ETV Bharat / sports

రాజస్థాన్​పై ఘన విజయం - ఫైనల్​కు దూసుకెళ్లిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ - IPL 2024 Qualifier 2

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 11:22 PM IST

Updated : May 24, 2024, 11:28 PM IST

IPL 2024 Sunrisers Hyderabad Final : ఐపీఎల్​ 2024లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ విజయం సాధించి ఫైనల్​కు దూసుకెళ్లింది. 36 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సన్​రైజర్స్​ తుది పోరులో కోల్​కతా నైట్​ రైడర్స్​తో తలపడనుంది.

Source The Associated Press
IPL 2024 Qualifier 2 (Source The Associated Press)

IPL 2024 Sunrisers Hyderabad Final : ఐపీఎల్​ 2024లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ విజయం సాధించి ఫైనల్​కు దూసుకెళ్లింది. 36 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సన్​రైజర్స్​ తుది పోరులో కోల్​కతా నైట్​ రైడర్స్​తో తలపడనుంది.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్​ రాయల్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. హైదరాబాద్‌ బౌలర్ల దెబ్బకు ఆర్​ఆర్​ బ్యాటర్లు తడబడ్డారు. యశస్వి జైశ్వాల్​(42: 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్​ జురెల్​ (56*: 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. టామ్​ కోహ్లెర్​(10), కెప్టెన్ సంజూ శాంసన్​(10), రియాన్ పరాగ్(6), సిమ్రాన్​(4), రోవ్మన్​ పోవెల్​(6) పరుగులు చేశారు. అసలు 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆర్​ఆర్. ఈ సమయంలో జురెల్‌ ఆదుకోవడంతో రాజస్థాన్‌ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. లేదంటే భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయేది. ఎస్​ఆర్​హెడ్​ బౌలర్లలో షాబాజ్​ అహ్మద్​ 3 వికెట్ల ప్రదర్శన చేశాడు. అభిషేక్ శర్మ పాట్, కమిన్స్​, నటరాజన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్​ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్‌(34 బంతుల్లో 4 సిక్స్​ల సాయంతో 50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. రాహుల్ త్రిపాఠి(15 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్​ల సాయంతో 37), ట్రావిస్​ హెడ్‌(28 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్​ సాయంతో 34) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. అభిషేక్ శర్మ(12), నితీశ్ రెడ్డి(5), మారక్రమ్​(1), అబ్దుల్ సమద్(0) నిరాశ పరిశారు. ఇంపాక్ట్ ప్లేయర్​గా వచ్చిన షాబాజ్​ అహ్మద్​(18) పరుగులు చేశాడు. ఇక రాజ‌స్థాన్​ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ త‌లో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌ారు. సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

SRHను ఫైనల్‌ పంపేందుకు RCB సాయం - ఎలా అంటే? - IPL 2024 Qualifier 2 Match

పాకిస్థాన్​ జర్నలిస్ట్‌కు రైనా స్ట్రాంగ్‌ కౌంటర్‌ - ఇచ్చి పడేశాడు! - Suresh Raina

Last Updated : May 24, 2024, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.