ETV Bharat / sitara

రిలయన్స్, టీ-సిరీస్ ఒప్పందం.. భారీ సినిమాలే లక్ష్యంగా!

author img

By

Published : Sep 13, 2021, 11:48 AM IST

భారీ, మధ్య తరహా సినిమాలను(big budget movies) తెరకెక్కించేందుకు రెండు బడా సంస్థలు చేతులు కలిపాయి. దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో 10కిపైగా చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవిక అంశాల ఆధారంగా విభిన్న సినిమాలను రూపొందించనున్నాయి.

big budget movies
భారీ బడ్జెట్ సినిమాలు

ఇటీవల కాలంలో భారీ బడ్జెట్​ సినిమాలకు(big budget movies) క్రేజ్​ పెరిగింది. ఈ క్రమంలోనే టీ-సిరీస్(T series upcoming movies), రిలయన్స్ ఎంటర్​టైన్​మెంట్స్​(Reliance Entertainment upcoming movies) సంస్థలు కలిసి భారీ, మధ్యతరహా బడ్జెట్​ సినిమాలను(big budget movies in India) రూపొందించేందుకు చేతులు కలిపాయి. దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో 10కి పైగా చిత్రాలను తెరకెక్కించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపాయి.

కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను (కంటెంట్​ రిచ్ ఫిల్మ్స్​) (upcoming big budget movies) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆ సంస్థలు స్పష్టం చేశాయి. ప్రధానంగా తమిళ బ్లాక్​బాస్టర్​ మూవీస్​.. హిందీలో రీమేక్​, బయోపిక్​, ​థ్రిల్లర్​, కామెడీ, రొమాన్స్​ సహా వాస్తవిక కథనాల ఆధారంగా చిత్రాలను రూపొందించనున్నట్లు వెల్లడించాయి.

రానున్న రెండు మూడేళ్లలో ఈ సినిమాల చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నాయి. పుష్కర్​-గాయత్రి, విక్రమజిత్​ సింగ్​, మంగేశ్​ హదవాలే, శ్రీజిత్​ ముఖర్జీ, సంకల్ప రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాలను రూపొందించనున్నట్లు తెలిపాయి. గతంలో.. టీ-సిరీస్​, రిలయన్స్​ ఎంటర్‌టైన్​మెంట్​ కలిసి 100కి పైగా చిత్రాలకు మ్యూజిక్ మార్కెటింగ్​ చేశాయి.

ఇదీ చూడండి: బడా బ్యానర్​లో బాలయ్య చిత్రం.. విభిన్న కథతో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.