప్పి బంగారం స్మగ్లింగ్ చేస్తూ సంపాదిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. మరి వీళ్ల స్మగ్లింగ్ దందా ఎంత కాలం సాగింది? చివరికి జైలుకు వెళ్లారా? లేదా అనేదే కథ. సినిమా మొత్తం వీరి గ్లామర్​తో పాటు ఫుల్ కామెడీ ఉంటుంది.

కాగా, ఈ చిత్రానికి రాజేష్ ఎ కృష్ణన్ దర్శకుడు. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ సంయుక్తంగా నిర్మించాయి. మరి థియేటర్లలో భారి విజయం అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.

ఇకపోతే నెట్‌ఫ్లిక్స్​లో మరిన్ని కొత్త చిత్రాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. లాపతా లేడీస్, సైతాన్, ఆర్టికల్ 370 లాంటి సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ రికార్డ్​ వ్యూస్ అందుకుంటున్నాయి. లాపతా లేడీస్ అయితే యానిమల్ చిత్ర రికార్డును కూడా బ్రేక్ చేసేసింది. ఎలాగో వీకెండ్​ వచ్చేసింది కాబట్టి మీరు ఈ చిత్రాలన్నింటినీ చూస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేయండి.

'బుజ్జి' ప్రత్యేకతలివే - వామ్మో ఈ కారు కోసమే అన్ని కోట్లు ఖర్చుపెట్టారా? - Kalki 2898 AD Bujji Car Features

దర్శకుడిగా మారనున్న మరో జబర్దస్త్ కమెడియన్​! - Jabardasth Comedian As Director

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.