ప్రియురాలితో సహజీవనం - భార్యకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్త - husbund illegal affair

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 2:40 PM IST

thumbnail
ప్రియురాలితో సహజీవనం - భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన భర్త

Wife Caught Husband Cheating In Hyderabad : హైదరాబాద్ ముషీరాబాద్​లో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన ప్రేయసితో అడ్డంగా భార్య వద్ద బుక్కయ్యాడు. ప్రియురాలితో సహజీవనం చేస్తూ భార్యకు రెడ్ హ్యాండెడ్​గా దొరికిపోయాడు.  భార్యాపిల్లలు అతడికి, అతడి ప్రియురాలికి దేహశుద్ధి చేశారు. 

ముషీరాబాద్ ఎస్ఆర్​టీ కాలనీకి చెందిన ప్రవీణ్​కు గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య వివాదాలు ఏర్పడి వేరుగా ఉంటున్నారు.  భార్య, భర్తపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 498 కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.

భార్య పుట్టింట్లోనే ఉండడంతో తన ఆఫీసులో పనిచేసే మరో మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు ప్రవీణ్. గత కొంతకాలంగా ఈ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేస్తున్న మహిళకు కూడా గతంలోనే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె కూడా భర్తతో వేరుగా ఉంటూ ప్రవీణ్​తో సహజీవనం చేస్తుంది. ఈ విషయంపై ప్రవీణ్ భార్యాపిల్లలు నిలదీసి అతడిపై దాడి చేశారు. అతడు ఎదురుతిరిగి భార్యపై ఎదురుదాడికి తెగబడ్డాడు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.