ఫిట్​గా ఉండాలంటే ఇవి తినాల్సిందే!

author img

By

Published : Sep 13, 2021, 4:29 PM IST

Fitness

శరీరం ఫిట్​గా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం. అందుకు సరైన పోషకాహారం, మంచి జీవనశైలి ఎంతో ముఖ్యం. వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి మన శరీరం ఎల్లప్పుడూ ఫిట్​గా (Fitness), ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి డైట్​ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఫిట్​గా (Fitness) ఉండటంలో ఆహారానిది ప్రధానపాత్ర. ఉదయం లేవగానే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? అని చాలామందికి ప్రశ్నగా మిగిలిపోతుంది. అనారోగ్యకరమైన ఆహారం తినడం, ఫాస్ట్​ఫుడ్​తో కడుపు నింపుకోవడం వల్ల మనిషి బరువు అసహజంగా పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. బరువు ఎక్కువగా ఉండేవారు 13 రకాల క్యాన్సర్ల బారినపడే ముప్పు ఉందని ఇటీవలే ఓ అధ్యయనం తెలిపింది. పోషకాలు లేని ఆహారం, అర్ధరాత్రి వరకు తింటూ ఉండటం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

మరి ఆరోగ్యకరంగా ఉండటానికి ఏం తినాలంటే (fitness food plan)..

  • పాలల్లో ఒక బౌల్ హోల్ గ్రేన్​ సెరియల్ వేసుకొని తింటే మంచింది. లేదా గోధుమలతో తయారు చేసిన టోస్ట్ తినాలి.
  • అరటిపండు కూడా ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే మంచిది. బీపీ ఉన్నవారు పొటాషియం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
  • రోజుకు ఒక యాపిల్ లేదా అరటిపండు తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి. వర్క్​అవుట్స్​ చేయడానికి కనీసం 5 నుంచి 10 నిమిషాల ముందు (best food to eat before workout) యాపిల్ గానీ అరటిపండు గానీ తీసుకోవాలి. సహజ సిద్ధంగా శక్తి సమకూరుతుంది. మీ శరీరం ఈ కార్బోహైడ్రేట్స్​ను సులభంగానే జీర్ణం చేసుకోగలదు. వెంటనే శక్తి సమకూరి వ్యాయామం చేయవచ్చు. దీంతోపాటు వేరే ఏదైనా పండ్లు తీసుకోవాలి.

బ్యాలెన్స్​డ్ డైట్ (balanced diet) ముఖ్యం..

అన్ని రకాల పోషక పదార్థాలు సమతూలికగా ఉండే ఆహారాన్ని సంపూర్ణ ఆహారం (బ్యాలెన్స్​డ్ డైట్) అంటారు. ఇది ప్రతి వయసుకు మారుతూ ఉంటుంది. పోషక విలువలు అంతే ఉన్నప్పటికీ ఎంత మోతాదులో తీసుకోవాలి అనే దాంట్లో వ్యత్యాసం ఉంటుంది.

బ్యాలెన్స్​డ్ డైట్ 3 రకాలు. ఒకటి శరీర పెరుగుదలకు, రెండోది శరీర ప్రక్రియను మెరుగుపరచడానికి, చివరగా శరీరానికి ఇంధనం ఇవ్వడానికి.

బ్యాలెన్స్​డ్ డైట్​లో ఏముండాలి?

సమతూలిక ఆహారంలో ముఖ్యంగా కావాల్సింది పిండి పదార్థాలు, మాంసకృత్తులు.

పిండి పదార్థాలు.. బియ్యం, గోధుమలు, గింజ ధాన్యాల రూపంలో లభిస్తాయి. చిరుధాన్యాల్లో మిగిలినవాటితో పోలిస్తే పీచు ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కుంటుపడిన కణాలను రిపేర్ చేయడానికి మాంసకృత్తులు ఉపయోగపడతాయి. శాకాహారులకు అవి పప్పులు, డ్రైఫ్రూట్స్, పల్లీలు, నూనెగింజలు, అంజీర​ రూపంలో లభిస్తాయి.

అంతేకాక..

ఖనిజ లవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు, పల్ల రసాలు వంటివి తీసుకోవాలి. ఆకు కూరలను ఏదో ఓ రూపంలో తప్పనిసరిగా రోజుకు కనీసం 100 గ్రాములు తినేలా చూసుకోవాలి. నూనెల్లో రిఫైనింగ్​ చేయని వాటిని తీసుకునప్పుడే వాటిలోని పోషకవిలువలు (nutrition) శరీరానికి అందుతాయి. ఒకటే రకంగా కాకుండా రెండు, మూడు రకాల నూనెలు వాడటం వల్ల వాటన్నింటిలోని ఫ్యాటీ యాసిడ్స్​ లభిస్తాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: పిల్లలు బలహీనంగా పుట్టడానికి కారణం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.