ETV Bharat / sports

సన్​రైజర్స్ x రాజస్థాన్: డబుల్ 'R'లో ఫైనల్ బెర్త్ ఎవరిది? - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 6:56 AM IST

SRH vs RR IPL 2024: 2024 ఐపీఎల్​ క్వాలిఫయర్​- 2లో సన్​రైజర్స్​- రాజస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో నెగ్గి ఫైనల్​కు దూసుకెళ్లాలని ఇరుజట్లు ఆశిస్తున్నాయి. మరి ఇరుజట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే?

SRH vs RR IPL 2024
SRH vs RR IPL 2024 (Source: Associated Press)

SRH vs RR IPL 2024: 2024 ఐపీఎల్​లో క్వాలిఫయర్- 2కు రంగం సిద్ధమైంది. సన్​రైజర్స్​ హైదరాబాద్ ఈ ప్రతిష్ఠాత్మక పోరులో రాజస్థాన్ రాయల్స్​ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్​కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్​లో నెగ్గి ఫైనల్​కు దూసుకెళ్లాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి ఇరుజట్లు బలాబలాలు, ముఖాముఖి పోరు ఎలా ఉందంటే?

సన్​రైజర్స్: ఓటమితో సీజన్ ఆరంభంచినా తర్వాత అద్భుతంగా పుంజుకొని వరుస విజయాలతో సన్​రైజర్స్​ అదరగొట్టింది. ఎన్నడూ లేనంతగా బ్యాటింగ్​లో విరుచుకుపడి పలు రికార్డులు తమ పేరిట లిఖించుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాలకు తోడు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, మర్​క్రమ్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్​తో డీప్ బ్యాటింగ్ సన్​రైజర్స్ సొంతం.

ఇక భువనేశ్వర్ కుమార్, నటరాజన్​, ప్యాట్ కమిన్స్​తో పేస్ బలంగా కనిపిస్తోంది. కానీ, చెన్నై పిచ్​ పూర్తిగా స్పిన్​కు అనుకూలంగా ఉండనుంది. అయితే చెప్పుకోదగ్గ స్పిన్నర్ జట్టులో లేకపోవడం కాస్త కలవరపెడుతోంది. దీంతో నేటి మ్యాచ్​లో వాషింగ్టన్ సుందర్/ మయంక్ మార్కండేకు ఛాన్స్ వస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా సన్​రైజర్స్ బ్యాటింగ్​లోనే భారీ స్కోర్ నమోదు చేయాల్సి ఉంటుంది. మరోసారి బ్యాటింగ్ ఆర్డర్ రాణిస్తే అది పెద్ద కష్టమేమీ కాదు.

రాజస్థాన్: ఈ సీజన్​ ప్రారంభంలో రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోయింది. ఫస్ట్​ హాఫ్​లో పాయింట్ల పట్టకలో ఆగ్ర స్థానంలో కొనసాగింది కూడా. అయితే అనూహ్యంగా సెకండ్ హాఫ్​లో రాజస్థాన్ కాస్త తడబడింది. ఎలిమినేటర్ మినహా రాజస్థాన్ ఆడిన గత 6మ్యాచ్​ల్లో ఒక్కసారి నెగ్గలేదు. అందులో ఐదింట్లో ఓడగా​ ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే రీసెంట్​గా ఆర్సీబీతో ఎలిమినేటర్​లో మళ్లీ కమ్​బ్యాక్ ఇచ్చింది. తిరిగి ఫామ్​లోకి వచ్చి సత్తా చాటింది.

ఓపెనర్​ యశస్వీ జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్​మన్ పావెల్, హెట్​మయర్​తో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇటు బోల్ట్​, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ, ఆవేశ్ ఖాన్​తో బౌలింగ్​లోనూ రాజస్థాన్ పటిష్ఠంగానే కనిపిస్తోంది. పైగా చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడం వల్ల రాజస్థాన్​కు కలిసొస్తుంది. అశ్విన్, చాహల్ రూపంలో వీరికి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. పైగా గత మ్యాచ్​ విజయం ఇచ్చిన జోష్​లో క్వాలిఫయర్​లోనూ రాణించి ఫైనల్​కు దూసుకెళ్లాలని రాజస్థాన్ తహతహలాడుతోంది.

SRH vs RR Head to Head: ఇరు జట్లు సమవుజ్జీలని గత రికార్డులు చూస్తే తెలుస్తోంది. ఈ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడగా సన్​రైజర్స్​ 10, రాజస్థాన్ 9 మ్యాచ్​ల్లో నెగ్గాయి. ఈ సీజన్‌లో తలపడ్డ ఒక్క మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్‌పై గెలిచింది. దీంతో శుక్రవారం జరగనున్న మ్యాచ్​లో ఇరుజట్ల మధ్య గట్టిపోటీ ఉండడం ఖాయమనే అనిపిస్తోంది.

ఆర్సీబీ ఖేల్ ఖతం- ఎలిమినేటర్​లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ - IPL 2024

5ఏళ్ల తర్వాత సన్​రైజర్స్ అలా- అంతా కమిన్స్ వల్లే! - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.