ETV Bharat / city

TTD Incense Sticks: తితిదే బ్రాండ్​తో అగరబత్తీలు.. ఆ పూలతోనే తయారీ.!

author img

By

Published : Sep 13, 2021, 12:24 PM IST

తిరుపతిలోని ఎస్వీ గోశాలలో తితిదే అగరబత్తీలను(TTD Incense Sticks) ఆ సంస్థ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా 7 బ్రాండ్లతో అగరబత్తీలను విక్రయించనున్నట్లు తెలిపారు.

ttd-agarbattis-was-inaugurated-by-ttd-chairman-subbareddy-at-sv-goshala-in-tirupati
ttd-agarbattis-was-inaugurated-by-ttd-chairman-subbareddy-at-sv-goshala-in-tirupati

తితిదే (TTD)అగరబత్తీలను(TTD Incense Sticks) తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆ సంస్థ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా 7 బ్రాండ్లతో అగరబత్తీలను విక్రయించనున్నట్లు తెలిపారు. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి పేర్లతో.. తితిదే అగరబత్తీలను అందుబాటులోకి తీసుకురానుంది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో ఈ బత్తీలను విక్రయించాలని నిర్ణయించింది. తితిదే ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో ఈ బత్తీలను తయారు చేయనున్నారు. ఈ అగరబత్తీల తయారీకి దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది.

ఆలోచనకు పునాది పడింది ఇలా..

తితిదే (TTD) ఆలయాల్లో పూజ‌లు, అలంక‌ర‌ణ‌ల‌కు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. ప‌ర్వ‌దినాలు, ఉత్స‌వాల స‌మ‌యంలో అయితే పుష్పాల వినియోగం మ‌రింత అధికంగా ఉంటుంది. దేవతామూర్తులకు ఉప‌యోగించిన పుష్పాల‌న్నీ మ‌రుస‌టిరోజు ఉద‌యం తొల‌గిస్తారు. దీంతో స్వామివారి సేవ‌కు వినియోగించిన ఈ పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉప‌యోగించే విష‌యంపై తితిదే బోర్డు వినూత్న ఆలోచన చేసింది. ఈ క్రమంలో బెంగ‌ళూరు కేంద్రంగా పనిచేస్తున్న ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ తితిదే ఆల‌యాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాల‌ను అందిస్తే లాభంతో సంబంధంలేకుండా అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ సంస్థ‌తో తితిదే అవగాహన కుదుర్చుకొని ఎస్వీ గోశాల‌లో అగ‌ర‌బ‌త్తుల త‌యారీకి అవ‌స‌ర‌మైన స్థ‌లం కేటాయించింది. ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సొంత ఖ‌ర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియ‌మించుకుని కొన్ని రోజులుగా ప్ర‌యోగాత్మ‌కంగా అగ‌ర‌బ‌త్తుల ఉత్ప‌త్తిని ప్రారంభించింది.

అగ‌ర‌బ‌త్తుల త‌యారీ ఎలాగంటే..

తితిదే స్థానిక ఆల‌యాల్లో వినియోగించిన పుష్పాల‌ను ఉద్యాన‌వ‌న విభాగం సిబ్బంది ఎస్వీ గోశాల‌లోని అగ‌ర‌బ‌త్తుల త‌యారీ కేంద్రానికి త‌ర‌లిస్తారు. ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ పొందిన సిబ్బంది వీటిని ర‌కాల వారీగా పుష్పాల‌ను వేరు చేస్తారు. అనంత‌రం వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. ఆ త‌రువాత పిండికి నీరు క‌లిపి కొన్ని ప‌దార్థాల‌తో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్ర‌మాన్ని మ‌రో యంత్రంలో వేసి అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేస్తారు. వీటిని ప్ర‌త్యేక యంత్రంలో 15 నుంచి 16 గంట‌ల పాటు ఆర‌బెట్టిన త‌రువాత మ‌రో యంత్రంలో ఉంచి సువాస‌న వెదజ‌ల్లే ద్రావ‌ణంలో ముంచుతారు. చివ‌ర‌గా వీటిని మ‌రోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 ల‌క్ష‌ల అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసేలా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి: CM KCR: యాదాద్రికి సీఎం.. 17న చినజీయర్​ స్వామితో కలిసి పర్యటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.