ETV Bharat / snippets

రోహిత్​తో వివాదం!- కాంట్రవర్సీకి చెక్ పెట్టిన గిల్- ఏమన్నాడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 2:17 PM IST

Shubman Gill Rohit Sharma
Shubman Gill Rohit Sharma (Source: Getty Images)

Shubman Gill Rohit Sharma: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ మధ్య వివాదాలు ఏర్పడ్డాయని రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్​కు గిల్ చెక్ పెట్టాడు. రోహిత్​, సమైర (రోహిత్ కుమార్తె)తో దిగిన ఓ ఫొటోను తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశాడు. 'నేను, సమైరా ఇద్దరం కూడా రోహిత్ శర్మ నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటాం' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఒక్క పోస్ట్​తో వీరిద్దరి మధ్య వివాదాలున్నాయన్న వార్తలకు గిల్ క్లారిటీ ఇచ్చాడు.

కాగా, వరల్డ్​కప్​కు ట్రావెల్ రిజర్వ్డ్​గా ఎంపికైన గిల్ త్వరలోనే భారత్​కు రానున్నాడు. ఈ క్రమంలో గిల్​పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనిపై బ్యాటింగ్ కోచ్ విక్రమ్‌ క్లారిటీ ఇచ్చాడు. వెస్టిండీస్​లో మ్యాచ్​లు ఆడే సమయానికి ఇద్దరు రిజర్వు ఆటగాళ్లే సరిపోతారని భావించిన మేనేజ్​మెంట్ గిల్​ను వెనక్కి పంపుతుందని చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.