ETV Bharat / spiritual

వాస్తు : ఇంట్లో ఈ మొక్కలు పెంచుతున్నట్టయితే - కష్టాలను పిలిచినట్టే! - Avoid These Plants As Per Vastu

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 5:16 PM IST

Avoid These Plants As Per Vastu : చాలా మందికి ఇంట్లో రకరకాల మొక్కలు పెంచే అలవాటు ఉంటుంది. ఇలా మొక్కలు పెంచడం వల్ల అనేక రకాల లాభాలుంటాయి. కానీ.. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో పెంచితే ఏమాత్రం మంచిది కాదని మీకు తెలుసా?

THESE PLANTS TO AVOID AT HOME
VASTU TIPS FOR PLANTS (ETV Bharat)

These Plants That Negative Energy Negative Energy To Home : స్వచ్ఛమైన గాలినిస్తాయి.. ఇంటికి అందాన్నిస్తాయి.. మనుషులకు ఆనందాన్నిస్తాయి.. కారణమేదైతేనేం ఈరోజుల్లో చాలా మంది ఇళ్లల్లో మొక్కల పెంపకం సాధారణమైపోయింది. నిజానికి ఇంటి ఆవరణంలో మొక్కలు పెంచడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి. కానీ.. వాస్తుప్రకారం కొన్ని రకాల మొక్కలు(Plants) ఇంటి ఆవరణలో ఉండకూడదని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వాటి వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీతోపాటు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. ఇంతకీ.. వాస్తుప్రకారం ఇంటి ఆవరణలో ఉండకూడని ఆ మొక్కలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బోన్సాయి మొక్కలు : చాలా మంది అలంకరణ కోసం ఇంట్లో బోన్సాయి మొక్కలను పెంచుకుంటుంటారు. నిజానికి చూడడానికి ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ, వాస్తుప్రకారం బోన్సాయి మొక్కలను ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదంటున్నారు వాస్తు పండితులు. ఎందుకంటే.. ఈ మొక్కలను ఇంటి లోపల ఉంచడం ద్వారా.. వృత్తి, వ్యాపారాలలో రకరకాల సమస్యలు ఎదురవుతాయట.

ముళ్ల మొక్కలు : వాస్తుప్రకారం ఇంట్లో ముళ్లు ముక్కలు ఉండడం కూడా అంత శ్రేయస్కరం కాదంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అలాంటి మొక్కల ఆకులపై ఉండే పదునైన ముళ్లు నెగటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయని నమ్ముతారు. ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడి, ఆందోళన పెంచుతాయట. అలాగే.. ఇంట్లో గందరగోళాన్ని పెంపొందిస్తాయని, భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తాయని నమ్ముతారు. అంతేకాదు.. ఆర్థిక ఇబ్బందులనూ కలిగిస్తాయంటున్నారు వాస్తు పండితులు.

పత్తి మొక్కలు : కొంతమంది పూజకు అవసరం అనే ఉద్దేశంతో ఇంటి ఆవరణంలో పత్తి మొక్కలు పెంచుతుంటారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో పెంచకూడదంటున్నారు వాస్తు పండితులు.

ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా? - వాస్తు ఏం చెబుతోందో తెలుసా? - VASTU TIPS FOR LEMON PLANT

చింత మొక్కలు : వాస్తుప్రకారం.. ఇంటి ఆవరణలో చింత చెట్టును కూడా పెంచకూడదంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. చింత మొక్కలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయట. మానసిక ప్రశాంతతనూ భంగపరుస్తాయట. అందుకే, వాటిని ఇంటి చుట్టూ, ఇంటి లోపల నాటకూడదంటున్నారు.

ఐవీ మొక్క : కొంతమంది ఇంటి అందాన్ని పెంచేందుకు ఐవీ మొక్కను కూడా తీసుకువస్తారు. కానీ.. ఐవీ మొక్క విషపూరితమైనదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే పెంపుడు జంతువులకు కూడా ఇది మంచిది కాదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

మీ ఇంట్లో ఈ మొక్కలు పెంచితే ఎన్నో 'లాభాలు'- ఫుల్ పాజిటివిటీతో హ్యాపీగా ఉండొచ్చు! - Best Indoor Plants For Home

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.