ETV Bharat / technology

యాపిల్ కొత్త వెర్షన్​ IOS 17.5 రిలీజ్- ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్- అప్డేట్ చేసుకోండిలా! - Apple iOS Update

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 6:25 PM IST

Apple Releases iOS 17.5 Update : యాపిల్ కంపెనీ ఐఓఎస్ 17.5 అప్​డేట్​ను రిలీజ్ చేసింది. దీని ద్వారా ఎన్నో అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్లను తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం.

iOS 17.5 launch
Apple Releases iOS 17.5 Update (ETV Bharat)

Apple Releases iOS 17.5 Update : యాపిల్ కంపెనీ లేటెస్ట్ ఐఓఎస్​ 17.5 అప్​డేట్​​ను రిలీజ్ చేసింది. దీనిని ఐఫోన్ మోడల్స్ అన్నింటిలోనూ ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఐఓఎస్ 17.5 అప్​డేట్​లోని బెస్ట్​ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • యూరోపియన్ యూనియన్​లోని ఐఫోన్ యూజర్లకు వెబ్ డిస్ట్రిబ్యూషన్‌ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కనుక వీరు ఐఫోన్ యాప్ స్టోర్​ నుంచి మాత్రమే కాదు, యాప్​లను సైడ్​లోడ్​ కూడా చేయగలుగుతారు.
  • ఐఫోన్ రిపేర్ స్టేటస్​ తెలుసుకోవడం కోసం యూజర్లు తిరగాల్సిన అవసరం లేకుండా, 'ఫైండ్ మై' ట్రాకింగ్ సిస్టమ్​ను తీసుకొచ్చింది యాపిల్​. ఈ ఆప్షన్ ద్వారా యూజర్లు ఈజీగా ఐఫోన్ రిపేర్ స్టేటస్​ను తెలుసుకోవచ్చు.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్​ వినియోగదారుల కోసం, తాజా అప్‌డేట్​ ద్వారా Apple News+ యాప్‌ ఆఫ్‌లైన్ మోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వినియోగదారులు ఇంటర్నెట్‌ లేకపోయినప్పటికీ News+ ట్యాబ్, టుడే ఫీడ్‌ను యాక్సెస్‌ చేయగలుగుతారు.

సెక్యూరిటీ ఫీచర్స్

  • ఎవరైనా మీ ఐఫోన్​ను ట్రాకింగ్ చేయాలని ప్రయత్నిస్తే, మీకు ఇట్టే తెలిసేటట్లు ఓ సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రాస్-ప్లాట్‌ ఫామ్​ ట్రాకింగ్ డిటెక్షన్ అనే ఫీచర్ ద్వారా మీ సమీపంలోని ట్రాకర్​ను సులువుగా గుర్తించవచ్చు.
  • ఈ ఐఓఎస్ 17.5 అప్​డేట్​లోని ఎయిర్​ట్యాగ్స్ ఫీచర్​ ద్వారా మీ డివైజ్​లను ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్​ట్యాగ్​ను ఎనేబుల్ చేసుకుంటే, మీ ఫోన్, కారు లాంటివి చోరీకి గురైనప్పుడు వెంటనే మీకు అలర్ట్ వస్తుంది.
  • ఐఓఎస్ 17.5 విడుదల చేసిన నోట్ ప్రకారం, క్రాస్-ప్లాట్‌ ఫామ్ ట్రాకింగ్ డిటెక్షన్ ఫీచర్ వినియోగదారుల ఫోన్​ను ట్రాకింగ్ చేసే డివైజ్​ను గుర్తిస్తుంది. అంటే మీ మొబైల్​ను ఎవరైనా ట్రాక్ చేస్తుంటే, ఆ విషయాన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఈ భద్రతా ఫీచర్​ను గూగుల్, యాపిల్ కంపెనీలు సంయుక్తంగా 2023లో తీసుకొచ్చాయి.

అప్​గ్రేడ్ చేసుకోండిలా?

  • ముందుగా మీరు ఐఫోన్ సెట్టింగ్స్​లోకి వెళ్లాలి.
  • జనరల్ ఆప్షన్​ను సెలెక్ట్ చేయాలి.
  • సాఫ్ట్​వేర్ అప్​డేట్​పై ట్యాప్ చేయాలి.
  • వెంటనే ఐఓఎస్ 17.5 అప్​​గ్రేడ్​ అవుతుంది.

రూ.30,000 బడ్జెట్లో మంచి ట్యాబ్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే! - Best Tabs Under 30000

మీ ఐఫోన్​ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? ఈ 5 టిప్స్ పాటిస్తే అంతా సెట్​! - How To Maximize IPhone Battery Life

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.