ETV Bharat / international

'వచ్చే నెల చివర్లో చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్​!'

author img

By

Published : Sep 13, 2021, 12:53 PM IST

వచ్చే నెల చివరినాటికి 5 నుంచి 11 ఏళ్ల వయసు చిన్నారుల (vaccine for children) కోసం కొవిడ్ వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని తెలిపారు అమెరికా ఆరోగ్య నిపుణులు. పిల్లల టీకాకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్​ను మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

vaccine for children in america
అమెరికాలో చిన్నారులకు టీకా

అమెరికాలో డెల్టా వేరియంట్​ విజృంభణతో(Delta Variant In America) కరోనా బాధితులుగా మారుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతున్న వేళ ఊరటనిచ్చే కబురు! అక్టోబర్​ నెల చివరినాటికి 5 నుంచి 11 ఏళ్ల వయసు వారికి టీకా(vaccine for children) అందుబాటులోకి వస్తుందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ మేరకు 'న్యూయార్క్​ టైమ్స్​' వార్తా సంస్థకు అమెరికాకు చెందిన ఇద్దరు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం 12 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే టీకాలు అందజేస్తున్నారు.

చిన్నపిల్లల టీకాకు(vaccine for children) సంబంధించిన క్లినికల్ సమాచారంపై పూర్తి స్థాయి సమీక్ష జరపాల్సి ఉంటుందని ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ మాజీ కమిషనర్​, ప్రస్తుత ఫైజర్ వ్యాక్సిన్ బోర్డు సభ్యుడు డాక్టర్ స్కాట్​ గాట్లీబ్ తెలిపారు. ఫైజర్​ సంస్థ(Pfizer Vaccine For Kids) అభివృద్ధి చేసిన పిల్లల టీకా.. అక్టోబర్​ 31 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్​ క్లినికల్​ సమాచారంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

టెక్సాస్​లోని పిల్లల ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణుడు డాక్టర్​ జేమ్స్​ వెర్సాలోవిక్​.. గాట్లీబ్​తో ఏకీభవించారు. అక్టోబర్​ నాటికి పిల్లల టీకా అనుమతి పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్​ను మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. డెల్టా వేరియంట్(Delta Variant In America)​ కారణంగా ఆస్పత్రుల్లో చేరే చిన్నారుల సంఖ్య పెరుగుతోందని వివరించారు.

ఇదీ చూడండి: కరోనాతో హై అలర్ట్​- ఆ నగరంలో రైళ్లు, బస్సులు బంద్​

ఇదీ చూడండి: జూలో 13 గొరిల్లాలకు కరోనా.. వారే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.