ETV Bharat / business

72 విమానాలు కొంటున్న ఝున్​ఝున్​వాలా.. ఎందుకంటే?

author img

By

Published : Nov 16, 2021, 8:58 PM IST

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ఏర్పాటు చేసిన విమానయాన సంస్థ 'ఆకాశ ఎయిర్‌' (akasa air news) 72 విమానాలను ఆర్డర్​ ఇచ్చింది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Rakesh Jhunjhunwala
రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా

ఆకాశ ఎయిర్​ పేరుతో (akasa air news) విమాన రంగంలోకి అడుగు పెట్టిన బిగ్​బుల్​ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా.. భారత్​లో సర్వీసులు ప్రారంభించడం కోసం 72 బోయింగ్​ విమానాలను ఆర్డర్​ ఇచ్చారు. ఈ మేరకు ఆమెరికాకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ నుంచి '737 మ్యాక్స్' విమానాలను దిగుమతి చేసుకోనున్నారు.

బోయింగ్​లోని రెండు వేరియంట్లు అయిన 737-8తో పాటు అధిక-సామర్థ్యం కలిగి ఉండే 737-8-200లను ఆకాశ్​ ఎయిర్​ ఆర్డర్​ ఇచ్చిందని బోయింగ్​ తెలిపింది. ఇప్పటికే రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ఏర్పాటు చేసిన విమానయాన సంస్థ 'ఆకాశ ఎయిర్‌'కు (Rakesh Jhunjhunwala Airlines) పౌరవిమానయాన శాఖ నుంచి ఎన్‌ఓసీ లభించింది.

ఇదీ చూడండి: కియా నుంచి మరో కొత్త మోడల్.. లాంచ్ ఎప్పుడంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.