ETV Bharat / technology

లేటెస్ట్​ ఫీచర్లతో ChatGPT -4o రిలీజ్​​​​ - అందరికీ ఫ్రీ! - ChatGPT GPT 4o

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 1:22 PM IST

ChatGPT GPT-4o Features : ఓపెన్‌ ఏఐ కొత్త చాట్​జీపీటీ 4ఓ వెర్షన్​ను విడుదల చేసింది. దీంట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గూగుల్‌ జెమిని కొత్త వెర్షన్​ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఓపెన్‌ ఏఐ దీన్ని తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ChatGPT users are getting GPT-4'o' free
ChatGPT GPT-4o Features (Getty Images)

ChatGPT GPT-4o Features : ఓపెన్‌ ఏఐ సంస్థ తమ ఏఐ మోడల్‌ చాట్​జీపీటీలో కొత్త వెర్షన్​ను లాంఛ్ చేసింది. జీపీటీ-4ఓ (GPT-4o "o" for "omni") పేరిట దీన్ని తీసుకొచ్చింది. మరికొన్ని వారాల్లో అందరికీ ఉచితంగా ఈ కొత్త వెర్షన్​ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. అయితే దీనికి కొన్ని పరిమితులుంటాయని తెలిపింది. పెయిడ్‌ సబ్​స్క్రైబర్లకు మాత్రం అవి వర్తించవని పేర్కొంది.

జీపీటీ-4ఓలో అత్యాధునిక వాయిస్‌, టెక్ట్స్‌, విజన్‌ ఫీచర్లు ఉన్నాయి. జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్‌ రెండింతలు వేగంగా పనిచేస్తుందని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మీరా మురాటీ తెలిపారు. సబ్‌స్క్రిప్షన్‌ ధర సగానికి తగ్గుతుందని వెల్లడించారు. ఈ కొత్త చాట్​జీపీటీ వెర్షన్​ దాదాపు 50 భాషలను సపోర్ట్‌ చేస్తుంది. వీటిలో తెలుగు, గుజరాతీ, తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ వంటి భారతీయ భాషలు ఉండడం గమనార్హం.

అచ్చం మనిషిలాగానే!
వాయిస్‌ కమాండ్లకు మనిషి తరహాలోనే కేవలం 232 మిల్లీ సెకన్లలోనే జీపీటీ-4ఓ సమాధానం ఇస్తుందని ఓపెన్‌ ఏఐ వెల్లడించింది. టెక్ట్స్‌, రీజనింగ్‌, కోడింగ్‌ ఇంటెలిజెన్స్​లో టర్బో కంటే మెరుగ్గా పనిచేస్తుందని పేర్కొంది. మరోవైపు మ్యాక్‌ ఓఎస్‌ యూజర్లకు డెస్క్‌టాప్‌ యాప్​ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో విండోస్‌ యూజర్లకు కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.

జీపీటీ-4ఓ ఫీచర్లకు సంబంధించిన సమాచారాన్ని ఓపెన్‌ ఏఐ తమ బ్లాగ్‌ పోస్ట్​లో వివరించింది. కొత్త వెర్షన్‌ పనితీరును తెలియజేస్తూ కొన్ని వీడియోలను కూడా పోస్ట్‌ చేసింది. దాంట్లో యూజర్లు ఇచ్చే వాయిస్‌ కమాండ్లకు మనిషి తరహాలోనే చాట్​జీపీటీ-4ఓ సమాధానం ఇస్తుండడం కనిపిస్తుంది. పైగా ఒక ఫోన్​లోని ఏఐ మోడల్‌ మరో ఫోన్​లోని జీపీటీ వెర్షన్​తో దానికదే సంభాషించడం గమనించొచ్చు. అలాగే యూజర్‌ సెల్ఫీ వీడియోను విశ్లేషించి వారి మానసిక స్థితి ఎలా ఉందో కూడా చెప్పింది.

గూగుల్‌ సైతం జెమినీ కొత్త వెర్షన్‌ను లాంఛ్ చేయనుంది. మంగళ, బుధవారం జరిగే గూగుల్‌ I/O డెవలపర్ కాన్ఫరెన్స్​లో ఈ కొత్త వెర్షన్​ ఫీచర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే ఓపెన్‌ ఏఐ తమ కొత్త వెర్షన్​ను తీసుకురావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

యాపిల్ కొత్త వెర్షన్​ IOS 17.5 రిలీజ్- ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్- అప్డేట్ చేసుకోండిలా! - Apple iOS Update

రూ.30,000 బడ్జెట్లో మంచి ట్యాబ్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే! - Best Tabs Under 30000

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.