ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

author img

By

Published : Nov 16, 2021, 6:57 AM IST

Updated : Nov 16, 2021, 10:07 PM IST

ETV BHARAT LATEST TOP NEWS
ETV BHARAT LATEST TOP NEWS

21:59 November 16

టాప్​న్యూస్​@ 10PM

  • 'అన్ని వేదికలపైనా నిలదీస్తాం..'

టీఆర్​ఎస్​ వేటాడడం ప్రారంభించిందని.. వరి కొనుగోళ్లు, సాగుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించే వరకు ఉద్యమం ఆపమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. 18 తేదీన ధర్నా తర్వాత కూడా ఉలుకు పలుకు లేకుంటే కేంద్రాన్ని వెంటాడి వేటాడుతామని స్పష్టం చేశారు. అన్ని వేదికలపైనా నిలదీస్తామన్నారు.

  • ఆమెకు 14.. అతడికి 29​

అభంశుభం తెలియని 14 ఏళ్ల బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఓ వ్యక్తి ఆమెతో పాటు బలవన్మరణానికి పాల్పడ్డాడు(lovers suicide in bhadradri kothagudem). ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

  • 'అవును.. లంచం ఇచ్చాం'

పదవిలో బదిలీకి సంబంధించి అవినీతి జరుగుతోందా అని రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​ అడిగిన ప్రశ్నకు ముక్త కంఠంతో అవునని సమాధానం వచ్చింది. దీంతో విస్తుపోవడం సీఎం వంతైంది.

  • 72 విమానాలు కొంటున్న ఝున్​ఝున్​వాలా

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ఏర్పాటు చేసిన విమానయాన సంస్థ 'ఆకాశ ఎయిర్‌' (akasa air news) 72 విమానాలను ఆర్డర్​ ఇచ్చింది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

  • 'పుష్ప' సాంగ్​ ప్రోమో

'పుష్ప'(pushpa allu arjun movie) చిత్ర బృందం అదిరిపోయే అప్టేట్​ ఇచ్చింది. ఈ చిత్రంలోని నాలుగో పాట 'ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ'కు సంబంధించి ప్రోమోను విడుదల చేసింది.

20:57 November 16

టాప్​న్యూస్​@ 9PM

  • వరివార్​..

మాటల యుద్ధం తీరా ప్రత్యక్ష యుద్ధంగా మారింది. నేతల మధ్య మాటలు.. శ్రేణుల మధ్య దాడుల దాకా వెళ్లాయి. 'గోబ్యాక్‌ నినాదాలు, కార్యకర్తల ఘర్షణలు, పోలీసుల లాఠీఛార్జ్‌'లతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్‌ పర్యటన రెండో రోజు సైతం ( Bandi Sanjay second day tour news) రణరంగాన్ని తలపించింది. 

  • 'దాడితో తెరాసకు సంబంధం లేదు'

రైతులను రెచ్చగొట్టి రోడ్డెక్కేలా చేసి భాజపా నేతలు భంగపడ్డారని.. రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ రైతులకు సమస్యగా మారారని మండిపడ్డారు.

  • ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన

స్థానికసంస్థల కోటా శాసనమండలి ఎన్నికల కోసం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు (Local body MLC Voter list). ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీలతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులతో కూడిన ఓటర్ల జాబితాను రూపొందించారు.

  • 5 వేల మందికి పురుడు పోసి

సుమారు 5 వేలమందికి పురుడు పోసిన ఓ నర్స్​... తన రెండో కాన్పులో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయారు. డెలివరీ ముందు రోజు వరకు ఆమె విధులు నిర్వహించినట్లు స్థానిక వైద్యాధికారులు తెలిపారు.

  • 'పునీత్ కోసం అంతా కలిసి ఆ పని చేద్దాం'

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్​కుమార్​కు (Puneeth Rajkumar death) పద్మశ్రీ వచ్చేలా అన్ని చిత్ర పరిశ్రమల ప్రముఖులు ప్రయత్నాలు చేయాలని తెలుగు సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj news) కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని పిలుపునిచ్చారు. 

19:55 November 16

టాప్​న్యూస్​@ 8PM

  • వెంటాడుతాం 

రాష్ట్ర రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు.

  • 'ఆయనకు ఎలా ఇస్తారు..?'

సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిపై (Venkatrami Reddy) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి భూ అక్రమాలకు సహకరించారని ఆరోపించారు. కోకాపేట భూ గోల్‌మాల్‌లోనూ ఆయన హస్తం ఉందన్నారు.

  • కుమార్తెను రేప్ చేసి చంపిన తండ్రి

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఈనెల 4న జరిగిన ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కిరాతకుడు. తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశాడు.

  • ఈ రికార్డులు బ్రేక్ అవుతాయా?

టీ20 ప్రపంచకప్​ (T20 World Cup 2021) నుంచి నిష్క్రమించిన బాధలో ఉన్న టీమ్​ఇండియా, ఫైనల్లో ఓడి కప్పు చేజార్చుకున్న ఆవేదనలో ఉన్న న్యూజిలాండ్​.. బుధవారం నుంచి టీ20 సిరీస్​లో (India vs New Zealand) తలపడనున్నాయి. 

  • నాగలక్ష్మి వచ్చేస్తోంది

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. బంగార్రాజు, రొమాంటిక్‌, నయీం డైరీస్​, శశివదనే చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

18:50 November 16

టాప్​న్యూస్​@ 7PM

  • పర్యటన ముగిసింది

నల్గొండ జిల్లాలో కేఆర్‌ఎంబీ(KRMB News) ఉపసంఘం సభ్యుల పర్యటన ముగిసింది. రెండో రోజు నాగార్జునసాగర్ (Nagarjuna sagar) ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్‌ను బృంద సభ్యులు పరిశీలించారు. గ్యాలరీ నుంచి సీపేజ్ వాటర్ లెవెల్ కొలతలు సేకరించారు.

  • వాహనానంపై 117 చలాన్లు.. పోలీసులు షాక్​..

ఓ ద్విచక్ర వాహనదారుడి వాహనానికి 117 చలాన్లు ఉండడటంతో ట్రాఫిక్‌ పోలీసులు (hyderabad traffic police) అవాక్కయ్యారు. 30వేల విలువైన చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఓ హోండా యాక్టివా వాహనాన్ని సీజ్ చేశారు (pending challans vehicle seize).

  • గడ్చిరోలి ఎన్​కౌంటర్​లో కొత్త ట్విస్ట్

ఛత్తీస్​గఢ్​ మహారాష్ట్ర సరిహద్దులోని గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఈనెల 19న జరిగిన ఎన్​కౌంటర్​లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 27కి చేరింది. తాజాగా నక్సల్​ కమాండర్​ సుఖ్​లాల్​ పర్చాకీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

  • 'ప్రైవేటు పెట్టుబడులతోనే స్థిరంగా దేశ ఆర్థిక వృద్ధి'

దేశ ఆర్థిక వ్యవస్థపై రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గవర్నర్​ శక్తికాంత్​ దాస్ (Shaktikanta Das RBI Governor) ​ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఆర్థికంగా పుంజుకుంటున్నట్లు అనేక గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. 

  • భారత్​లో 3 ఐసీసీ టోర్నమెంట్​లు

వచ్చే పదేళ్లలో భారత్​లో మూడు ఐసీసీ టోర్నమెంట్​లు జరగనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి.. రాబోయే దశాబ్ద కాలానికి సంబంధించిన 8 కొత్త టోర్నీల వివరాలను ప్రకటించింది. వాటికి 12 దేశాలు అతిథ్యమివ్వనున్నాయి.

17:57 November 16

టాప్​న్యూస్​@ 6PM

  • ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థులు ఖరారయ్యారు. చివరి నిమిషంలో బండా ప్రకాశ్‌, వెంకట్రామిరెడ్డి అవకాశం దక్కించుకున్నారు. నామినేషన్లు గడువు ముగియగా.. అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఆరు స్థానాల్లో ఆరుగురు తెరాస అభ్యర్థులతో పాటు ఇద్దరు శ్రమజీవి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

  • 'త్వరలో వేములవాడకు ఉపఎన్నిక!

తెలంగాణలో రైతు పరిస్థితి ఆగం అయిపోయిందని భాజపా ఎంపీ అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా భారీ కుంభకోణాలు వెలుగులోకి రావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో వేములవాడ ఉపఎన్నిక రావొచ్చని జోష్యం చెప్పారు. వేములవాడ ఉపఎన్నిక రావాలని కోరుకుంటున్నట్లు అర్వింద్‌ అన్నారు.

  • కర్తార్​పుర్​ కారిడార్​ రీఓపెన్

కరోనా కారణంగా మూతబడిన కర్తార్​పుర్​ కారిడార్​ను​ (kartarpur sahib corridor).. బుధవారం తిరిగి తెరవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రకటన చేశారు. కేంద్రం నిర్ణయంపై పంజాబ్​ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీహర్షం వ్యక్తం చేశారు.

  • యువతి దారుణ హత్య

డాబ్డీ ఠాణా పరిధిలోని ఓ నాలాలో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని దిల్లీ పోలీసులు ఆదివారం గుర్తించారు. ఆమె ముఖం, జననాంగాన్ని నిందితులు కాల్చేశారని వెల్లడించారు.

  • 'నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు'

తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికా (US China latest news) ప్రోత్సహించడాన్ని వ్యతిరేకిస్తూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ను నేరుగా హెచ్చరించారు (Biden XI meeting) చైనా అధినేత జిన్​పింగ్. నిప్పుతో చెలగాటమాడుతున్నారని, అలా చేసే వారంతా భస్మమైపోతారని వ్యాఖ్యానించారు.

16:47 November 16

టాప్​న్యూస్​@ 5PM

  • భూదాన్‌ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లికి (pochampally) అరుదైన గౌరవం లభించింది. చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన  పోచంపల్లిని ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ ఎంపిక చేసింది.

  • తెరాస శాసనసభాపక్షం భేటీ

తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెరాస శాసనసభపక్షం (TRSLP Meeting ) భేటీ అయింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు హాజరయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్‌ అభినందించారు.

  • హీరో​ కుటుంబంలో విషాదం

బిహార్ లఖీసరాయ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్​ సిలిండర్ల లోడ్​తో వెళ్తున్న ట్రక్కు ఢీకొని టాటా విక్టా వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా దివంగత బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ బంధువులు కావడం గమనార్హం.

  • ప్రవచనాలు చెబుతూనే 

కర్ణాటకలో హృదయవిదారక ఘటన జరిగింది. బెళగావి జిల్లాలోని బలోబల మఠం పీఠాధిపతి అయిన సంగనబసవ మహా స్వామీజీ ప్రసంగిస్తూనే ప్రాణాలు కోల్పోయారు.

  • పునీత్ సంస్మరణ సభ

ఇటీవల మరణించిన పునీత్​ రాజ్​కుమార్​కు నివాళి అర్పిస్తూ.. ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

15:47 November 16

టాప్​న్యూస్​@ 4PM

  • 'నేను కూడా ఓటీటీకి అభిమానినే'

ఓటీటీ, గేమింగ్‌కు పెరుగుతున్న ఆదరణ ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR Comments). హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగిన ఇండియా జాయ్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ తాను కూడా ఓటీటీకి అభిమానినేనని చెప్పారు.

  • సాగర్‌లో రెండో రోజు పర్యటన

నల్గొండ జిల్లాలో కేఆర్‌ఎంబీ(KRMB News) ఉపసంఘం సభ్యులు రెండో రోజు పర్యటించారు. నాగార్జునసాగర్(Nagarjuna sagar) ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్‌ను బృంద సభ్యులు పరిశీలించారు. గ్యాలరీ నుంచి సీపేజ్ వాటర్ లెవెల్ కొలతలు సేకరించారు.

'వారిది మాఫియావాదం.. మాది అభివృద్ధి నినాదం'

ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​ జిల్లా పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేను ప్రారంభించారు మోదీ. ఈ క్రమంలో గత పాలకులపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఓ భాగాన్ని.. మాఫియాకు రాసిచ్చేశారని విమర్శించారు.

  • కోచ్​గా ప్రయాణం షురూ

టీమ్​ఇండియా హెడ్​ కోచ్​గా బాధ్యతలు చేపట్టిన రాహుల్​ ద్రవిడ్ (Rahul Dravid News) పర్యవేక్షణలో.. క్రికెటర్లు తొలిసారి ప్రాక్టీస్ చేశారు. టీ20 కొత్త కెప్టెన్ రోహిత్​ శర్మకు బౌలింగ్ చేశాడు ద్రవిడ్. ఇది కొత్త ఆరంభం అంటూ ప్రాక్టీస్​కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది బీసీసీఐ.

  • 'అన్నతో రోజూ కొట్లాటే'

మెగాడాటర్ నిహారిక బోలెడు సంగతులు చెప్పింది. 'ఆలీతో సరదాగా' షోలో తెగ అల్లరి చేసింది. ఇంతకీ ఏమేం చెప్పిందంటే?

14:36 November 16

టాప్​న్యూస్​@ 3PM

  • ఆత్మకూరు(ఎస్‌)లో హైటెన్షన్​

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటనను తెరాస శ్రేణులు మరోసారి అడ్డుకునేందుకు యత్నించాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్​) సెంటర్‌లో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది.

  • 'ఆ ఓటమిని జీర్ణించుకోలేకే'

రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను గవర్నర్‌కు వివరించామని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్(BJP OBC national president Laxman) తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ కాన్వాయ్‌(attack on bandi sanjay in nalgonda)పై దాడి ఘటన నిరసిస్తూ భాజపా నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిశారు. 

  • రహదారిపై ల్యాండింగ్ అయిన మోదీ ఫ్లైట్​

యూపీలో పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​వేను ప్రారంభించారు ప్రధాని మోదీ. అంతకుముందు.. యుద్ధ విమానంలో అక్కడికి వెళ్లిన ఆయన.. రహదారిపైనే ల్యాండ్​ అయ్యారు.

  • టైర్ పేలి వాహనం బోల్తా- ఐదుగురు మృతి

టైర్ పేలి, వాహనం బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మహారాష్ట్రలో ఈ దుర్ఘటన(Maharashtra accident) జరిగింది. బిహార్​లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.

  • ఆనాటి విశేషాలు

భారత క్రికెట్​ అభిమానుల గుండె పగిలిన రోజు ఇది(sachin retirement day). క్రికెట్ గాడ్ అని ముద్దుగా పిలుచుకునే సచిన్.. ఆటకు వీడ్కోలు చెప్పి నేటికి(నవంబరు 16) ఎనిమిదేళ్లు అయింది. ఈ సందర్భంగా ఆనాటి విశేషాలు మరోసారి మీకోసం.

14:10 November 16

టాప్​న్యూస్​@ 2PM

  • యుద్ధ విమానంలో యూపీకి మోదీ

ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​ వేను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi news). అంతకుముందు సీ-130జే యుద్ధ విమానంలో రహదారిపైనే ల్యాండ్ అయ్యి.. వినూత్నంగా కార్యక్రమానికి హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి సాదర స్వాగతం పలికారు(Modi news latest).

  • 'సంపద'లో అమెరికాను దాటేసిన చైనా

సంపద విషయంలో అగ్రరాజ్యం అమెరికాను చైనా(china news today) దాటేసింది. 20ఏళ్లలో చైనా సంపద 7 ట్రిలియన్​ డాలర్ల నుంచి 120 ట్రిలియన్​ డాలర్లకు చేరగా.. అమెరికా సంపద 90 ట్రిలియన్​ డాలర్లకు పెరిగింది. అదే సమయంలో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగింది. ఈ వివరాలను ప్రముఖ కన్సల్టెంట్​ దిగ్గజం మెకన్సీ అండ్​ కో వెల్లడించింది(richest country in the world).

  • కియా నుంచి మరో కొత్త మోడల్

​ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా తన మార్కెట్​ను మరింత విస్తరించుకునేందుకు సిద్ధవువుతోంది. త్వరలోనే KY మోడల్​ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఈ వాహనాలను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధి చెప్పారు.

  • వార్నర్​ను తప్పించడానికి కారణం

ఐపీఎల్​లో వార్నర్​ను జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించారు. కనీసం తుది జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. ఈ క్రమంలో ట్రోల్స్​ వస్తున్న నేపథ్యంలో సన్​రైజర్స్ హైదరాబాద్​ సహాయ కోచ్ బ్రాడ్​ హాడిన్​ దీనిపై స్పందించాడు​. పేలవమైన ప్రదర్శన వల్ల వార్నర్​ను తప్పించారనేది నిజం కాదని అన్నాడు. అందుకు మరో కారణం ఉందని చెప్పాడు.

  • అందుకే చరణ్​తో ఆ సీన్ చేయించా

సాధారణ సన్నివేశాన్ని సైతం తన టేకింగ్‌తో భావోద్వేగంగా మలిచి ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేయడంలో సిద్ధహస్తులు దర్శక ధీరుడు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'మగధీర' రామ్‌చరణ్‌ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకుంది. అందులోని ఓ సన్నివేశం భావోద్వేగభరితంగా రావడానికి చిరంజీవి నటించిన 'కొదమ సింహం' చిత్రమే కారణమని రాజమౌళి ఇటీవల చెప్పుకొచ్చారు.

12:50 November 16

టాప్​న్యూస్​@ 1PM

  • చివ్వెంలలో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా చివ్వెంలలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay news) పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు తెరాస శ్రేణులు తరలివచ్చారు. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెరాస వర్గీయులకు పోటీగా భాజపా శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. కాగా కాసేపట్లో చివ్వెంలకు బండి సంజయ్ చేరుకోనున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. నిన్నటి ఘటనల దృష్ట్యా అప్రమత్తమయ్యారు.  

  • ఆడిట్లతోనే పారదర్శక వ్యవస్థ

కాగ్ తొలిసారి నిర్వహించిన 'ఆడిట్ దివస్' కార్యక్రమంలో(audit diwas ) ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బలమైన పారదర్శక వ్యవస్థకు ఆడిట్లు కీలకమన్నారు. కాగ్ కాలక్రమేణా ఎంతో బలంగా తయారైందని, ప్రతి తరం దీన్ని గుర్తుచేసుకోవాలన్నారు(pm modi latest news).

  • టీచర్ అఘాయిత్యం!

ఆరేళ్ల చిన్నారిపై విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది. మరో ఘటనలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం.. తన తల్లి స్నానం చేయిస్తుండగా వెలుగు చూసింది. ఈ ఉదంతంలో పక్కింటి వ్యక్తే నిందితుడని పోలీసులు గుర్తించారు.

  • పంత్​కు భయమంటే తెలియదు

టీమ్​ఇండియా వికెట్​కీపర్​,బ్యాట్స్​మన్​ రిషభ్​ పంత్​ ఆటతీరును తాను ఎంతగానో ఆస్వాదిస్తాడని చెప్పాడు ఇంగ్లాండ్​ ఆటగాడు జాస్​ బట్లర్​. పంత్​కు భయం అంటే తెలియదని, అతడు మంచి ఆటగాడని కితాబిచ్చాడు.

  • పునీత్​కు నివాళిగా స్పెషల్ ప్రోగ్రాం

కన్నడ పవర్​స్టార్​ పునీత్​ ఘనంగా నివాళి అర్పించేందుకు చిత్రపరిశ్రమ సిద్ధమైంది. 'పునీత్ గీత నామన' పేరుతో మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
 

12:00 November 16

టాప్​న్యూస్​@ 12NOON

  • తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థులు(TRS MLC candidates for MLA quota) ఖరారయ్యారు. ఆరు స్థానాలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లను అధిష్ఠానం ప్రకటించింది. ఎన్నికలకు నేటితో నామినేషన్లు ముగియనుండగా అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. అభ్యర్థులంతా అసెంబ్లీకి చేరుకున్నారు.

  • సర్దార్ పటేల్​ విగ్రహావిష్కరణ

దిల్లీలోని కాగ్ కార్యాలయంలో నిర్వహిస్తున్న తొలి 'ఆడిట్ దివస్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. పటేల్​కు నివాళిగా దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

  • అమెరికా కీలక సూచనలు

భారత్​కు వెళ్లే అమెరికన్ పౌరులకు పలు హెచ్చరికలను జారీచేసింది బైడెన్​ ప్రభుత్వం. వీటిలో కొవిడ్ నిబంధనలతో పాటు.. ఉగ్రవాదం సహా.. ఇతర అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు పాకిస్థాన్​కు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలపై పునరాలోచించుకోవాలని కోరింది.

  • టీ20 సిరీస్​కు కేన్​ ​ దూరం

టీమ్​ఇండియాతో(new zealand cricket team vs india) జరగనున్న టీ20 సిరీస్​కు న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్(kane williamson recent news)​ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు ప్రకటించింది(new zealand cricket team vs india). నవంబరు 25నుంచి కాన్పూర్​లో జరగనున్న టెస్ట్​ సిరీస్​పై మరింత దృష్టి పెట్టేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టిమ్​ సౌథీ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తాడని ప్రకటించింది.  

  • చెప్పిన తేదీకే 'భీమ్లా నాయక్'

సంక్రాంతి బరిలో తాను పక్కా ఉంటానని పవన్​ మరోసారి స్పష్టం చేశారు. 'భీమ్లా నాయక్'ను(bheemla nayak release date) చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ పండగకే 'ఆర్ఆర్​ఆర్'(rrr release date), 'రాధేశ్యామ్'(radhe shyam song) సినిమాలు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

10:49 November 16

టాప్​న్యూస్​@ 11AM

  • సిద్దిపేటకు నూతన కలెక్టర్‌

సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్​గా... హనుమంతరావు(Siddipet district new collector Hanumanth Rao)కు బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పాలనాధికారిగా(Sangareddy district collector) ఉన్న హనుమంతరావుకు.. అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

  • కుంటలో మృతదేహాలు

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయిపల్లిలో రెండు మృతదేహాలు(dead bodies found in pond) లభ్యం కావటం స్థానికంగా కలకలం రేపింది. దాదాయిపల్లి శివారులోని గచ్చుకుంటలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గ్రామస్థులు గుర్తించారు. 

  • భారీగా తగ్గిన పసిడి ధర

బంగారం (Gold Price today), వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే.. మంగళవారం భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.540 తగ్గింది. కిలో వెండి ధర ఏకంగా రూ.560 క్షీణించింది. ఆంధ్రప్రదేశ్, ​తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • సిరీస్​కు కేన్​ విలియమ్సన్​ దూరం

టీమ్​ఇండియాతో జరగనున్న టీ20 సిరీస్​కు న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు ప్రకటించింది.  నవంబరు 25నుంచి కాన్పూర్​లో జరగనున్న టెస్ట్​ సిరీస్​పై మరింత దృష్టి పెట్టేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టిమ్​ సౌథీ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నట్లు ప్రకటించింది. 

  • నాకున్న బంధం ప్రత్యేకమైనది

రోహిత్​శర్మతో(rohit sharma and yuzi chahal) తనకున్న బంధం క్రికెట్‌కు మించినది అని అన్నాడు టీమ్​ఇండియా లెగ్​ స్పిన్నర్​ యుజువేంద్ర చాహల్​. అందుకే మైదానంలో తన వ్యూహాలను స్వేచ్ఛగా పంచుకోగలుగుతానని చెప్పాడు.

10:14 November 16

టాప్​న్యూస్​@ 10AM

ఆరోగ్య సూచీలపై కార్యాచరణ

ప్రజల ఆరోగ్య సూచీల(Public Health Index)ను రూపొందించడంపై సన్నాహాలు మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు ఆన్​లైన్​లో అప్​డేట్​ చేయడానికి ఐఐటీ హైదరాబాద్​ ఆధ్వర్యంలో ఓ సాఫ్ట్​వేర్ తయారు చేశారు. దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించడానికి మంత్రులు హరీశ్, కేటీఆర్ ఆరోగ్య అధికారులతో భేటీ కానున్నారు.

భారత్లో కరోనా కొత్త కేసులు

భారత్​లో కరోనా(Coronavirus India) వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 8,865 మంది వైరస్ బారిన పడినట్లు (Corona cases in India) తేలింది. ఇది 287 రోజుల కనిష్ఠం కావడం గమనార్హం. కరోనా(Coronavirus India)​ ధాటికి మరో 197 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 11,971 మంది వైరస్​ను జయించారు.

ఒకే కుటుంబంలో ఆగురురు మృతి

బిహార్ లఖీసరాయ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్​ సిలిండర్ల లోడ్​తో వెళ్తున్న ట్రక్కు ఢీకొని టాటా విక్టా వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

ఎయిర్​పోర్టులో హార్ధిక్​కు షాక్​

టీ20 ప్రపంచకప్​(hardik pandya latest news) పూర్తి చేసుకుని దుబాయ్​ నుంచి స్వదేశానికి చేరుకున్న టీమ్​ఇండియా క్రికెట్​ హార్దిక్​ పాండ్యాకు ఊహించని షాక్​ తగిలింది. అతడి వద్ద నుంచి రూ.5కోట్ల విలువ చేసే ఖరీదైన వాచ్​లను కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

'భవదీయుడు భగత్​ సింగ్' వచ్చేది​ అప్పుడే!

హీరో పవన్​కల్యాణ్​-హరీశ్​శంకర్​(pawan kalyan harish shankar movie) దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'భవదీయుడు భగత్​ సింగ్'​ సినిమా రెగ్యులర్​ షూటింగ్​ను త్వరలోనే ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తుందట! ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు రిలీజ్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది(pawan kalyan bhavadeeyudu bhagat singh).

08:43 November 16

టాప్​న్యూస్​@ 9AM

  • ఈటల భూములపై నేటి నుంచి సర్వే

మాజీ మంత్రి ఈటల రాజేందర్(Farmer minister Etela rajender) భూముల సర్వే ఈరోజు నుంచి జరగనుంది. మెదక్ జిల్లాలోని భూముల సర్వే(land survey)కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. సర్వేకు రావాలంటూ ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డితో పాటు.... మరో 154మందికి ఈ నెల 8న నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా ఇవాళ అచ్చంపేట పరిధిలోని 130 సర్వే నెంబర్లోని భూములను సర్వే చేస్తారు.

  • పుట్టకముందే నేరస్థులను చేసిన ప్రభుత్వం!

ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టుమచ్చలతో పుట్టొచ్చు! కానీ నేరస్థులుగా పుడతారా? ఎవరైనా నేరం రుజువైతే నేరస్థులవుతారు... కానీ ఇంకా భూమ్మీద కళ్లు తెరవకుండా... తల్లి కడుపులోనే నేరముద్ర వేసుకొని భూమ్మీద పడే వారుంటారా? ఉంటారంది... (అ)నాగరిక బ్రిటిష్‌ ప్రభుత్వం! కోట్ల మందిని పుట్టుకతోనే నేరస్థుల్ని చేసింది. తరతరాలను నేర జాతులుగా శిక్షించింది. తాజాగా 'జై భీం' చిత్ర నేపథ్యానికి మూలం... తెల్లవారు తెచ్చిన 1871 నాటి నేరజాతుల చట్టం (Criminal tribes act)!

  • కొవిడ్‌ కారక మరణముప్పు దూరం

స్టాటిన్‌ మాత్రలు.. శరీరంలోని కొవ్వు స్థాయులను తగ్గించేందుకు ఉపయోగించే ఈ మందులు కరోనా కారణంగా తలెత్తే మరణముప్పును దూరం చేస్తాయని పరిశోధనలో తేలింది. ప్రధానంగా.. హృద్రోగ ముప్పును తగ్గించేందుకు వైద్యుల పర్యవేక్షణలో స్టాటిన్లను వాడితే మంచి ఫలితాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • జకీర్‌ సంస్థపై మరో ఐదేళ్లు నిషేధం

మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ(Zakir naik foundation) ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫొండేషన్‌పై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిన్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆయన ప్రసంగాలు ఒక నిర్దిష్ట మతానికి చెందిన యువత ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నట్లు తెలిపింది.

  • నేటి నుంచే ఇండోనేసియా మాస్టర్స్

ఇండోనేసియా మాస్టర్స్​ సూపర్​ 750 నేటి(నవంబరు 16) నుంచి ప్రారంభంకానున్నాయి(indonesia masters 2021). ఇటీవలే జరిగిన డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్​ నెగ్గలేకపోయిన భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు ఈ టోర్నీలోనైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.

07:57 November 16

టాప్​న్యూస్​@ 8AM

  • అవి తొలగితేనే దేశ భవితకు మేలు

ప్రస్తుత విద్యా వ్యవస్థ అనేక లోపాలు, అవలక్షణాలతో కూడుకుని ఉందన్నారు ప్రముఖ సంక్షేమ ఆర్థికవేత్త జాన్‌ డ్రెజ్‌. ఆన్‌లైన్‌ పాఠాలతో పేదపిల్లలకు నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య కోసం ఉద్యమంలా ముందుకుసాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలోని పాఠశాలల బాగుకోసం జాతీయస్థాయి కార్యాచరణ రూపొందించడం అవసరమని ఉద్ఘాటించారు. ఈ మేరకు 'ఈనాడు, ఈటీవీ భారత్‌' ప్రతినిధి ఎన్​. విశ్వప్రసాద్​తో ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు.

  • పనివాళ్లను పెట్టుకుంటున్నారా

పురుషులతో పాటు మహిళలూ ఉద్యోగం చేస్తుండటం వల్ల కొన్నిసార్లు ఇంటి పనుల(household chores)కు తీరిక ఉండదు. ఇంకా అత్తామామ, పిల్లలు ఇంట్లో ఉంటే ఆ పని రెండింతలవుతుంది. ఈ పనిభారం తగ్గాలంటే పనివాళ్లను పెట్టుకోవాల్సిందే. మరోవైపు.. పిల్లలు విదేశాల్లో ఉంటే.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సాయంగా పనులు చేయడానికీ పనివాళ్లు అవసరం. ఇలాంటి సందర్భాల్లో నమ్మకస్తులకే పని ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. కానీ నగరాల్లో అలాంటి వారు దొరకడం అరుదు. ఈ సమస్యకు చెక్ పెడుతున్నారు తెలంగాణ పోలీసులు(telangana police). పనివాళ్లను నియమించుకోవాలనుకునేవారు వారి వివరాలు తమకు తెలియజేస్తే విచారించి.. వాళ్లు మంచివాళ్లా కాదా అనేది చెప్పేస్తామంటున్నారు.

  • పోటీపై నేడు కాంగ్రెస్‌ నిర్ణయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై నేడు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు (Telangana MLC Elections) జరగనున్న 12 నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, ఆయా జిల్లాల ముఖ్య నాయకుల అభిప్రాయం తెలుసుకుని.. నవంబరు 16న సాయంత్రంలోగా తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంది.

  • 'కేన్ మామ.. వార్నర్ కాకా'

టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో(t20 world cup 2021 final) ఆస్ట్రేలియా-న్యూజిలాండ్​ తలపడ్డాయి. ఈ పోరులో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది ఆసీస్(T20 world cup winner)​. ఈ సందర్భంగా కేన్​ విలియమ్సన్​, వార్నర్​ను ఉద్దేశిస్తూ అఫ్గానిస్థాన్​ బౌలర్​ రషీద్​ ఖాన్(rashid khan latest tweet)​ ఓ ట్వీట్​ చేశాడు. ప్రస్తుతం అది వైరల్​గా మారింది.

  • ఈ వారం నామినేట్‌ అయింది వీళ్లే

బిగ్‌బాస్‌ తెలుగు 5 (Bigg Boss telugu 5)లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. వీకెండ్‌లో నాగార్జున(bigg boss nagarjuna telugu) వచ్చిన సందర్భంగా జరిగిన పరిణామాలపై ఇంటి సభ్యుల మధ్య చర్చ జరిగింది. ఇంతకీ నామినేషన్స్​లో ఉన్నది ఎవరంటే?

06:52 November 16

టాప్​న్యూస్​@ 7AM

  • ఉపశమనం దొరికేనా?

తమ భూములపై హక్కుల దక్కక తిప్పలు పడుతున్న రైతులు.. ధరణి సమస్యలపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఏళ్ల తరబడి పాసుపుస్తకాలం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తమకు ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఊరట కలిగిస్తాయని ఆశిస్తున్నారు. తమ సమస్యల వినతి పత్రాలను ప్రత్యక్ష పద్ధతిలో స్వీకరించాలని కోరుతున్నారు, మీసేవా, ధరణిలో దరఖాస్తు చేస్తే ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదని అంటున్నారు.

  • సత్వర న్యాయం స్వప్నమేనా?

ఒక కేసు పరిష్కారానికి సాధారణ కోర్టు 133 రోజులు తీసుకుంటుండగా, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు సగటున 122 రోజులు పడుతున్నట్లు ఓ పరిశీలనలో వెల్లడైంది. దీనివల్ల వాటి ఏర్పాటుతో ప్రయోజనం ఏముంటుందనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇవి సాధారణ కోర్టులకన్నా భిన్నంగా ఏమీ పనిచేయడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. నిర్దిష్ట కేసుల కోసం ఏర్పాటుచేసిన ఈ కోర్టులపైనా ఆయా కేసుల భారం భారీగా ఉండటమే ఇందుకు కారణం.

  • 'చట్ట ప్రకారమే ప్రత్యేక కోర్టుల పరిధి'

ప్రజాప్రతినిధులపై నమోదవుతున్న కేసుల విచారణ పరిధిపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ దాఖలు చేసిన ఓ పిటీషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. 'చట్టసభ్యులపై కేసుల వ్యవహారం' చట్ట ప్రకారమో, లేదంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ప్రకారమో ఉండాలి కదా? అని సుప్రీంకోర్టు(supreme court of india) స్పష్టీకరించింది.

  • బైడెన్​, జిన్​పింగ్ భేటీ

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇరు దేశాల అధినేతలు(biden xi meeting) సోమవారం సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు కీలక అంశాలపై జో బైడెన్​, జిన్​పింగ్ చర్చించినట్లు తెలుస్తోంది.

05:52 November 16

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

  • తెరాస శాసనసభాపక్ష భేటీ..

ధాన్యం కొనుగోళ్లు, విభజన హామీల అమలుపై..... కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళనకు తెరాస సన్నద్ధమవుతోంది. రైతు దీక్ష లేదా ధర్నా నిర్వహించాలని భావిస్తోంది. కార్యాచరణ రూపకల్పనకు సీఎం కేసీఆర్‌ ఇవాళ తెరాస శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపైనా కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

  • ఎమ్మెల్సీ పదవి లాంఛనమే..!

కొన్నేళ్లుగా సాగుతున్న ప్రచారానికి సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి(venkat ram reddy collector) తెరదించారు. స్వచ్ఛంద పదవి విరమణ(siddipet collector Venkata rami reddy resign news) చేసి.... రాజకీయాల్లో చేరతారన్న ఊహాగానాలను(Venkata rami reddy Joins in Politics) నిజం చేశారు. 25ఏళ్ల ఉద్యోగ జీవితానికి సోమవారం విరామం ప్రకటించారు. తెరాసలో చేరనున్న వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి లాంఛనమేనని తెలుస్తోంది.

  • మరికొన్ని గంటల్లో ఎమ్మెల్సీల జాబితా..

ఎమ్మెల్సీ అభ్యర్థుల(trs mlc candidates 2021)ను తెరాస కొద్దిగంటల్లో ప్రకటించనుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు(trs mlc nomination) దాఖలు చేయనున్నారు. స్థానిక సంస్థల కోటా ఎన్నికలకు నేడు నోటిఫికేషన్(trs mlc notification 2021) విడుదల కానుంది. ఐఏఎస్​కు రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డిని స్థానిక సంస్థల కోటాలో పోటీకి దించవచ్చునని తెరాస శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.

  • పన్ను రాయితీ ఇవ్వండి..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నిర్వహించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్​లో ప్రగతి భవన్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వాదనను కేంద్రానికి మంత్రి బలంగా వినిపించారు.

  • మాకు మూడు గంటలు చాలు..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెరాస కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల వైఫల్యాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

  • దిల్లీ హైకోర్టు జడ్జీగా గే..

దిల్లీ హైకోర్టు(Delhi High Court) న్యాయమూర్తిగా.. సీనియర్​ న్యాయవాది సౌరబ్ కిర్​పాలన్ పేరును సిఫార్సు చేసింది జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం. ఇప్పుడు ఈ సిఫార్సులను ఆమోదించి కేంద్రం నియామక ఉత్తర్వులిస్తే మన దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి స్వలింగ సంపర్క వ్యక్తి సౌరబ్ కిర్​పాల్​ అవుతారు.

  • చేరాల్సిన మొత్తం రెట్టింపు..

నవంబర్​ నెలలో పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సిన మొత్తాన్ని రెట్టింపు చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్​ తెలిపారు. ఈ నెల 22న ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

  • వాళ్ల పదవీకాలం పొడగింపు..

జాతీయ భద్రతా ఏజెన్సీల విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా ఏజెన్సీ చీఫ్​ల పదవీకాలన్ని మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

  • ఆస్ట్రేలియాలో మహాత్ముడి విగ్రహం ధ్వంసం

ఆస్ట్రేలియా మెల్​బోర్న్​ శివారులో గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధాని స్కాట్ మారిసన్.

  • ద్రవిడ్​ ఆ పని చేస్తాడు

న్యూజిలాండ్​ పర్యటన నుంచి టీమ్​ఇండియాలో కొత్త శకం ప్రారంభంకానుంది. భారత జట్టులో నూతన నాయకత్వ బృందం ఏర్పాటుకానుంది. ప్రధాన కోచ్​గా ద్రవిడ్, కెప్టెన్​గా రోహిత్, వైస్​ కెప్టెన్​గా రాహుల్​ బాధ్యతలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో.. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనే సంస్కృతిని​ ద్రవిడ్​టీమ్​ఇండియాలో నెలకొల్పుతాడని అన్నాడు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul News) .

  • 'గుడ్​లక్ సఖి' మరోసారి వాయిదా..

కీర్తి సురేశ్​ 'గుడ్​లక్ సఖి' సినిమాకు రిలీజ్ కష్టాలు తప్పడం లేదు. వరుసగా విడుదల తేదీలు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా కొత్త డేట్​ను ప్రకటించారు.

Last Updated :Nov 16, 2021, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.