ETV Bharat / sports

'మేం ఎవరిని సంప్రదించలేదు - వాళ్లు చెప్పేదంతా అబద్ధాలే' - Jay Shah on Teamindia Head coach

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 12:36 PM IST

Updated : May 24, 2024, 1:37 PM IST

Jay Shah on Teamindia HeadCoach : రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమ్​ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఆఫర్ చేస్తున్నా కోచ్ పదవిని చేపట్టడానికి విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో జై షా వివరణ ఇచ్చాడు. Source ANI

Source ANI
Jay Shah (Source ANI)

Jay Shah on Teamindia HeadCoach : టీమ్​ఇండియా హెడ్​ కోచ్​గా ఫారిన్‌ కోచ్​ను ఎంపిక చేసుకునేందుకు బోర్డు మొగ్గు చూపుతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియన్​ మాజీ కెప్టెన్, దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​ రికీ పాంటింగ్​ మాట్లాడుతూ హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ తనను సంప్రదించిందని, కానీ తాను రిజెక్ట్ చేసినట్​లు అన్నాడు. ఫ్లెమింగ్​ కూడా దాదాపుగా ఇలానే అన్నాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించాడు. తాను కానీ, బీసీసీఐ కానీ ఏ మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్​ను సంప్రదించలేదని పేర్కొన్నాడు.

"కోచ్​ పదవి ఆఫర్​ చేసేందుకు నేను కానీ బీసీసీఐ గానీ ఏ ఆస్ట్రేలియన్ క్రికెటర్​ను సంప్రదించలేదు. మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవం. జాతీయ జట్టుకు సరైన కోచ్​ను వెతకడం అనేది కచ్చితమైన, సమగ్రమైన ప్రక్రియ. భారత క్రికెట్​ నిర్మాణంపై లోతైన అవగాహన ఉన్న వారి కోసం, అలాగే ర్యాంకుల ద్వారా అంటే అంచెలంచెలుగా ఎదిగిన వారిపై దృష్టి సారించాం. టీమ్​ఇండియాను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి మన కోచ్‌కు దేశవాళీ క్రికెట్‌పై లోతైన పరిజ్ఞానం ఉండటం ఎంతో కీలకం ఇంటర్నేషనల్ క్రికెట్​లో భారత క్రికెట్​ జట్టు హెడ్​ కోచ్​ కన్నా మరో ప్రతిష్టాత్మకమైన రోల్​ లేదు. ప్రపంచవ్యాప్తంగా టీమ్​ఇండియాకు అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. వారి నుంచి భారీ మద్దతును జట్టు పొందుతోంది. మన గొప్ప చరిత్ర, ఆటపై ఉన్న మక్కువ వల్ల ఈ హెడ్ కోచ్ పాత్ర ప్రపంచంలోని అత్యంత గొప్ప ఉద్యోగాలలో ఒకటిగా మారింది" అని జైషా అన్నారు.

1000 రెట్లు అధికంగా తట్టుకోవాలి - హెడ్​ కోచ్​ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్‌, గౌతమ్ గంభీర్​తో పాటు లాంగర్‌ పేరు వినిపిస్తోంది. అతడు ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ తనకు ఓ కీలక విషయాన్ని చెప్పినట్లు లాంగర్​ పేర్కొన్నాడు. "ఆస్ట్రేలియా టీమ్​కు నాలుగేళ్లపాటు ప్రధాన కోచ్‌గా ఉన్నాను. చాలా అలసిపోయాను. ఎందుకంటే నేషనల్​ టీమ్‌ను నడిపించడం అంత ఈజీ కాదు. ఈ విషయమై కేఎల్ రాహుల్‌తో చర్చించాను. అప్పుడు అతడు నువ్వు ఐపీఎల్‌ జట్టు కోచ్‌గా ఎంత ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కొన్నావో టీమ్​ఇండియా హెడ్​ కోచ్‌గా వాటికి 1000 రెట్లు ఎక్కువగా తట్టుకోవాలి అన్నాడు." అని లాంగర్ చెప్పుకొచ్చాడు.

వరల్డ్​కప్​ వేళ USA సంచలనం- బంగ్లాకు షాకిచ్చి సిరీస్ పట్టేసిన అమెరికా - USA vs BAN T20 Series 2024

ఆఫర్ రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్​ - మరి స్టీఫన్​ ఫ్లెమింగ్‌ ఏం అంటున్నాడంటే? - TeamIndia Head coach

Last Updated : May 24, 2024, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.