ETV Bharat / entertainment

బాలయ్యకు పోటీగా పవన్ కల్యాణ్​! - NBK 109 vs OG movie

author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 6:36 PM IST

Balakrishna NBK 109 VS Pawankalyan OG : అగ్రహీరోలు బాలకృష్ణ, పవన్ కల్యాణ్​ ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ ముందు పోటీకి దిగబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Balakrishna NBK 109 VS Pawankalyan OG (source ETV Bharat)

Balakrishna NBK 109 VS Pawankalyan OG : తెలుగు సినీ ప్రేక్షకులకు వరుస సినిమాలు కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే ఏడు నెలల పాటు ప్రభాస్ కల్కి 2898 AD, జూనియర్ ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, పవన్ కల్యాణ్ ఓజీ, బాలకృష్ణ NBK 109లు డిసెంబరు వరకూ వరుసగా రిలీజ్ కానున్నాయి.

దర్శకనిర్మాతలు నానా తంటాలు పడి మేజర్ సినిమాలకు క్లాష్ లేకుండా ఈ లైనప్ సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ చివరికి తిప్పలు తప్పేలా లేవు. ఓజీ, గేమ్ ఛేంజర్, NBK 109లు ఇంకా రిలీజ్ డేట్స్ ఇంకా కన్ఫామ్ చేయకపోవడంతోనే వచ్చింది అసలు సమస్యంతా. వీటిల్లో NBK 109, ఓజీ రెండూ డిసెంబరులోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. ఈ ఇద్దరు హీరోలు చాలా గ్యాప్ తర్వాత షూటింగుల్లో పాల్గొనడటంతో పాటు పండుగ సీజన్‌ను టార్గెట్ చేసుకుని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తారని అంటున్నారు.

ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలనుకున్న ఓజీ వాయిదా పడినట్లు కొత్త ప్రచారం మొదలైంది. బాబీ డైరక్షన్‌లో రానున్న NBK 109 సినిమా పరిస్థితి కూడా ఇదే. అక్టోబరు తొలి వారంలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ముందుగా ప్లాన్ చేసుకున్న డేట్స్ కాకుండా డిసెంబరులోనే వీరి సినిమాలను తీసుకురావాలని అనుకుంటున్నారట. అదే జరిగితే పోటాపోటీగా పవన్, బాలయ్య సినిమాలు రిలీజ్ అవడం ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌కు పండగే.

Nagachaitanya Thandel and Nithin Robinhood : అయితే ఇదే డిసెంబర్​లో నాగచైతన్య - సాయిపల్లవి తండేల్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు కూడా డిసెంబర్​లో వస్తాయని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఒకవేళ ఈ నాలుగు చిత్రాలన్ని డిసెంబర్​లో వస్తే స్టార్ హీరోల సినిమాలతో ఆ నెలంతా ఫుల్ బిజీ అవనుందన్నమాట. చూడాలి మరి ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయో, ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో

బాలయ్య సీట్ దగ్గర మద్యం సీసా - అసలు విషయం చెప్పిన నిర్మాత నాగవంశీ - Viswak Sen Gangs Of Godavari
బుజ్జి - భైరవ ట్రైలర్ - యానిమేషన్‌ యాక్షన్ అదుర్స్! - Kalki 2898 AD Trailer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.