ETV Bharat / city

Telangana police on maids: 'పనివాళ్లను పెట్టుకుంటున్నారా.. ముందు మాకు చెప్పండి'

author img

By

Published : Nov 16, 2021, 7:20 AM IST

పురుషులతో పాటు మహిళలూ ఉద్యోగం చేస్తుండటం వల్ల కొన్నిసార్లు ఇంటి పనుల(household chores)కు తీరిక ఉండదు. ఇంకా అత్తామామ, పిల్లలు ఇంట్లో ఉంటే ఆ పని రెండింతలవుతుంది. ఈ పనిభారం తగ్గాలంటే పనివాళ్లను పెట్టుకోవాల్సిందే. మరోవైపు.. పిల్లలు విదేశాల్లో ఉంటే.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సాయంగా పనులు చేయడానికీ పనివాళ్లు అవసరం. ఇలాంటి సందర్భాల్లో నమ్మకస్తులకే పని ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. కానీ నగరాల్లో అలాంటి వారు దొరకడం అరుదు. ఈ సమస్యకు చెక్ పెడుతున్నారు తెలంగాణ పోలీసులు(telangana police). పనివాళ్లను నియమించుకోవాలనుకునేవారు వారి వివరాలు తమకు తెలియజేస్తే విచారించి.. వాళ్లు మంచివాళ్లా కాదా అనేది చెప్పేస్తామంటున్నారు.

Telangana police on maids
Telangana police on maids

నివాళ్ల(maid)ను నియమించుకునేటప్పుడు వారి వివరాలు తమకు తెలియజేస్తే... విచారించి మంచివాళ్లా? చెడ్డవాళ్లా? అన్నది చెప్పేస్తామంటూ పోలీస్‌ ఉన్నతాధికారులు(telangana police) చెబుతున్నారు. రాజధానిలో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పనికోసం వచ్చి రూ.కోట్లు కొట్టేసి వెళ్తున్న ఘటనలు పెరుగుతుండటంతో పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. నేరం జరిగాక దొంగలు, నేరస్థులను పట్టుకోవడం కంటే...ఇళ్లలో పనికి కుదురుకోకముందే వారి నేరచరిత(criminals history)పై సమాచారం సేకరించి ఇంటి యజమానులకు ఉచితంగా తెలపనున్నారు. ఇందుకోసం ఇంటి యజమానులు చేయాల్సిందిల్లా... హాక్‌ఐ మొబైల్‌(hawk eye mobile app) యాప్‌లో విధుల్లోకి చేరేముందే పనివాళ్లు ఇచ్చిన ఆధార్‌, ఫోన్‌ నంబర్లు నమోదు చేయడం, లేదా బ్లూకోల్ట్‌ పోలీసులకు ఆ వివరాలు ఇవ్వడమేనని వివరిస్తున్నారు. రెండు నెలల్లో 45 వేలమంది హాక్‌ఐ మొబైల్‌యాప్‌(hawk eye app) ద్వారా తమను సంప్రదించగా.. వారికి సాయం చేశామని వివరించారు. వయోధికులు, పిల్లలు విదేశాల్లో..ఇక్కడ భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

ప్రైవేటు ఏజెన్సీలు..

ప్రస్తుతం పనివాళ్లు(maid) అవసరమైనవారు ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. వారికి నెలకు రూ.20వేలు చెల్లిస్తే చాలు.. పనివాళ్లకు గుర్తింపు కార్డులిచ్చి పంపుతున్నారు. పనివాళ్లు ఏదైనా దొంగతనం చేసినా, చేతివాటం చూపించినా... ప్రైవేటు ఏజెన్సీలదే బాధ్యత. మరోవైపు అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉంటున్న వారిళ్లలో పనిచేసేందుకు కొంతమంది కాంట్రాక్టర్లు తమ మనుషులను పంపుతున్నారు. పైకి ఇదంతా సవ్యంగానే కనిపించినా నేపాల్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, బిహార్‌ల నుంచి పనికోసం వస్తున్న వారిలో కొందరు నేరాలు చేసేందుకు మాత్రమే వస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చాక తమకు తెలిసినవారి వద్దకు వచ్చి పని ఇప్పించాలంటూ కోరుతున్నారు. నకిలీ గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. వీరి సాయంతో ఇళ్లల్లో పనిచేసేందుకు కుదురుకుని తర్వాత రూ.లక్షలు కొల్లగొట్టి పారిపోతున్నారు.

నేరచరితపై ఆరా..

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో 162 పోలీస్‌ ఠాణాలున్నాయి. ఆయా పోలీస్‌ ఠాణాల పరిధుల్లో నివాసముంటున్నవారు.

పనివాళ్లను నియమించుకునేముందు పోలీసులను సంప్రదిస్తే రెండు, మూడు రోజుల తర్వాత పోలీస్‌ అధికారుల వివరాలు చెప్పనున్నారు.

ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ సాయంతో గత నేరచరిత్రను పరిశీలించడం, పోలీసు రికార్డుల్లో లేనిపక్షంలో చిరునామా ఆధారంగా అక్కడి పోలీస్‌ ఠాణాలు, పక్క జిల్లాల్లో వాకబు చేస్తున్నారు.

కొద్దిరోజులు నమ్మకంగా ఉండి..

నేపాల్‌ నుంచి ఉపాధి పేరుతో వస్తున్న వారిలో కొందరు సంపన్నుల ఇళ్లల్లో పనికి కుదిరి నమ్మకం సంపాదించాక ఆహారం, పాలల్లో నిద్రమాత్రలు కలిపి మత్తులో ఉంచి... రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదుతో ఉడాయిస్తున్నారు.

బిహార్‌, రాజస్థాన్‌, అసోం, నాగాలాండ్‌ నుంచి భద్రతా సిబ్బందిగా పనిచేసేందుకు వస్తున్న కొందరు కొన్నినెలలు పనిచేశాక... నగానట్రాతో పరారవుతున్నారు. యజమానులకు అనుమానం వస్తే... వారిపై దాడులకు తెగబడి మరీ డబ్బు దోచుకెళ్తున్నారు.

ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, మెదక్‌, కడప, చిత్తూరు, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వస్తున్నవారు ఇళ్లల్లో పనివారుగా చేరుతున్నారు. తమకు ఇల్లు లేదని ఔట్‌హౌస్‌లో ఉంటామని చెబుతున్నారు. రెండు, మూడు నెలల్లోనే ఇంట్లో నగలు, నగదు దోచుకుని వెళ్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.