ETV Bharat / bharat

అమ్మాయిలు, మీ ఫోన్​లో ఈ యాప్స్​ ఉన్నాయా? లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఇబ్బందులే​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 2:04 PM IST

Women Safety Apps : ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, రక్షణ చర్యలు తీసుకుంటున్నా.. మహిళలపై దాడులు జరగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటున్న తరుణంలో.. అత్యవసర పరిస్థితుల నుంచి తమను తాము రక్షించుకునేలా పది అద్భుతమైన యాప్​లు తీసుకొచ్చాం. అవి మీ ఫోన్​లో ఉన్నాయంటే మీరు చాలా వరకు సేఫ్! అవేంటో ఇప్పుడు చూద్దాం..

Safety Apps
Safety Apps

Best Safety Apps for Women : నేటి ఆధునిక కాలంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఒక్కరే సంపాదిస్తే ఇల్లు గడవని పరిస్థితి. ఈ క్రమంలో మహిళలూ బయటకు వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నారు. కొందరు మహిళామణులైతే పురుషులకంటే తామేమి తక్కువ కాదంటూ వివిధ రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించి సంపాదనలో దూసుకెళ్తున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. మహిళల భద్రతా విషయంలో మాత్రం కొన్ని భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా వారిపై రోజూ ఎక్కడో ఓ చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

Women Safety Apps : ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు కొందరు ఆకతాయిలు ఒంటరి మహిళలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో పనిచేస్తున్న ప్రదేశంలో, ప్రయాణ సమయాల్లోనూ ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి దగ్గర స్మార్ట్​ఫోన్(Smart Phone) అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ క్రమంలో మహిళలు సేఫ్​గా ఉండాలంటే.. ఈ పది మొబైల్ యాప్​ల గురించి తెలుసుకోవాలి. ఈ యాప్​ల వల్ల ఎలాంటి పరిస్థితి నుంచైనా తమను తాము సునాయసంగా రక్షించుకోవచ్చు. మరి ఆ యాప్​లు ఏంటంటే..?

మహిళలు తెలుసుకోవాల్సిన పది రక్షణ యాప్‌లివే..

సేఫ్టిపిన్ : మహిళల భద్రతకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది నగర ప్రాంతాలలో సురక్షితమైన, అసురక్షిత ప్లేసేస్ గురించి ఇన్ఫర్మేషన్ అందించే క్రౌడ్ సోర్స్ యాప్. పట్టణంలోని వివిధ ప్రదేశాల గురించి సరైన సమాచారం ఇవ్వడంతో పాటు ట్రాకింగ్ చేసి ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే వాటికి భద్రతా రేటింగ్​నూ ఇస్తుంది.

ఫైట్‌బ్యాక్ : ఈ ఫైట్​బ్యాక్ అనే యాప్ మహిళలకు స్వీయ రక్షణ అందిస్తుంది. ఈ యాప్​ స్వీయ-రక్షణ ట్యుటోరియల్స్​తో పాటు​ భద్రతా సలహాలను ఇస్తోంది. అదే విధంగా ఈ యాప్ మీ ఫోన్​లో ఉన్నట్లయితే మీరు ఎక్కడున్నారో మీ కుటుంబసభ్యులు లేదా ఫ్రెండ్స్​కు తెలియజేసేలా Sos మెస్సేజ్​ను పంపే వీలును కల్పిస్తోంది.

సాస్‌ స్టే సేఫ్ : మహిళల భద్రతకు ఉపయోగపడే మరో అద్భుతమైన యాప్ ఇది. ఈ యాప్ మీ ఫోన్​లో ఉన్నట్లయితే కేవలం ఒక ట్యాప్‌తో మీకు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి సాస్‌(Sos) సందేశాన్ని పంపవచ్చు. అదేవిధంగా ఈ యాప్‌లో లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలారం ఫీచర్స్ కూడా ఉన్నాయి.

బీసేఫ్‌ : ఈ యాప్​లో Sos అలారమ్ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. అదే విధంగా ఈ యాప్ ఎగ్జాక్ట్ లోకేషన్ వివరాలతో ఆడియో, వీడియో వివరాలను తెలియజేస్తుంది. దీనిలో మీరు ఫోన్ కాల్ మాట్లాడతున్నట్టు యాక్ట్ చేసేందుకు ఫేక్ కాల్ ఫీచర్ కూడా ఉంది. టైమర్ అలారమ్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ఈ యాప్ మీ ఫోన్​లో ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు మీ గార్డియన్​కు మీ వివరాలు అందిస్తుంది.

సర్కిల్‌ ఆఫ్‌ 6 : మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యాప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ యాప్​ ఉన్నట్లయితే ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు వెంటనే సుమారు ఆరుగురు విశ్వసనీయ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను సంప్రదించేలా అనుమతిస్తుంది.

షేక్2సేఫ్టీ : ఈ యాప్ మీ ఫోన్​లో ఉన్నట్లయితే చాలా ఈజీగా అత్యవసర పరిస్థితుల నుంచి బయటుపడవచ్చు. మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కేవలం మీ ఫోన్​ను షేక్ చేయడం ద్వారా ముందుగా సేవ్ చేసిన కాంటాక్స్‌ నెంబర్స్‌కి అత్యవసర సందేశాన్ని పంపేలా ఈ యాప్ అనుమతిస్తుంది.

మహిళలు అడుగు బయటపెడితే - హ్యాండ్​ బ్యాగులో ఇవి ఉండాల్సిందే!

విత్‌యూ(VithU) : ఇది కూడా మహిళ భద్రతకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ యాప్​తో జస్ట్‌ రెండు ట్యాప్‌లతో మీ కాంటాక్ట్స్‌లో ఉన్న నెంబర్స్‌కి సాస్‌(SOS) సందేశాన్ని పంపే వీలు కల్పిస్తోంది. అదేవిధంగా పరిస్థితికి సంబంధించిన సాక్ష్యాలను తెలిపేలా ఆడియో లేదా వీడియోలను రికార్డ్ చేసే ఫీచర్‌ కూడా ఈ యాప్​లో ఉంది.

మై సేఫ్టీపాల్‌ : ఈ యాప్ మీ ఫోన్​లో ఉన్నట్లయితే మీరు ఉన్న ప్రదేశానికి సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో షేర్‌ చేసుకోవచ్చు. అలాగే మై సేఫ్టీపాల్ యాప్ వివిధ లొకేషన్‌లలో అత్యవసర హెచ్చరికలు, పానిక్ బటన్, సేఫ్టీ స్కోర్ వంటి ఫీచర్‌లనూ కల్పిస్తుంది.

నిర్భయం : దేశంలోని మహిళల కోసం ఈ యాప్​ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇది రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్‌లతోపాటు వన్-టచ్ పానిక్ బటన్‌ ఫీచ్​ర్​ను కలిగి ఉంది.

లైఫ్‌ 306 : ఇది కుటుంబ భద్రత యాప్. ఈ యాప్ మీ ఫోన్​లో ఉంటే ఎమర్జెన్సీ టైమ్​లో కుటుంబ సభ్యులతో ప్రైవేట్ నెట్‌వర్క్‌ని సృష్టించుకునే అవకాశం కల్పిసోంది. అలాగే ఈ యాప్ కూడా రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ అలర్ట్‌లతో పాటు ఆటోమేటిక్ క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్‌లనూ అందిస్తుంది.

గమనిక : మహిళలు తమ రక్షణ కోసం ఈ యాప్‌లను ఉపయోగించడం ద్వారా ఎమర్జెన్సీ టైమ్​లో సహాయం పొందవచ్చు. అయితే వీటి మీదనే పూర్తిగా ఆధారపడకుండా.. ఆపద సమయంలో సొంత జాగ్రత్తలూ తీసుకోవడం కూడా మర్చిపోవద్దు.!

మహిళలు ఈ 5 ఆహార పదార్థాలు తిన్నారంటే - ఆరోగ్య సమస్యలన్నీ పారిపోతాయి!

మహిళల్లో అధిక బరువా? కారణం తిండి కాకపోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.