ETV Bharat / technology

అమ్మాయిలూ - మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు! ఎక్కడికెళ్లినా సేఫ్‌గా ఉండొచ్చు! - my safetipin app

author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 4:40 PM IST

My Safetipin App Uses : ఇంట్లో నుంచి ఆడవాళ్లు బయటకు వెళ్లారంటే.. సేఫ్‌గా తిరిగి వచ్చే వరకు ఫ్యామిలీ మెంబర్స్‌కు భయంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మొబైల్‌ యాప్​ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ యాప్​ ఏంటి? ఎలా లాగిన్​ అవ్వాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Safetipin App
Safetipin App Uses (ETV Bharat)

My Safetipin App Uses : ప్రస్తుత కాలంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే ఇల్లు గడవని పరిస్థితి. దీంతో చాలా మంది మహిళలు బయట వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ మనీ సంపాదిస్తున్నారు. అయితే ఇంత వరకు బానే ఉన్నా.. మహిళల రక్షణ విషయంలో మాత్రం కొన్ని భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకు వెళ్లినప్పటి నుంచి.. తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు భయంగానే ఉంటుంది. కారణం.. నిత్యం మహిళలపై జరుగుతున్న దాడులే. ఈ క్రమంలోనే మహిళలు సేఫ్​గా ఉండాలంటే.. ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ యాప్​ ఉండాలని నిపుణులు అంటున్నారు. ఈ యాప్ వల్ల ఎలాంటి పరిస్థితి నుంచైనా తమను తాము సునాయసంగా రక్షించుకోవచ్చంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మీ ఫోన్​ కెమెరాను Apps యాక్సెస్​ చేస్తున్నాయా? వెంటనే బ్లాక్ చేసేయండిలా! - App Permissions For Protect Data

ఆ యాప్​ ఇదే: నేటి డిజిటల్‌ యుగంలో దాదాపు అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. కాబట్టి మహిళలు సేఫ్​గా ఉండాలంటో ఫోన్లో "మై సేఫ్టీపిన్​ యాప్(My Safetipin App)​" ఉండాలంటున్నారు. ఈ యాప్​ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మై సేఫ్టీపిన్‌ యాప్‌ అనేది వివిధ ప్రాంతాలలో సురక్షితమైన, అసురక్షితమైన ప్లేసెస్‌ గురించి సమాచారం అందించే ఒక క్రౌడ్ సోర్స్ యాప్. మహిళా హక్కుల కార్యకర్త కల్పనా విశ్వనాథ్‌, ఆశిష్‌ బసు సంయుక్తంగా 2013లో మై సేప్టీపిన్‌ యాప్‌ రూపొందించారు.

ఇలా లాగిన్‌ అవ్వండి :

  • ప్లేస్టోర్‌ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక లోకేషన్‌ వివరాలు అడుగుతుంది.
  • పేరు, ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి. సంబంధిత ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగ్‌ఇన్‌ అయిపోవచ్చు.
  • రాత్రుళ్లు ఒంటరిగా నడిచినప్పుడు భయమేస్తే ఈ అప్లికేషన్‌ అన్‌చేస్తే సరి. దీని ద్వారా మనం ఎక్కడున్నది ట్రాక్‌ అవుతూ ఉంటుంది.
  • అప్లికేషన్‌ లాగ్‌ఇన్‌ అయ్యేటప్పుడు సమయానికి అందుబాటులోకి వచ్చి, మనల్ని రక్షించగలిగే ఐదుగురు వ్యక్తుల ఫోన్‌ నెంబర్లను నిక్షిప్తం చేయాలి.

ఉపయోగాలు...

  • మై సేప్టీపిన్‌ యాప్‌ మీరు ఉన్న లొకేషన్‌ ఎంత వరకు సేఫ్‌ అనేది రేటింగ్‌ రూపంలో తెలియజేస్తుంది. అలాగే ఈ యాప్‌ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఎప్పటికప్పుడూ మెసేజ్‌ల రూపంలో సందేశాలు వెళ్తుంటాయి.
  • ప్రయాణాల్లో మనకి రక్షణ లేదు అనిపించినప్పుడు... ఈ అప్లికేషన్‌ ఆన్‌ చేస్తే మనల్ని రక్షించే వారికి సందేశం చేరుతుంది. దీని కోసం ఫైండ్‌ సపోర్ట్‌ ఆప్షన్‌ ఉంటుంది.
  • క్యాబ్‌లు, బస్‌లు ఎక్కినప్పుడు మన లోకేషన్‌ను తెలిసిన వారికి షేర్‌ చేస్తే... వాళ్లు సులువుగా మనల్ని ట్రాక్‌ చేసేయవచ్చు
  • ఇంకా మీరు ఎక్కడికైనా కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్న సౌకర్యాల గురించి యాప్‌లో తెలుసుకోవచ్చు. అలాగే యాప్‌ ద్వారా ట్రాఫిక్‌ ఎక్కడ ఉంది, బస్‌స్టేషన్‌, రైల్వే స్టేషన్‌, పోలీస్‌ స్టేషన్‌, ఆసుపత్రి ఎంత దూరంలో ఉంది వంటి వివిధ రకాల మొత్తం సమాచారం ఈజీగా తెలుసుకోవచ్చు.
  • ఒకవేళ యాప్‌ వాడుతున్న వారు తప్పిపోతే.. వారి లొకేషన్‌ను ఈజీగా గుర్తించవచ్చు.
  • అలాగే మనం అసురక్షితమైన ప్రదేశంలో ఉంటే ఆటోమెటిక్‌గా యాప్‌లో నమోదు చేసిన నెంబర్లకు.. లొకేషన్‌తో కూడిన నోటిఫికేషన్లు వెళ్తాయి.
  • అందుకే ఇంత సురక్షితమైన ఈ మై సేఫ్టీపిన్‌ యాప్‌ను ప్రతి మహిళా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అమ్మాయిలు, మీ ఫోన్​లో ఈ యాప్స్​ ఉన్నాయా? లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఇబ్బందులే​!

రూమ్​లో ఉన్న స్పై కెమెరాలను గుర్తించాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.