ETV Bharat / health

అందం, ఆరోగ్యం కోసం - రాగులు తినడమే కాదు ఇలా తాగేయండి! - Finger Millets Health Benefits

Finger Millets Health Benefits : ఆరోగ్యానికి మేలు చేసే తృణధాన్యాల్లో రాగులు ఒకటి. వీటిలో పోషకాలు పుష్కలం. కానీ.. ఇప్పటికీ రాగులు తినడానికి చాలా మంది ముందుకు రావట్లేదు. వాటి ప్రయోజనాలు తెలియక కొందరు.. ఎలా వండుకోవాలో తెలియక మరికొందరు దూరంగా ఉంటున్నారు. అయితే.. రాగులను సూపర్​ టేస్టీగా తినడమే కాకుండా.. తాగొచ్చు కూడా! అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

Health Benefits Of Finger Millets
Finger Millets Health Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 4:16 PM IST

Health Benefits Of Finger Millets : దాదాపుగా అందరికీ.. మార్నింగ్ టీ, కాఫీ ఏదో ఒకటి తాగే అలవాటు ఉంటుంది. కానీ, వాటికి బదులుగా ఈ ఆరోగ్యకరమైన డ్రింక్​ను డైలీ రొటీన్​లో చేర్చుకుంటే.. అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగులతో జావ తయారు చేసుకుంటే.. పోషకాలు జుర్రుకోవచ్చని అంటున్నారు. రోజూ ఉదయం ఒక గ్లాసు రాగి జావ తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారని చెబుతున్నారు.

రాగి సంగటి : ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్‌. దీన్ని మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​గా అయినా, మధ్యాహ్నం లంచ్​లో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.

రాగులతో జావ, సంగటి మాత్రమే కాదు.. రాగి పిండితో దోశలు, ఇడ్లీలు, లడ్డూలు, హల్వా, పరోటా.. వంటివి కూడా ప్రిపేర్ చేసుకొని తినవచ్చంటున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వారు రాగులను ఇలా వివిధ వంటకాల రూపంలో తీసుకోవచ్చు. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాలు అంది.. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.

బరువు కంట్రోల్​ : అధిక బరువుతో బాధపడేవారు రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువును కంట్రోల్​లో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. 100 గ్రాముల రాగుల్లో కేవలం 1.9 గ్రాములు మాత్రమే కొవ్వు పదార్థాలు ఉంటాయట. అలాగే ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని కొద్ది మొత్తంలో తీసుకున్నా కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ తినడాన్ని నివారిస్తుందంటున్నారు.

ఎముకలు స్ట్రాంగ్ : రాగుల్లో కాల్షిషయం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 364 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా.. ఇందులో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుందంటున్నారు. అలాగే దంతాలు గట్టిగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు.

చపాతీ Vs అన్నం - ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా? - పరిశోధనలో తేలింది ఇదే!

2018లో Journal of Food Science and Technologyలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. రాగులతో తయారు చేసిన రొట్టెలు ఎముకల సాంద్రతను పెంచి అవి స్ట్రాంగ్​గా మారడానికి చాలా బాగా తోడ్పడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్​లోని నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ న్యూట్రిషన్​కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఎస్. వెంకటేష్ బాబు పాల్గొన్నారు. రాగులలో ఉండే కాల్షియం ఎముకల దృఢంగా మారడానికి చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

మధుమేహులకు దివ్య ఔషధం : రాగులను మధుమేహులకు దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వీటిలో బియ్యం, గోధుమలతో పోలిస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా రక్తంలోని గ్లూకోజు స్థాయిలు అదుపులో ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆందోళన, డిప్రెషన్​కి గురికాకుండా తోడ్పడతాయంటున్నారు.

అందాన్ని పెంచుతాయి : రాగులు కేవలం ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలో చాలా బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు. వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ ఆమ్లాలు.. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడతాయంటున్నారు. అలాగే వీటిలో ఉండే విటమిన్ బి3, అమైనో ఆమ్లాలు కొలాజెన్ ఉత్పత్తిని పెంచి.. చర్మంపై ముడతలు పడకుండా చేస్తాయంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోడ్డు మీద కనిపించే ఈ పండ్లను లైట్​ తీస్కోకండి - లివర్, షుగర్​ నుంచి గుండె సమస్యల దాకా ఒకే బాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.