ETV Bharat / bharat

దున్నపోతుపై వచ్చి ఎలక్షన్ నామినేషన్

author img

By

Published : Sep 13, 2021, 10:59 AM IST

Updated : Sep 13, 2021, 11:42 AM IST

ఎన్నికల నామినేషన్ అంటే అభ్యర్థుల ఆడంబరాలు అంతా ఇంతా కాదు. రోడ్​షోలు, ర్యాలీలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. గ్రామాల్లో జరిగే చిన్నపాటి ఎన్నికల్లో కూడా కొందరు తమ అనుచరులతో కలిసి అట్టహాసంగా నామినేషన్ (Election nomination) వేస్తుంటారు. అయితే, ఓ అభ్యర్థి విచిత్రంగా దున్నపోతుపై ఊరేగింపుగా వచ్చారు.

BUFFALO NOMINATION bihar
దున్నపోతుపై వచ్చి ఎలక్షన్ నామినేషన్

దున్నపోతుపై వచ్చి ఎలక్షన్ నామినేషన్

బిహార్​ పంచాయతీ ఎన్నికల్లో (Bihar panchayat election 2021) ఓ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ వేశారు. దున్నపోతుపై ఊరేగింపుగా వచ్చి నామపత్రాలు (Election nomination) సమర్పించారు. కటిహార్ జిల్లాలోని రాంపుర్ పంచాయతీలో (Rampur Bihar) ఇది జరిగింది.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol price) ఆకాశాన్నంటిన నేపథ్యంలో.. వాటిని కొనే శక్తి తనకు లేదని అభ్యర్థి ఆజాద్ ఆలమ్ చెప్పుకొచ్చారు. 'నేనో పశుపోషకుడిని. పెట్రోల్, డీజిల్ కొనే స్తోమత లేకనే.. ఇలా దున్నపోతుపై వచ్చాను' అని చెప్పారు.

బిహార్ పంచాయతీ ఎన్నికలు 11 విడతల్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి డిసెంబర్ 12 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: బులెట్​ బైక్​ల రిపేరింగ్​లో దిట్ట ఈ 'దియా'

Last Updated : Sep 13, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.