ETV Bharat / entertainment

రూ.15 కోట్ల బడ్జెట్​తో రూ.900 కోట్ల కలెక్షన్లు - ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే? - Highest Profits Indian movie

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 9:36 PM IST

Highest Profits Indian movie : ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అంటే అందరికీ అమీర్​ ఖాన్ నటించిన దంగల్ గుర్తొస్తుంది. మరి అత్యధిక లాభాలు తెచ్చిన సినిమా ఏంటో తెలుసా?

Source Getty Images
Highest Profits Indian movie (Source Getty Images)

Highest Profits Indian movie : ఇండియన్ ఫిల్మ్​ హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అనగానే చాలా మంది సినీ ప్రియులకు ఆమీర్​ ఖాన్ నటించిన దంగల్ చిత్రమే గుర్తొస్తుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకుపైనే కలెక్షన్లను అందుకుంది. ఇక దంగల్​ తర్వాత బాహుబలి, కేజీయఫ్ 2, పఠాన్, జవాన్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను అందుకున్నాయి. కానీ ఈ చిత్రాల వసూళ్లను వాటి బడ్జెట్​తో పోలిస్తే మరి భారీ స్థాయిలో ఎక్కువేమీ కాదనే చెప్పాలి. కానీ 2017లో విడుదలైన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా మాత్రం అలా కాదు. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.900 కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంది.

Secret Super Star Movie Collections : హా మీరు చదివింది నిజం. బడ్జెట్ కన్నా దాదాపు 60 రెట్లు ఎక్కువన్న మాట. అలా అత్యధిక లాభాలు అందుకున్న సినిమాగా నిలిచింది సీక్రెట్ సూపర్ స్టార్. ఈ చిత్రం కూడా ఆమిర్ ఖాన్​దే కావడం మరో విశేషం. ఆయనే ఈ చిత్ర నిర్మాత. సినిమాలోనూ గెస్ట్​ రోల్​లో కనిపించారు. జైరా వసీం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.

ఈ చిత్రానికి ఎక్కువ భాగం వసూళ్లు చైనా నుండి వచ్చినవే. భారత దేశంలో ఈ సినిమాకు రూ.90 కోట్ల గ్రాస్, రూ.64 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ నుంచి మరో రూ.65 కోట్లు వరకు అందాయి. మొత్తంగా మొదటిసారి విడుదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.155కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

Secret Super Star Movie Netflix Streaming : తర్వాత రెండో సారి 2018లో చైనాలో రిలీజ్ చేశారు ఈ సీక్రెట్ సూపర్ స్టార్​ను. అప్పుడు ఆ దేశంలో ఏకంగా 10 కోట్ల డాలర్లకుపైనే వచ్చాయట. అలా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.905 కోట్ల కలెక్షన్లను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

OTTలోకి ముగ్గురు ముద్దుగుమ్మల రూ.100 కోట్ల సినిమా - స్ట్రీమింగ్ ఎక్కడంటే? - Crew OTT Release Date

'బుజ్జి' ప్రత్యేకతలివే - వామ్మో ఈ కారు కోసమే అన్ని కోట్లు ఖర్చుపెట్టారా? - Kalki 2898 AD Bujji Car Features

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.