ETV Bharat / sitara

రామోజీ ఫిల్మ్‌సిటీలో నాగ్​ 'బంగార్రాజు'!

author img

By

Published : Sep 13, 2021, 6:42 AM IST

నాగార్జున,నాగచైతన్య నటిస్తున్న 'బంగార్రాజు' (Bangarraju movie Naga Chaitanya) సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కర్ణాటకలో కొన్ని సన్నివేశాలను షూట్​ చేసిన చిత్ర బృందం.. రామోజీ ఫిల్మ్‌ సిటీలో(Bangarraju movie shooting location) మరిన్ని సీన్​లను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Bangarraju movie shooting
'బంగార్రాజు' చిత్రీకరణ

'బంగార్రాజు' జోరు మీదున్నారు. నాగార్జున(Bangarraju movie Nagarjuna), నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మైసూర్‌లో ఇటీవలే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ నెల 14 నుంచి రామోజీ ఫిల్మ్‌ సిటీలో(bangarraju movie shooting location) చిత్రీకరణ జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా సెట్స్‌ సిద్ధం చేశారు. 'సోగ్గాడే చిన్నినాయనా'కు(Nagarjuna movies) కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna movies).. జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి లక్ష్యంగా ముస్తాబవుతున్న సినిమా ఇది. తొలి చిత్రమూ సంక్రాంతికే వచ్చి ఘన విజయం సాధించింది. పండగ సినిమాగా ముస్తాబవుతున్న ఇందులో నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాము రమేష్‌, చలపతిరావు, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: Nabha Natesh: ''మాస్ట్రో' సినిమా ఛాన్స్ రాగానే కంగారుపడ్డా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.