ETV Bharat / state

JEE MAINS: జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం విద్యార్థుల నిరీక్షణ..

author img

By

Published : Sep 13, 2021, 3:28 PM IST

జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం విద్యార్థుల నిరీక్షణ తప్పడం లేదు. ఫలితాల కోసం 4 రోజులుగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ర్యాంకుల వెల్లడిలో జాప్యంతో జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లపై గందరగోళం నెలకొంది.

JEE MAINS
జేఈఈ మెయిన్స్​

జేఈఈ (JEE MAIN) మెయిన్ ఫలితాలు విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. జేఈఈమెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాప్యంపై అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది విద్యార్థులు నాలుగు రోజులుగా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఫలితాలు ఎప్పుడు విడుదలు చేస్తారనే అంశంపై జాతీయ పరీక్షల సంస్థ(NTA) స్పష్టతనివ్వడం లేదు. ఎన్టీఏ తీరుపట్ల అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకుల వెల్లడిలో జాప్యం వల్ల జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలోనూ గందరగోళం నెలకొంది.

ఈనెల 11న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంది. 10వ తేదీ నాటికి జేఈఈ మెయిన్ ర్యాంకులు వెల్లడి కాకపోవడంతో... అడ్వాన్స్‌డ్ దరఖాస్తుల ప్రక్రియను ఐఐటీ ఖరగ్ పూర్(IIT KHARAGPUR) వాయిదా వేసింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్లు ఉంటాయని ఐఐటీ ఖరగ్ పూర్ ప్రకటించినప్పటికీ... ర్యాంకుల విడుదలలో జాప్యం వల్ల ప్రారంభం కాలేదు. జేఈఈ మెయిన్‌లో మొదటి రెండున్నర లక్షల మంది ర్యాంకర్లకు అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్ల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం ఉన్నత విద్యా మండలి ఎదురు చూస్తోంది.

ఇదీ చదవండి: high court: ఏపీపీల నియామక ప్రక్రియలో జాప్యంపై హైకోర్టు అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.