ETV Bharat / technology

రూ.30,000 బడ్జెట్లో మంచి ట్యాబ్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే! - Best Tabs Under 30000

author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 12:03 PM IST

Best Tabs Under 30000 : మీరు మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.30,000 మాత్రమేనా? అయితే ప్రస్తుతం మీ బడ్జెట్​ లో అందుబాటులో ఉన్న టాప్-5 ట్యాబ్లెట్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

TOP 5 TABS Under 30000
Best Tabs Under 30000 (ETV Bharat)

Best Tabs Under 30000 : మీరు మంచి ఫీచర్లు ఉన్న ట్యాబ్​ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.30వేలు మాత్రమేనా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఈ ఆర్టికల్​​లో మీ బడ్జెట్​​లో వచ్చే టాప్​-5​ ట్యాబ్లెట్స్​ గురించి తెలుసుకుందాం.

1. Xiaomi Pad 6 Features : ఈ షావోమి ప్యాడ్ 6 ట్యాబ్ మృదువైన డిస్​ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో వేగవంతమైన ప్రాసెసర్ సహా పలు మంచి ఫీచర్లు ఉన్నాయి.

  • బ్రాండ్ : రియల్ మీ ప్యాడ్ 6
  • డిస్​ప్లే : 11 అంగుళాలు
  • ప్రాసెసర్ : స్నాప్​డ్రాగన్ 870 ఎస్​ఓసీ
  • బ్యాటరీ : 8600mAh
  • ర్యామ్ : 8 జీబీ
  • స్టోరేజ్​ : 128 జీబీ
  • ఫ్రంట్ కెమెరా : 20 MP
  • రియర్​ కెమెరా : 50 MP

Xiaomi Pad 6 Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ షావోమి ప్యాడ్ 6 ధర సుమారుగా రూ.26,999గా ఉంది.

2. Lenovo Tab P12 Features : ఈ లెనోవో ట్యాబ్ పీ12 మోడల్ ఆండ్రాయిడ్​ వి13 ఆపరేటింగ్ సిస్టమ్​​తో పనిచేస్తుంది. దీనికి ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

  • బ్రాండ్ : లెనోవో ట్యాబ్ పీ12
  • డిస్​ప్లే : 12.7 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 7050 ఎస్ఓసీ
  • బ్యాటరీ : 10200mAh
  • ర్యామ్ : 8 జీబీ
  • స్టోరేజ్​ : 256 జీబీ
  • ఫ్రంట్ కెమెరా : 8 MP
  • రియర్​ కెమెరా : 13 MP

Lenovo Tab P12 Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ లెనోవో ట్యాబ్ పీ12 ధర సుమారుగా రూ.28,999గా ఉంది.

3. OnePlus Pad Go Features : ఈ వన్​ప్లస్​ ప్యాడ్ గో మోడల్ ఆండ్రాయిడ్​ 13 ఆపరేటింగ్ సిస్టమ్​​తో పనిచేస్తుంది. మెరుగైన ఆడియో క్వాలిటీని ఇస్తుంది.

  • బ్రాండ్ : వన్​ప్లస్ ప్యాడ్ గో
  • డిస్​ప్లే : 11.35 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ99
  • బ్యాటరీ : 8000mAh
  • ర్యామ్ : 8 జీబీ
  • స్టోరేజ్​ : 256 జీబీ
  • ఫ్రంట్ కెమెరా : 8 MP
  • రియర్ కెమెరా : 8 MP

OnePlus Pad Go Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ వన్​ప్లస్ ప్యాడ్ గో ధర సుమారుగా రూ.19,999గా ఉంది.

4. Samsung Galaxy Tab A9+ Features : ఈ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ మోడల్ ఆండ్రాయిడ్​ 13 ఆపరేటింగ్ సిస్టమ్​​తో పనిచేస్తుంది. రూ.20 వేలలోపు బడ్జెట్​లో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

  • బ్రాండ్ : శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్
  • డిస్​ప్లే : 11 అంగుళాలు
  • ప్రాసెసర్ : స్నాప్​డ్రాగన్ 695 ఎస్​ఓసీ
  • బ్యాటరీ : 5100mAh
  • ర్యామ్ : 8 జీబీ
  • స్టోరేజ్​ : 64 జీబీ
  • ఫ్రంట్ కెమెరా : 5 MP
  • రియర్​ కెమెరా : 8 MP

Samsung Galaxy Tab A9+ Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ ధర సుమారుగా రూ.17,999గా ఉంది.

5. Honor Pad 8 Features : ఈ హానర్ ప్యాడ్ 8 మోడల్ రూ.20 వేలలోపు బడ్జెట్​లో ట్యాబ్లెట్ కొనాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

  • బ్రాండ్ : హానర్ ప్యాడ్ 8
  • డిస్​ప్లే : 12 అంగుళాలు
  • ప్రాసెసర్ : క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 680
  • బ్యాటరీ : 7250mAh
  • ర్యామ్ : 8 జీబీ
  • స్టోరేజ్​ : 128 జీబీ
  • ఫ్రంట్ కెమెరా : 5 MP
  • రియర్​ కెమెరా : 5 MP

Honor Pad 8 Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ హానర్ ప్యాడ్ 8 ధర సుమారుగా రూ.17,999గా ఉంది.

మీ ఐఫోన్​ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? ఈ 5 టిప్స్ పాటిస్తే అంతా సెట్​! - How To Maximize IPhone Battery Life

అమ్మాయిలూ - మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు! ఎక్కడికెళ్లినా సేఫ్‌గా ఉండొచ్చు! - my safetipin app

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.