మత్స్యకారుల వలలో చిక్కిన 20 కిలోల భారీ చేప - 20 kg Fish Caught

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 11:01 PM IST

thumbnail
మత్స్యకారుల వలలో చిక్కిన 20 కిలోల భారీ మీనం (ETV Bharat)

Big Size Fish in Wanaparthy : చేపల కోసం మత్స్యకారులు వల వేయగా ఓ భారీ మీనం వలకు చిక్కింది. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మహ్మద్​ హుస్సేన్ పల్లి ఊర చెరువులో మత్స్య కారులు రెండు రోజులుగా చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో చేపలు చిక్కగా అందులో మూడు అడుగుల పొడవు 20 కిలోల బరువు ఉన్న మీనం కూడా వలలో పడింది. అంత భారీ చేపను చూసిన మత్స్యకారులు, గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.

Fishermen caught 20 kg Fish : ఇంత భారీ మీనం మన ప్రాంతంలో తక్కువగా లభిస్తుంటాయి. వలలో అరుదుగా చిక్కిన భారీ చేపను చూసేందుకు గ్రామస్థులు సైతం ఆసక్తి కనబరిచారు. స్థానికులే ఆ భారీ చేపను కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు తెలిపారు. సాధారణంగా అయితే భారీ చేపకు చాలా డిమాండ్​ ఉంటోంది. మరోవైపు సముద్ర తీరంలో దొరికే భారీ చేపలకు కొన్నిసార్లు లక్షల్లోనే ధర పలుకుతోంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.