ETV Bharat / sports

SRHను ఫైనల్‌ పంపేందుకు RCB సాయం - ఎలా అంటే? - IPL 2024 Qualifier 2 Match

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 4:00 PM IST

IPL 2024 Qualifier 2 Match RR VS SRH : ఐపీఎల్-2024లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అయితే ఆర్సీబీ సెంటిమెంట్​ వర్కౌట్​ అయితే ఎస్​ఆర్​హెచ్​ ఫైనల్​కు వెళ్లే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అర్థం కాలేదా? పూర్తి వివరాలు స్టోరీలో చదివేయండి.

Source The Associated Press
IPL 2024 Eliminator Match RR VS SRH (Source The Associated Press)

IPL 2024 Qualifier 2 Match RR VS SRH : ఐపీఎల్-2024లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఫైనల్‌ బెర్త్​ కోసం క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌ - సన్​రైజర్స్​ తలపడనున్నాయి. చెన్నై చెపాక్ వేదికగా ఈ హోరాహోరీ పోరు జరగనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీపడుతుంది.

అయితే ఈ సీజన్‌లో అదిరే ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్‌కు క్వాలిఫయిర్-1లో కేకేఆర్ చేతిలో చుక్కెదురైంది. ఈ ఓటమితో కొన్ని పాఠాలు నేర్చుకున్న సన్​రైజర్స్​ రాజస్థాన్‌ను ఎదుర్కోనుంది. మరోవైపు లీగ్ దశ చివర్లో వరుసగా ఓటములను అందుకున్న రాజస్థాన్ కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించి సన్‌రైజర్స్‌తో పోరుకు సిద్ధమైంది.

గణాంకాల పరంగా చూస్తే చెపాక్ స్టేడియం సన్‌రైజర్స్ కన్నా రాజస్థాన్​కే ఎక్కువగా అనుకూలంగా ఉంది. ఇక్కడ సన్​రైజర్స్​ ఆడిన పది మ్యాచుల్లో కేవలం ఒకే విజయం అందుకుంది. మరోవైపు రాజస్థాన్ తొమ్మిదింట్లో ఆడి రెండు సార్లు విజయం సాధించింది. దీంతో సన్​రైజర్స్​ ఫైనల్​కు వెళ్లాలంటే ఆర్సీబీ సెంటిమెంట్ వర్కౌట్​ అవ్వలని ఎస్​ఆర్​హెచ్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

అదేంటంటే - ఆర్సీబీని టోర్నీ నుంచి బయటకు పంపిన జట్టు ఇప్పటివరకు ట్రోఫీని ముద్దాడలేదు. 2010‌ ప్లేఆఫ్స్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించి ఆర్సీబీని ఇంటికి పంపింది. కానీ ఫైనల్‌లో ముంబయి ఓడిపోయింది. 2015లోనూ సీఎస్కేకు అదే పరిస్థితి ఎదురైంది. 2020లో ఆర్సీబీనీ ఇంటికి పంపిన సన్​రైజర్స్​ క్వాలిఫయిర్-2లోనే పరాజయం అందుకుంది. ఇంకా 2021, 2022 సీజన్లలోనూ ఆర్సీబీని ఓడించిన కేకేఆర్​, రాజస్థాన్ రాయల్స్‌ ఫైనల్‌లో ఓడి కప్‌ను చేజార్చుకున్నాయి.

అందుకే ఇప్పుడు ఈ సెంటిమెంట్ 2024లోనూ రిపీట్ అయితే ప్లే ఆఫ్స్​లో ఆర్సీబీని ఓడించిన రాజస్థాన్​కు ఇదే పరిస్థితి తలెత్తుందని ఎస్​ఆర్​హెచ్​ ఫ్యాన్స్​ భావిస్తున్నారు. క్వాలిఫయిర్-2లోనే రాజస్థాన్ ఓడిపోయి ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నారు. అలా సన్‌రైజర్స్‌‌ను ఫైనల్‌కు చేర్చడంలో ఆర్సీబీ పరోక్షంగా సాయం చేసినట్లవుతుందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి కీలక మ్యాచ్​లో ఎవరు గెలుస్తారో?

సన్​రైజర్స్ x రాజస్థాన్: డబుల్ 'R'లో ఫైనల్ బెర్త్ ఎవరిది? - IPL 2024

'మేం ఎవరిని సంప్రదించలేదు - వాళ్లు చెప్పేదంతా అబద్ధాలే' - Jay Shah on Teamindia Head coach

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.