ETV Bharat / bharat

భాజపా గూటికి మాజీ రాష్ట్రపతి మనవడు

author img

By

Published : Sep 13, 2021, 5:26 PM IST

మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ మనవడు ఇంద్రజిత్​ సింగ్ భాజపాలో చేరారు. వచ్చే ఏడాది పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు(Punjab Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు.

Former President Giani Zail Singh grandson joins BJP
కమలం గూటికి మాజీ రాష్ట్రపతి మనవడు

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు(Punjab Assembly Elections) జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లోకి చేరికల పర్వం మొదలైంది. భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్​ దివంగత నేత జ్ఞానీ​ జైల్ సింగ్​​ మనవడు(Giani Zail Singh Grandson) ఇంద్రజిత్​ సింగ్ భాజపా గూటికి చేరారు. దిల్లీలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

భాజపాలో చేరిన అనంతరం కాంగ్రెస్​పై విమర్శలతో విరుచుకుపడ్డారు ఇంద్రజిత్. తన తాత జ్ఞానీ సింగ్ కాంగ్రెస్​ పార్టీకి ఎంతో విధేయతతో పని చేశారని, కానీ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.

తన తాత మరణంపైనా సందేహాలున్నాయని వ్యాఖ్యానించారు ఇంద్రజిత్. ఆయన యాక్సిడెంట్​లో చనిపోయారని, కానీ అది ప్రమాదమా? హత్యా? కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్​లోనూ..

వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఉత్తరాఖండ్​లోనూ భాజపాలోకి వలసలు కొనసాగుతున్నాయి. పురోలా కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాజ్​కుమార్ ఇటీవలే కాషాయ కండువా కప్పుకొన్నారు. అంతకుముందు ఉత్తరాఖండ్ క్రాంతి దళ్​ నాయకుడు, ధనౌల్టీ ఎమ్మెల్యే ప్రీతం పన్వార్ కమలం గూటికి చేరారు.

మిత్రపక్షం ఆకాలీదళ్​తో విడిపోయిన తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో(Punjab Elections) ఒంటరిగా పోటీ చేయాలని భాజపా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. రానున్న రోజుల్లో చాలా మంది నాయకులు ఆ పార్టీలో చేరే అవకాశముంది.

ఇదీ చదవండి: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.